హృదయం
ఓ తెల్ల కాగితం
ఏదైనా రాయవచ్చు
ఆ తెల్ల కాగితాన్ని
మలినం చేయొద్దు
తెల్ల కాగితం మీద
అందమైన చిత్రం
తీసుకోవచ్చు
అందమైన రాతలు
రాసుకోవచ్చు
తెల్ల కాగితం
ఎంత స్వచ్ఛంగా ఉంటే
హృదయం అంత నిర్మలం
స్వచ్ఛమైన హృదయాన్ని
ప్రేమిస్తారు అందరూ
15.12.25
No comments:
Post a Comment