అంశం : మలినం పట్టిన మనసులు
తేది: 5.11.25
శీర్షిక : స్వచ్ఛమైన మనసుల సమాజం కోసం......
సరైన పెంపకం కాకుంటే
మనసులకు మలినం పట్టవచ్చు
ధనమున్నా మృగాలుగా మారి
సాటి మనిషులను దోపిడీకి
గురిచేస్తే నిస్సందేహంగా అవి
మలినం పట్టిన మనసులే
మహిళల పట్ల అకృత్యాలు
బాలల పట్ల అమానుషత్వం
జరిపేవి మలినం పట్టిన మనసులే
మడులు పూజలు
నిత్యం కొనసాగిస్తున్నా
కుల మత ద్వేషాల
ఊబిలోనే ఉన్నవారివి
మలినం పట్టిన మనసులే
మలినం పట్టిన మనసులు లేని
సమాజం కోసం అహర్నిశలూ
కృషి చేద్దాం
ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని
No comments:
Post a Comment