Saturday, 25 October 2025

బాధ్యతల బరువు

 

వయసొచ్చిన ఆడపిల్ల
తల్లితండ్రులకు
గుండెలపై భారమే

అది ఒకప్పటి మాట
తగిన అబ్బాయిని వెతికి
పెళ్లి చేయడం మాటలా

మెట్టిల్లు పుట్టింటిని
మైమరిపించాలి
ప్రేమించే భర్త లభించాలి

ప్రేమ  వివాహమైతే
ఇద్దరూ తల్లితండ్రులను
ఒప్పించాలి

తల్లితండ్రులకు
బాధ్యతలన్నీ తీరేవరకు
గుండెపై రాయి
అటుపై తమని తాము
పోషించుకోవడం
గుండెపై రాయి

25.10.25

పుస్తక నేస్తం

 

ప్రియ నేస్తాలు
తేది: 15.10.25

పుస్తకం
నా ప్రియ నేస్తం
బాల్యం  నుండి నువ్వు
నా నేస్తానివే
చందమామగా
బాల మిత్రగా
మా బొమ్మరిల్లుగా
వార పత్రికగా
మాస పత్రికగా
కథలుగ
కవితలుగ
నవలలుగ
నాటికలుగ
నేను గుండెకి హత్తుకోని
పుస్తకాలేవి
ప్రేమించిన పుస్తక నేస్తాలు
కోకొల్లలు
పుస్తకాలు మన వారసత్వ
సంపద
అవి ప్రియనేస్తాలు ఆజన్మాంతం


అపురూప దృశ్యం

 

పొగమంచు గుట్ట
ఆ పొగమంచులో
ఆ గుట్టని చేరుకోవాలని

గుట్టమీద అమ్మవారు
అమ్మవారి కోసం
పోటెత్తే జనం

పొగమంచు
గుట్ట అందం
అద్భుతం
గుట్టపైనుంచి  చూస్తే
మా ఊరు
అందాల లోయ
పొగమంచు  గుట్ట
అరుదుగా కనిపించే
అపురూప దృశ్యం

24.10.25

శిరోభారం

 

నెత్తిన భారం
రైతుకు  పంట  చేను
ధనరూపంలోకి
మారిన దాకా

మధ్య తరగతి తండ్రికి
పిల్లల చదువులు
ఆడపిల్లల పెళ్లిళ్ళు
తండ్రిగా
తన భారం
తీరేవరకు

ధనికులకు
తమ ఆస్తులను
కాపాడుకున్నంత వరకు
వాటిని మరింతగా
వృధ్ధి చేయనంతవరకు
తలపై భారం
దిగిపోదు ఎప్పటికీ

23.10.25


ఒకే గూటి పక్షులు. ...2

 

ఒకే గూటి పక్షులు
ఎక్కడ ఎగిరినా
చివరికి  చేరుకుంటాయి
తమ గూటినే

ఒకే  ఇంటి  వ్యక్తులు
తమ ఇంటినే
చేరుకుంటారు

తమ వాళ్ళనే
కలుసుకుంటారు

విప్లవకారులు
ఒక గూటి  పక్షులు

ఆధ్యాత్మిక వ్యక్తులు
ఒక గూటి పక్షులు

బడుగు జీవులు
ఒక గూటి పక్షులు

అనాధలు
అభాగ్యులు
ఒక గూటి  పక్షులు


దినదిన గండం

 అలల పై తేలే పడవ

హాయిహాయి ప్రయాణం 


రోజులు సాఫీగా

సాగినంతవరకు

మన జీవితం కూడా 

అలలపై తేలే పడవ 


సంద్రంలో  తుఫాన్లు 

పడవకి ప్రమాదం 


మన జీవితంలో సైతం 

ఎన్నో  తుఫాన్లు 

ధైర్యంగా ఎదుర్కోవాలంతే


సముద్రంలో వేటకి వెళ్ళే

జాలర్లకు తుఫాను

అపాయాలతో  జీవితం 

దినదిన గండమే 

21.10.25


ప్రయాణం

 మండుటెండలో 

నడుస్తున్న మనిషికి 

పల్లకిలో  ప్రయాణం


కష్టజీవి తాను

కష్టజీవికి పల్లకి పట్టిన

రోజొచ్చింది 

రైతన్నల 

రాజ్యమొచ్చింది


ప్రజాస్వామ్యానికి

పట్టం కట్టేం

సామాన్యుడే రాజు


కానీ

పల్లకిలో ప్రయాణం 

అంటే

పల్లకి  మోసేవారికి భారం

మనిషికి భారమివ్వని

సుఖ ప్రయాణమే

కావాలి మనకి

20.10.25

చీకట్లో బాణం

 

అవతలి వాళ్ళనుండి
సమాచారం రాబట్టడం కోసం
చీకట్లో  బాణం

పోటీ కోసం 
కధలు
కవితలు
నవలలు రాయడం
చీకట్లో బాణం

ప్రేమించిన అమ్మాయికి
ప్రేమలేఖ అందిస్తే
చీకట్లో బాణం

ఉద్యోగ ప్రయత్నం
చీకట్లో బాణం
అప్పు కోసం ప్రయత్నించడం
చీకట్లో  బాణం

ఎన్నికలలో
పోటీ చేయడం
చీకట్లో బాణం

రోగం ముదిరేక
ఆరోగ్యం కోసం
చేసే ప్రయత్నాలు
చీకట్లో బాణం

జీవితంలో చాలా సార్లు
చీకట్లో  బాణమే వేయాలి
మనకి కావలసిన
ఫలితం అందుకోవడానికి

19.10.25

నైపుణ్యం

 

ఏ పనిలో నైపుణ్యమంటే
అది ఎడమ చేతి ఆటే
ఎడమ చేతి  వాటమున్నా
ఎడమ చేతి ఆటే
చెయ్యి తిరిగిన
రచయితయినా
చిత్రకారుడయినా
వంటచేయడంలో
నైపుణ్యమైనా
వారికది
ఎడమచేతి ఆటే

18.10.25

నిశ్చయం

 భర్త మీద అలిగి

భార్య మొదటిసారి 

ఊళ్ళో ఉన్న 

పుట్టింటికి వెళ్ళిపోయింది 


ఆఫీసు నుండి 

వచ్చాక

అటూ ఇటూ 

తిరుగుతున్నాడు

కాలు కాలిన పిల్లిలా 


భార్య  తనకి

చెప్పనేలేదు

వెళ్తానని


ఎవరినైనా 

అడుగుదామంటే 

ఆత్మాభిమానం 


వంట చేసుకోవడం రాదు

బయటకి వెళ్లి 

తినాలనిపించలేదు 

ఏ తప్పులు చేసానా

అన్నదే ఆలోచన 

ఇంట్లో  లేని

భార్య  గురించి  దిగులు 

మరి కొద్ది  నెలల్లో

తండ్రిని కాబోతున్న 

సంతోషానికి 

ఈ పరిణామం 

ఓ గ్రహణం

పొద్దున్నే లేచి 

అత్తవారింటికి వెళ్ళి

బతిమాలో

బుజ్జగించో

తన భార్యని 

ఇంటికి  తెచ్చుకొని 

మహరాణిలా

చూసుకోవాలనే

నిశ్చయానికి 

వచ్చాడతను

17.10.25

మహాపర్వతం

 తలపై భారం

వింధ్య పర్వతం 

మోస్తున్నంత

అమ్మానాన్న 

కష్టంతో చదువుకున్నా

మంచి ఉద్యోగం  సంపాదించి 

వారికి  పేరు తేవాలి


మనసులో భారం కూడా 

గోవర్ధన పర్వతమంత 

అమ్మానాన్నలను

బాగా చూసుకోవాలి

తమ్ముడి బాధ్యత  

చెల్లి  బాధ్యత  

ఇకపై తనదే


బాధ్యతలు మోసేవారి

తలపై బరువు 

నిరంతరం 

మహా పర్వతమంత

15.10.25

Tuesday, 14 October 2025

కాల ప్రవాహంలో మనం

 

ప్రవాహం లో ఆకులు
తేలిపోతూ

ప్రవాహం తో కలిసి
మునుముందుకు
వెళ్ళిపోతూ

మనం కూడా
ప్రవాహం లో
ఆకుల్లాటి వాళ్ళమే

కాలప్రవాహంలో
మునుముందుకు
సాగిపోతాం

కొన్ని ఆకులు
ప్రాణ రహితమై
మట్టిలో కలిసి
అక్కడే ఆగిపోతాయి

12.10.25

వెన్నెల దీపం

 

నలువైపులా
అంధకారం
అకస్మాత్తుగా
వెలుగు చుక్క
అదే అవుతుంది
ఆశాదీపం
అంధకారంలో
చిరుదీపమైనా
మనకి
వెలుగు చుక్క
వెన్నెల దీపం

9.10.25

ప్రేమ వెలుగు

 

ప్రేమ
వెలుగుల  వలయం
యువతీ యువకుల
ప్రేమ అందంగా
మధురంగా
వెలుగుతో నిండిపోతుంది
ఆ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు
ఏ చీకటీ  వారికి తెలియదు
ఇరు హృదయాలు
వెలుగుతో నిండి
పరవశం
ఆనందం
వారిదౌతుంది

8.10.25

పరుగు

 

మనిషి
భయపడి పరిగెడితే
నీడ కూడా  పరిగెడుతుంది

పిరికిపందై పరిగెడితే
నీడ కూడా పరిగెడుతుంది

దొంగతనాలకి
అలవాటు పడితే
జనం వెంటపడితే
నీడ కూడా పరిగెడుతుంది

పోలీసుల నుండి
తప్పించుకోవాలని
పరుగులు తీస్తే
నీడ కూడా
పరిగెడుతుంది

7.10.25

విజయం ఆమె లక్ష్యం

 

పగటి కల
ఆమె ఇంట్లో
పని చేస్తున్నంతవరకూ

కలెక్టర్ అయి
ప్రజలకు
సేవ చేస్తుంది
పోలీస్ ఆఫీసర్ అయి
పేరు మోసిన నిందితులను
పట్టుకుంటుంది
ఉపాధ్యాయురాలిగా
విద్యార్థుల మెప్పు
పొందుతుంది
గ్రామీణ ప్రాంతాలలో
పంట పొలాల మధ్య
తిరుగుతుంది
శాస్త్రవేత్తగా విజయాలు
సాధిస్తుంది
ఆ పగటి కలలే
ఆమె స్వప్నాలు
ఆశయాలు
ఏదో ఒక
రంగంలో
విజయాన్ని కైవసం
చేసుకోవడమే
ఆమె
పగటికల

6.10.25

అక్షరాల ఆరాధన

 

అక్షరాల ఆరాధన

తేది: 20.8.25

అక్షరాభ్యాసం తో
మొదలౌతుంది
అక్షరాల ఆరాధన
తల్లీ నిన్ను తలంతు
నిరతము అనుకుంటా
అక్షరాల ఆరాధన
విద్యార్థులకు
ఉపాధ్యాయులకు
తల్లితండ్రులకు
సాహితీవేత్తలకు
శాస్త్రవేత్తలకు
సంగీత ఆచార్యులకు
తప్పనిసరి
మానవ ప్రగతి
అక్షరాల ఆరాధన లోనే
ఇమిడిఉంది


Sunday, 5 October 2025

కత్తి మీద సాము

 

కత్తి పైన నడక
ఆ అమ్మాయిది
ప్రేమించిన వ్యక్తి  కోసం
ఇల్లు వదిలి  వచ్చేసింది
పరువుకి ప్రాణమిచ్చే తండ్రి
ప్రేమిస్తున్నానంటూ
వెంటపడ్డ ప్రేమికుడు
మొహం చాటేసి
ధనికురాలైన
మరో అమ్మాయికి
తాళి కట్టేసాడు
ఇప్పుడు  ఆమె
జీవితం 
కత్తిమీద నడక
ఎక్కడో ఏదో ఉద్యోగం
వెతుక్కుని
స్థిరపడాలి తప్ప
తిరిగి ఇంటికి వెళ్ళే
సాహసం  చేయలేదు


ముళ్ళ కిరీటం

 

రాజుకి
సింహాసనం
ముళ్ళకిరీటం
ఎప్పుడు  ఏ రాజులతో
యుద్ధం  చేయాలో
ప్రధానికి తన పదవి
ముళ్ళ కిరీటం
దేశసేవ చేస్తూ
పదవిని
కాపాడుకోవాలి
నేటి ఇల్లాలికి
ఇల్లు
పిల్లలు
ఆఫీసు
అన్నిటినీ
సమన్వయ పరుచుకోవడం
ముళ్ళకిరీటం
జవాన్ కి
సరిహద్దులు కాపాడటం
తనవారి కోసం
జీవించడం
ప్రతిరోజూ ముళ్ళకిరీటమే
రైతుకి పంట పండించడం నుండి
తన కష్టానికి  ఫలితం
పొందేవరకూ
ముళ్ళకిరీటమే

4.10.25

Saturday, 4 October 2025

ఎంతందం

 

ఏనుగుల గుంపు
అడుగు వెనక అడుగు
చీమల దండుగ
ఒకటి  వెనుక  మరొకటి
బాతుల వరుస అందంగా
అబ్బాయి అమ్మాయి
అడుగు వెనక అడుగు
అంతా ఒద్దికగా
క్రమశిక్షణగా
ఇసుకలో
అడుగు వెనక అడుగు
ఎంతందం

18.9.25

ఒడిసి పట్టుకో

 

పట్టుకో పట్టుకో
మంచి అవకాశాలు
జారవిడుచుకోకు
మంచి  స్నేహాలు
బంధాలు
వదులుకోకు
తల్లితండ్రులు నీకిచ్చిన
సంస్కారాన్ని
మన సంస్కృతి
వదులుకోకు
కుటుంబంతో
గడిపే
అపురూప క్షణాలు
అద్భుత జ్ఞాపకాలు
పదిలంగా  దాచుకో
కాలం అమూల్యం
ముందుకు నడిచిపోవడమే
దాని లక్షణం
ఒడిసి పట్టుకో
నీ చేతిలో ఉన్న కాలాన్ని

21.9.25

చల్లని మేఘం

 

చల్లని మేఘం
వర్షించడానికి
సిద్ధంగా ఉన్న మేఘం
చిటపట చినుకులుగా
మారుతున్న మేఘం
రైతన్నకి ఇష్టమైన  మేఘం
వేసవిలో జనం
ఎదురుచూసే
మేఘం
మనందరకీ
ఎంతో ఇష్టమైన మేఘం 

24.9.25

అన్వేషణ

 

అన్వేషణ
ఒక దీపం
చీకట్లో  ప్రయాణిస్తున్నా
మనకి
దారి చూపుతునే
ఉంటుంది
మన అన్వేషణ
తరువాతి తరాలకు
వెలుగు చూపే
కాగడాగా
మారుతుంది

25.9.25

వెలుగు చుక్కలు

 

వెలుగు చుక్క
అమావాస్య చీకట్లో
సైతం ప్రకాశిస్తుంది
మనకి దారి చూపుతుంది
జీవితాన  మనకి
సన్మార్గం  చూపే
వెలుగు చుక్కలెన్నెన్నో
మనని ఉన్నత
శిఖరాలకి తీసుకెళ్ళే
వెలుగు చుక్కలెన్నాన్నో
ఆలుమగలే ఒకరికొకరు
కావొచ్చు  వెలుగుచుక్కలు
పిల్లలే తల్లి తండ్రుల
ఆశాదీపాలు

26.9.25

స్వప్నాలు

 తేది: 21.9.25

శీర్షిక: స్వప్నం సాకారమైతే...


రంగు  రెక్కల స్వప్నాలు

యువతవే

అబ్బాయిల స్వప్నాలు 

అమెరికాలో

గ్రీన్ కార్డ్ తో

స్థిరపడటం

అమ్మాయిలు కూడా 

నేడు ఆరోగ్యకరమైన పోటీ 

తన మనసుకి నచ్చిన 

తన కుటుంబానికి  నచ్చిన 

అబ్బాయి తనకి

తోడు నీడ కావాలని

అండ దండ అవ్వాలని

సీతాకోక చిలుకల్లాటి

అమ్మాయిల రంగు రంగుల

స్వప్నాలు 

స్వప్నాలు సాకారం 

కావొచ్చు 

తప్పటడుగులు వేస్తే

తమ రంగు రంగుల 

స్వప్నాలు కరిగిపోవచ్చు 


ఇది నా స్వీయ కవిత 

డాక్టర్ గుమ్మా భవాని


వెలుగు దారి

 

వెలుగు దారిలో
పయనించు
విద్య  నీకు
చూపుతుంది వెలుగు దారి
మానవత్వమే
వెలుగు దారి
అందరినీ ప్రేమించడం
వెలుగు దారి
తోటి మనిషికి
సాయపడటం
వెలుగు దారి
మహనీయుడివై
వెలిగిపోతావు
వెలుగుదారిని
నీదారిగ మార్చుకుంటే

27.9.25

ఉప్పెన

 

ఉప్పెన ఊళ్ళనే
మింగేస్తుంది
పంటచేలను
ముంచేస్తుంది
జన జీవనం
అల్లకల్లోలమౌతుంది
ప్రభుత్వ యంత్రాంగాన్ని
పరుగులు  పెట్టిస్తుంది
కోట్ల నష్టం
రాష్ట్రాలకి
ప్రజలకి
ప్రకృతి  విలయతాండవం
నిర్లక్ష్యం కూడదు
అప్రమత్తతమై ఉండాలి
ఎల్లవేళలా

28.9.25

గడియారం

 

గడియారంలో ముళ్ళు
పరిగెత్తుతునే ఉంటాయి
సెకన్ల ముల్లు  త్వర త్వరగా
నిముషం తెలియకుండానే
గంటల ముల్లు హుందాగా
గడియారం మనని కూడా
పరిగెట్టిస్తుంది
బడికి
ఆఫీసులకి
వంటకి
భోజనాలకి
వెనుతిరిగి చూసుకొని
అప్పుడే షష్ఠి పూర్తి
అయిపోయిందా
అనుకుంటాం
విశ్రాంతిగా ఉన్నప్పుడు
పరుగులు తీసే
గడియారాన్ని
చూస్తూనే ఉంటా

29.9.25

గుండె కోత జ్ఞాపకాలు

 అంశం: కత్తి కన్నా పదునైనవి జ్ఞాపకాలు 

ప్రతి క్షణం గుండెను కోస్తూ

తేది:24.9.25

శీర్షిక:  గుండెకోత జ్ఞాపకాలు 


ఆలుమగలు 

హాయిగా  కాపురం కొనసాగిస్తుంటే

ఏ ఒక్కరు ఒంటరిగా మిగిలినా

కత్తి కన్నా  పదునైనవి 

గుండెను కోసే జ్ఞాపకాలు

గాఢంగా  ప్రేమించిన అమ్మాయి 

తండ్రి మాటకి తలవంచి దూరమైతే

గుండెను పిండే జ్ఞాపకాలు 

మిగిలిపోతాయి ఎప్పటికీ  

ప్రేమించిన ప్రియుడు

మోసం చేసి నమ్మకాన్ని  వమ్ముచేస్తే

తీపి జ్ఞాపకాలు  తేనె పూసిన

కత్తవుతాయి 

తల్లితండ్రులను కోల్పోయి 

అనాధలయిన పిల్లల కన్నీరు  

జ్ఞాపకాల రక్త కన్నీరే

గత జ్ఞాపకాలు గుండెను 

కోసేవి ఎన్నెన్నో 


ఇది నా స్వీయ కవిత 

డాక్టర్ గుమ్మా భవాని 

Result declared


రాతిగోడ

 

రాతి గోడ
సుధృడం
మానవుడి  సాంకేతిక
పరిజ్ఞానానికి
నిదర్శనం
రాతి గోడలలో
అమాయకులని
బంధించవద్దు
రాతి గోడల మధ్య
నివసించి
మనుష్యుల మధ్య
దూరం పెంచొద్దు
దేవాలయాలు
గ్రంధాలయాలు
విశ్వ విద్యాలయాలు
రాతి గోడలమధ్య
మరింత  సురక్షితం
మనోహరం
చరిత్రలో
ఎన్నో  కట్టడాలు
రాతిగోడలవే
ఈనాటికీ
దర్శిస్తుంటాం మనం

1.10.25

విత్తనం

 

చిన్న విత్తనమే
మహా వృక్షం
పసిపాపే అవుతుంది
దేశాన్నేలే ప్రధాని
మరో శిశువు
కాలంతో పాటు
అడుగులేస్తూ
అంతరిక్షాన్ని చేరుకుంటుంది
అమ్మ ఒడిలోని పాపలే
విద్యార్థి దశ దాటి
ఉపాధ్యాయులు
వైద్యులు
జవాన్ లు
రైతన్నలు
ఎన్నెన్నో  వృత్తులలో
పాప అమ్మగా
అమ్మ అమ్మమ్మగా
విత్తనం
మహావృక్షమైనట్టు
వంశవృక్షం కూడా
విస్తరిస్తుంది

2.10.25

వెలుగు రేఖలు

 

అంశం:చీకటి  కిటికీ
తేది: 28.9.25
శీర్షిక: వెలుగు రేఖలు
ఈ గదిలో
నేను బందీని
గదిలో చీకటి
బయట చీకటి
కిటికీలో నుండి చూసినా
చీకటే
అయినా నాకు ఆశ
త్వరగా  తెల్లవారుతుందని
ఈ చీకటి కిటికీ నుండి
అరుణోదయాన్ని చూస్తానని
ఈ చీకటి కిటికీ  వెలుగులో
నన్ను  చూసి
నా కష్టం  తెలుసుకుని
నన్ను  స్వేచ్ఛా ప్రపంచం లోకి
తీసుకెళ్తారని
చీకటి కిటికీలోకి కూడా
వెలుగురేఖలు  వస్తాయి
వెలుగు నిండుతుంది
మన జీవితంలో

ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని


రాతలోనే జీవితం

 

చిన్నప్పుడు
కాలేజీ లో
వ్యాసకర్త ని నేను

ఆ తరువాత
సరదా కవితలు
ఉగాది కవితలు
కలం
కాగితం మీద
పరుగులు తీయించే
భావాలు

ఇప్పుడు  చిన్న కథలు
అప్పుడప్పుడూ పెద్దవి

ఎందరికి నచ్చిందో
లెక్కించుకుంటా
వీరు కదా
నా అభిమానులని
సంబరపడతా

రాయడం
నా అలవాటని
రాతలోనే జీవితమని
తెలుసుకున్నా
ఇప్పుడప్పుడే

ఇప్పుడు
కవితలే
నా సఖులు

22.9.25

నమ్మకం

 రైతుకు సాయంగా 

వర్షం కురిపించగలమని

సూర్యుడిని కప్పేసి

చల్లదనం  ఇవ్వగలమని

మేఘాల  నమ్మకం 

ప్రగతి పథంలో

ముందుకి నడిచే మానవుడు

కాలుష్యాన్ని దూరం

చేస్తాడని

మేఘాల నమ్మకం

23.9.25

ఊహాలోకం

 

ఆ లోకం లో
ఆనందాల హరివిల్లు
సంతోషాల విరిజల్లు
చిన్నారుల కేరింతలు
యువతీ యువకుల
ఆటపాటలు
విద్యని తపస్సుగా
పరిగణించే
సరస్వతీ పుత్రులు
అసమానతలు లేని
లోకం
అనాధలు లేని
లోకం
కళకళలాడే మొహాలతో
వృద్ధులు
లోకం
ఇదే లోకం అయితే
ఎంత హాయి

14.9.25