అగ్ని రేగితే
కార్చిచ్చు
అగ్ని రేగితే
బడబానలం
ఆకలి మంటల
అగ్ని
కులాల మధ్య
మతాల మధ్య
ద్వేషాగ్ని
మానవుడు కనిపెట్టిన అగ్ని
అణుబాంబై
దేశాన్నే ధ్వంసం చేసింది
ఆత్మాహుతి బాంబై
రాజకీయ నాయకుడి
ప్రాణాల్నే హరించింది
పుణ్య కార్యాల
హోమాగ్ని
కడుపు నింపే
వంటింటి అగ్ని
దీపావళి మతాబుల
అగ్గి రవ్వలు
కార్తీక దీపాల వెలుగు
కావాలి మనందరికీ
కానీ మానవజాతి
విధ్వంసానికి
దారితీసే
మారణాయుధాల అగ్నిని
అరికట్టాలి తక్షణం
26.11.25
No comments:
Post a Comment