Tuesday, 30 December 2025

మౌనాన్ని ఛేదిద్దాం

 మాటలకి మబ్బు కమ్మింది 

వర్షంచే మేఘంలా మౌనం 


మనిషికీ మనిషికీ  మధ్య 

మబ్బుల  వారధి

మబ్బు నిశ్శబ్దమై

ఎవరి ప్రపంచంలో వారు


సెల్ఫోన్ ప్రపంచం 

ఫేస్బుక్ ప్రపంచం 

రీల్స్  ప్రపంచం 


మాటల మబ్బు 

మౌనాన్ని  ఛేదిద్దాం 

వర్షమై కురిపించి 

మాటల ధారలతో

ఊటలతో


మనుష్యులను

దగ్గర  చేద్దాం 

12.12.25

No comments:

Post a Comment