Sunday, 27 April 2025

మకర్ సవర 10

 

కిష్టోబాబు గెండా ని"నేను వింటున్నదేమిటి?భూతి‌ మకర్ ని వదిలేసిందా?"అని అడిగాడు.
"ఆమెకి పిల్లలు కావాలి, బాబూ!"
మకర్ జైలునించి విడుదలకాగానే మంగళ్  ఈవిషయం చెప్పాడు. మకర్  ఇంటికి వచ్చి, నేలమీద పడిపడి ఏడ్చేడు.వాడు మంగళ్ తో అన్నాడు -"ఇది నన్ను  చాలా బాధపెడుతోంది ఫూల్!నన్ను బాధపెడుతోంది."
"కాని ఆమె ఎందుకు వదిలేసింది?"
మకర్  తల విదిల్చి  "చెట్లు  పండ్లను కాయాలని తహతహలాడతాయి.అలాంటప్పుడు ఒక స్త్రీ గొడ్రాలిగా,శాపగ్రస్తురాలిగా ఎందుకు మిగిలిపోవాలి? ఓ దేవుళ్ళారా!నేనేం పాపం చేసేను?ఎందుకు  నాకీ శిక్ష" అంటూ  ఆక్రోశించాడు.
గూడెంలోని సవరలు వచ్చి, అతన్ని ఓదార్చేరు
"మకర్, మకర్! ఎవరూ వరదల మీద ఆధారపడ కూడదు.వరదలు వచ్చి  పోతాయి. ఛకా నదిలా నిత్యం ప్రవహించే నది ఎప్పుడూ మోసం చేయదు.నీతో స్థిరంగా ఉండి పోవడానికి ఒక ప్రత్యేక తరహా సవర అమ్మాయి కావాలి. "
"వద్దు. ఇంకే పెళ్ళీ వద్దు. "
"ఈసారి నీకు  నేను ఒక నదినే తీసుకొస్తాను" అన్నాడు మంగళ్.
"ఇప్పుడు కాదు ఫూల్! "

మకర్  ఒంటరి వాడయ్యేడు.సవరలు వాడిని చూసి జాలి పడేవారు."పాపం బాబూ  సవర కొడుకు మకర్ ని చూడండి.కావా నవల పశువులాంటీవాడు.భార్యని‌‌ నిర్దాక్షిణ్యంగా కొడతాడు.అయినా వాడి భార్య  వాడితోనే ఉంటుంది.వాడికి పిల్లలని కంటుంది.మకర్  తన భార్యలని ఎప్పుడూ  కొట్టలేదు.వాళ్ళమీద అరవలేదు.కానీ వాడిని చూడండి
ఎలా శిక్షింఫబడుతున్నాడో.
మకర్  నెలలతరబడి ఆలోచించేడు‌.
చివరికి ఒకనాడు మంగళ్ తో "ఫూల్  ఇక నేనీ  ఒంటరితనాన్ని భరించలేను.కాని పెళ్ళి చేసుకోవాలంటేనాకు భయంగా ఉంది.ఇప్పుడు  నన్నేం చేయమంటావు? " అని అడిగేడు.
"మరోసారి  ప్రయత్నించు మకర్! ఈసారి ఫలితం ఉండొచ్చు.ఈసారి మకర్ తన ఊరికి దూరంగా ఉన్న చిన్న మాన్బజార్ కి చెందినరతన్ సవర  కూతురు  కుమారిని పెళ్ళి చేసుకున్నాడు.
ఆ అమ్మాయి  పేరే అద్భు తం సవరవలుఅన్నారు." మంగళ్  ఎంత మంచి స్నేహితుడు.అతను ఓ నదిని తీసుకుని వస్తానన్నాడు. అలాగే ఈ కుమారి అనే నదినే  తీసుకొచ్చాడు
మకర్! ఇది చాలా శుభ సూచికమైందిఏ.ఆమె నిన్ను ఎప్పుడూ  వదిలిపెట్టదని మేము ఖచ్చితంగా  నమ్ముతున్నాం"
"స్నేహితులారా!నన్ను  ఆశీర్వదించండి.నాకు మీ ఆశీస్సులు కావాలి"
కాని కుమారి రేవతి  కాదు, భూతీ కాదు .కొద్ది నెలలలోనే మకర్ ని పూర్తిగా  మార్చేసింది. మకర్  సరళ ‌స్వభావుడు..ఆమెకి మొరటుగా,మృగాల్లా ప్రవర్తించే మగాళ్ళే నచ్చుతారు.ఆమె దృష్టిలో సరళంగా మాట్లాడేవాడు దుర్భలుడు.

ఒకరోజు  ఆమె మకర్ ని అడిగింది"వాళ్ళిద్దరూ ఎందుకు వెళ్లి పోయారు? "అని.
" వాళ్ళనే అడుగు ."
"నాకు వాళ్ళేం సమాధానం చెప్తారో తెలుసు. వాళ్ళకి పిల్లలు కలగకపోతే వాళ్ళు ఎందుకుండాలి?"
"హస్త సాముద్రికుడు ఏం అన్నాడో తెలుసా? "
"ఏమన్నాడు?"
"నా మూడో భార్య వల్ల నాకు  పిల్లలు  కలుగుతారని"
"అయితే మంచిదే కదా."
కుమారి అడవికి  వెళ్ళి కట్టెలు తెచ్చి  వాటిని నయాగడ్ సంతలో అమ్మడానికి తనే తీసుకుని వెళ్ళింది. అక్కడామె సవర యువకులతో కబుర్లాడటం, పగలబడి నవ్వడం, పరాచికాలాడటం-అన్నీ చేసినా,మకర్  ఏమనకుఃడా,నిర్లిప్తంగా ఆమె కోసం ఎదురు చూసేడు.మకర్  నిర్లిప్తత ఆమెకి ఉక్రోషాన్ని కలిగించింది.

"నువ్వు మగాడివేనా?లేక మట్టి బొమ్మ వా?నేను మిగతా మగాళ్ళతో‌ మాట్లాడుతుంటే నువ్వు నవ్వి ఊరుకుంటావా?
" మరేం చేయాలి?నిన్ను  తన్నాలా?"
"మగాడివయితే అలాగే చేస్తావు.
"నేను మగాడినో,మట్టిబొమ్మనో నాతో సంసారం చేస్తున్న నీకు  తెలియదా?"
కుమారి  నిట్టూర్చి "మగాడివే ఇప్పుడు పనికెళ్ళు" అంది.
"నేను వాళ్లిద్దరినీ ఎప్పుడూ కొట్టలేదు. నిన్నెలా కొట్టేది?"


No comments:

Post a Comment