ఇసుక సాక్షి
సముద్రం ఒడ్డున
ఏటి ఒడ్డున
ఇసుక తిన్నెల మీద
ఇసుక రోడ్డు మీద
భార్యని రోడ్డు మీదకి
లాక్కొచ్చి హింసించే
భర్తలు ఎందరెందరో
ఇసుక తిన్నెల మీద
ప్రేమ కబుర్లు
సముద్ర తీరంలో
ఇసుకలో కేరింతలు
ఇసుకలో జాలర్ల
జీవితాలు
ఎడారి ఇసుకలో
ఒంటెల మోతలు
కట్టడాలకు సాక్షి
ఇసుక
కెరటాల ఆటలకు
తడిసి ముద్దయ్యే ఇసుక
ఇసుక బస్తాలు కూడా సాక్షి
సముద్రం ఆటుపోట్లకి
24.12.25
No comments:
Post a Comment