నిద్ర
తప్పనిసరి
ఆరోగ్యానికి ఎంతో
అవసరం
ధనికులైనా
నిద్ర పట్టక
అల్లాడి పోతుంటారు
ఎందరికో నిద్ర మాత్రలు
తప్పనిసరి
కాకపోతే నిద్ర
పర్వతమంత
పసిపిల్లలు ఆడిఆడి
అలసిఅలసి పోయే
ప్రశాంత నిద్ర
ఇంటి పనంతా చేసి
అలసి సొలసే
ఇల్లాలి నిద్ర
కాయకష్టం
చేసి నిద్రించే
శ్రామికుల నిద్ర
రైతన్న నిద్ర
నిద్రకి ఎవరూ
అతీతులు కారు
నిద్ర పర్వతం
తవ్వి తీస్తుంటే
అందరికీ నిద్ర
పేద ధనిక
బేధం లేక.
13.12.25
No comments:
Post a Comment