Saturday, 25 October 2025

బాధ్యతల బరువు

 

వయసొచ్చిన ఆడపిల్ల
తల్లితండ్రులకు
గుండెలపై భారమే

అది ఒకప్పటి మాట
తగిన అబ్బాయిని వెతికి
పెళ్లి చేయడం మాటలా

మెట్టిల్లు పుట్టింటిని
మైమరిపించాలి
ప్రేమించే భర్త లభించాలి

ప్రేమ  వివాహమైతే
ఇద్దరూ తల్లితండ్రులను
ఒప్పించాలి

తల్లితండ్రులకు
బాధ్యతలన్నీ తీరేవరకు
గుండెపై రాయి
అటుపై తమని తాము
పోషించుకోవడం
గుండెపై రాయి

25.10.25

పుస్తక నేస్తం

 

ప్రియ నేస్తాలు
తేది: 15.10.25

పుస్తకం
నా ప్రియ నేస్తం
బాల్యం  నుండి నువ్వు
నా నేస్తానివే
చందమామగా
బాల మిత్రగా
మా బొమ్మరిల్లుగా
వార పత్రికగా
మాస పత్రికగా
కథలుగ
కవితలుగ
నవలలుగ
నాటికలుగ
నేను గుండెకి హత్తుకోని
పుస్తకాలేవి
ప్రేమించిన పుస్తక నేస్తాలు
కోకొల్లలు
పుస్తకాలు మన వారసత్వ
సంపద
అవి ప్రియనేస్తాలు ఆజన్మాంతం


అపురూప దృశ్యం

 

పొగమంచు గుట్ట
ఆ పొగమంచులో
ఆ గుట్టని చేరుకోవాలని

గుట్టమీద అమ్మవారు
అమ్మవారి కోసం
పోటెత్తే జనం

పొగమంచు
గుట్ట అందం
అద్భుతం
గుట్టపైనుంచి  చూస్తే
మా ఊరు
అందాల లోయ
పొగమంచు  గుట్ట
అరుదుగా కనిపించే
అపురూప దృశ్యం

24.10.25

శిరోభారం

 

నెత్తిన భారం
రైతుకు  పంట  చేను
ధనరూపంలోకి
మారిన దాకా

మధ్య తరగతి తండ్రికి
పిల్లల చదువులు
ఆడపిల్లల పెళ్లిళ్ళు
తండ్రిగా
తన భారం
తీరేవరకు

ధనికులకు
తమ ఆస్తులను
కాపాడుకున్నంత వరకు
వాటిని మరింతగా
వృధ్ధి చేయనంతవరకు
తలపై భారం
దిగిపోదు ఎప్పటికీ

23.10.25


ఒకే గూటి పక్షులు. ...2

 

ఒకే గూటి పక్షులు
ఎక్కడ ఎగిరినా
చివరికి  చేరుకుంటాయి
తమ గూటినే

ఒకే  ఇంటి  వ్యక్తులు
తమ ఇంటినే
చేరుకుంటారు

తమ వాళ్ళనే
కలుసుకుంటారు

విప్లవకారులు
ఒక గూటి  పక్షులు

ఆధ్యాత్మిక వ్యక్తులు
ఒక గూటి పక్షులు

బడుగు జీవులు
ఒక గూటి పక్షులు

అనాధలు
అభాగ్యులు
ఒక గూటి  పక్షులు


దినదిన గండం

 అలల పై తేలే పడవ

హాయిహాయి ప్రయాణం 


రోజులు సాఫీగా

సాగినంతవరకు

మన జీవితం కూడా 

అలలపై తేలే పడవ 


సంద్రంలో  తుఫాన్లు 

పడవకి ప్రమాదం 


మన జీవితంలో సైతం 

ఎన్నో  తుఫాన్లు 

ధైర్యంగా ఎదుర్కోవాలంతే


సముద్రంలో వేటకి వెళ్ళే

జాలర్లకు తుఫాను

అపాయాలతో  జీవితం 

దినదిన గండమే 

21.10.25


ప్రయాణం

 మండుటెండలో 

నడుస్తున్న మనిషికి 

పల్లకిలో  ప్రయాణం


కష్టజీవి తాను

కష్టజీవికి పల్లకి పట్టిన

రోజొచ్చింది 

రైతన్నల 

రాజ్యమొచ్చింది


ప్రజాస్వామ్యానికి

పట్టం కట్టేం

సామాన్యుడే రాజు


కానీ

పల్లకిలో ప్రయాణం 

అంటే

పల్లకి  మోసేవారికి భారం

మనిషికి భారమివ్వని

సుఖ ప్రయాణమే

కావాలి మనకి

20.10.25