మనం మాటల పంజరంలో
చిక్కుకున్నాం
అందులోంచి బయటకి రాలేం
కొంతమందివి కమ్మనైన మాటలు
కొంతమందివి మనసుని
గాయపరచే మాటలు
కొంతమందివి నమ్మించి
మోసం చేసే మాటలు
ఈ పంజరం దాటలేం
మనని ప్రేమించేవారి మాటలు
మిత్రుల మాటలు
తల్లితండ్రుల మాటలు
తోబుట్టువుల మాటలు
ఇప్పుడు మాటలు
ముఖాముఖి మాత్రమే కాదు
ఫోనులో
వీడియో కాల్స్ లో
ధ్యానం మీద
దృష్టి కేంద్రీకరిస్తే
మాటల పంజరం నుండి
బయట పడతాం
23.12.25
No comments:
Post a Comment