Tuesday, 30 December 2025

మనోల్లాసం

 ఇరు చూపులు కలిస్తే 

చూపుల పేలుడు

తప్పనిసరి


చూపుల పేలుడులో

ఇట్టే ప్రేమ పుట్టొచ్చు 

ఆ ప్రేమ  పెళ్లికి

దాంపత్య జీవితానికి 

దారితీయొచ్చు


కొన్ని  

చూపులలో


క్రోధం

ద్వేషం

ఏహ్యభావం 

ఉండొచ్చు 


ఒకరి కంట 

ప్రేమ ఉన్నా

మరొకరికి

అదే భావం

కలగాలని లేదు


చూపుల పేలుడులో

ప్రేమ మనసుని

చేరుకుంటే

మనోల్లాసం  


22.12.25

No comments:

Post a Comment