ఆశల గడియారం
చక్ర భ్రమణం
ఆజన్మాంతం
చిన్న చిన్న
వస్తువులు కావాలని
బాల్యంలో కోరికలు
పెద్ద చదువులు
చదవాలని
మంచి ఉద్యోగం
చేయాలని
నచ్చిన అమ్మాయి
తనని ప్రేమించాలని
జీవిత భాగస్వామి కావాలని
అంతా ఆశల గడియారమే
తన బిడ్డలు
వృద్ధిలోకి రావాలని
మనవల ముచ్చట తీరాలని
ఆశల గడియారం ఆగదు
ప్రతిరోజూ ఆశలు
ప్రతి నిముషం
కొత్త ఆశలు
ఈ గడియారాన్ని ఆపాలంటే
చేయాలి ఎంతో సాధన
సామాన్య మానవులకు
సాధ్యం కాని విషయం అది
20.12.25
No comments:
Post a Comment