బాల్యం నుండి
వృద్ధాప్యం వరకూ
మనం నడిచిన దారులెన్నో
కలిసిన వ్యక్తులు
ఎందరెందరో
కొందరే మనసుకి
దగ్గరౌతారు
కొందరితోనే రాకపోకలు
ఎందరో
మన మనసుకి
చేస్తారు గాయాలు
అటువైపుగా
వెళ్ళడానికి కూడా
ఇష్టపడం మనం
అవన్నీ విస్మ్మత దారులే
మనకి ఇష్టమైన వారిని
కలిసే దారులని కూడా
మరిచిపోతాం మనం
కాలగమనంలో
విస్మరించిన దారులని
గుర్తుచేసుకో
ఏ సమున్నత వ్యక్తిత్వాలని
కల వస్తాన
11.11.25
No comments:
Post a Comment