కలల ఊపిరి
ఎందరికో
తనకిష్టమైన బొమ్మ
అమ్మ కొంటుందని
పాపాయి కలలు కంటుంది
తనకిష్టమైన పుస్తకం
నాన్న కొంటాడని
చిట్టితండ్రి కలలు కంటాడు
కాలేజీలో అడుగుపెట్టిన
నాటినుండి
అమెరికా వెళ్ళేదెప్పుడని
అక్కడ స్థిరపడేదెప్పుడని
యువత కలలు కంటోంది
సిరులు కురిపించే పంట
చేతికెప్పుడొస్తుందన్నది
రైతన్న కలల ఊపిరి
సుపరిపాలన ప్రజల
కలల ఊపిరి
వృధ్ధాప్యంలో
పిల్లల అండదండ
తల్లితండ్రుల కలల ఊపిరి
కలలే మన ఊపిరి
కలల ఊపిరి లేని
మనుగడ లేదు
18.11.25
No comments:
Post a Comment