అద్దంలో
నా ప్రతిబింబం విరిగింది
నీటిలో
నా ప్రతిబింబం చెదిరింది
ఒళ్ళు తెలియని కోపంతో
అద్దాన్ని నేను పగలగొట్టినా
విరిగేది నా ప్రతిబింబమే
ప్రశాంతమైన నీటిలోకి
నేను రాయి విసిరినా
చెదిరేది నా ప్రతిబింబమే
చెదిరిన ప్రతిబింబం
ముక్కలయిన
నా మనసుని సూచిస్తుంది
అద్దాన్ని పదిలంగా ఉంచితే
కలతలెరుగని మనసు కూడా
ప్రతిఫలిస్తుంది
21.11.25
No comments:
Post a Comment