Tuesday, 30 December 2025

రెక్కలుడిగిన బాధ

 ఎంత పైకి

ఎగిసినా

ఏ చెట్టు  నీడో

సేదతీరాల్సిందే

రెక్కలున్న పక్షి


రెక్కల  కష్టంతో

సంసారాన్ని 

నెట్టుకొచ్చేవాళ్ళకి

ఆ రెక్కల కష్టం 

వాళ్ళకే తెలుస్తుంది 


పిల్లలకి

రెక్కలొచ్చి 

విదేశాల వరకు

తరలిపోతే

రెక్కలుడిగిన తల్లితండ్రులకే

ఆ బాధ

నిస్సహాయత 

తెలుస్తుంది   


16.12.25

No comments:

Post a Comment