Thursday, 11 December 2025

గులాబీ వెన్నంటే ముల్లు

 

ఆమె మనసు
గులాబీ
గులాబీ అంత
మార్దవం
తాజాతనం
మంచు ముత్యాలను
నిలుపుకునే సోయగం

గులాబీకి
ముళ్ళున్నట్టే
తన మనసుని
ఎవరు పడితే వారు
దోచుకోవడానికి
తావీయదు

తన ఇష్టం మేరకే
సున్నితంగా
తన మనసుని గెలుచుకున్నవానికే
ఆమె మనసు  గులాబీ
సొంతమవుతుంది

10.12.25

కన్నీటి తడి

 కళ్ళు ఎడారులుగ

మారిన వేళ


వలచిన వారు

మోసం చేస్తే 

కనులు ఎడారులే


ఎడారిలో

పొడి ఇసుకలా

కళ్ళలో నీరు ఇంకి

పొడి పొడిగా

మారిన వేళ 


ఎడారి అంతా

నిర్మానుష్యం

ఆ కంటి చూపు కూడా 

శూన్యంలోకేభ‌

చుట్టూ ఉన్న జనంతో

సంబంధం  లేనట్టు


ఎడారికి

వర్షమెంత అవసరమో

పొడిబారిన

ఆ కనులు

తడి కావడం

అంతే అవసరం


9.12.25

హిమనదమైన గ్రీష్మ తాపం

 గడ్డ కట్టిన

వేడి


ఆమెది

గ్రీష్మ తాపం


ఆ తాపానికి

తుషారమై

ఒక ప్రేమ

దగ్గరగా ఉన్నా

ఏదో దూరం


వేడి కాస్తా

ఘనీభవించి 

గడ్డకట్ట సాగింది


సాగరుని 

చేరేవరకూ

ఆమె హిమనదమే


8.12.25

మానసిక స్థైర్యమే మందు

 మాయని గాయం 

రేగుతుంది  పదేపదే


ఆ వ్యక్తులు తారసపడ్డా

అవే సంఘటనలు ఎదురైనా


ప్రేమలో మోసపోతే

పదేపదే అవమానాలు

ఎదురైతే

పదేపదే దోపిడీకి 

గురి అయితే


కులం పేరుతో

మతం పేరుతో

వివక్షతకి గురి అయితే 


దివ్యాంగులు

మూడో  జెండర్

అవమానాలకు గురి అయితే


గృహహింసకి

బలయ్యే స్త్రీలు 

అన్నీ రేగే గాయాలే

ఎంతో మానసిక  స్థైర్యం

సమాజం రక్షణ  కావాలి

ఈ గాయాలు సమసి పోవాలంటే 


7.12.25

అలసిన వెలుగులు

 అమ్మానాన్న 

వృద్ధాప్యంలో 

అలసిన వెలుగులు


యుక్తవయసులో వారు

పిల్లలకు తల్లితండ్రులై

వెలుగులు చిమ్ముతూ

తమ బిడ్డల అభివృద్ధి కోసం 

అణువణువూ ధారపోసి 


వృద్ధాప్యం వచ్చేసరికి 

శక్తిహీనులై

అలసిన వెలుగులవుతారు


కానీ వారి మోములో

ఆనందం

సంతృప్తి 

పిల్లలు ఇచ్చే భద్రత 

ప్రేమతో

కానవస్తాయి 


అలసిన వెలుగులను

వెలిగిద్దాం

అస్తమించే సూర్యుడు కూడా 

తన అందంతో

అందరినీ ఆనంద

పరవశులను చేస్తాడు


6.12.25

నల్లగాలి చేదు జ్ఞాపకం

 ఒకప్పటి 

బొగ్గు ఇంజన్

నల్లగాలి జ్ఞాపకం 


కర్మాగారాలలో 

ఏళ్ళ తరబడి శ్రమించిన

శ్రామికులకు

కర్మాగారాల

నల్లగాలి

చేదు జ్ఞాపకం 


గ్రామం నుండి 

నగరానికి  వచ్చి 

తిరిగి  తమ గ్రామం వెళ్ళేక

నగర వాహనాల

నల్లగాలి

చేదు జ్ఞాపకం 


వేపచెట్టు గాలి

కొండగాలి

మలయమారుతం 

ఉద్యానవనంలో గాలి

ఉల్లాసభరితం


నల్లగాలి జ్ఞాపకం

 మానవాళికే

చేదు జ్ఞాపకంగా


5.12.25

నిశ్శబ్ద తుపాకీ

 శబ్దం రాని తుపాకీ

సూటిపోటి  మాటలు 

అనుమానం  పిశాచీ


తనకి అణిగే ఉండాలన్న 

పురుషాహంకారం

మహిళలు తమ కామాన్ని

తీర్చే వారిగానే చూసే

కీచకులు


నిశ్శబ్ద తుపాకీ

భార్య  తనకన్నా 

ఉన్నత స్థానంలో 

ఉండకూడదన్న అహం


మహిళలు  రాజకీయ 

నేతలుగా ఎదగకూడదనే

గూడుపుఠాణీలు



పసిపాపలు

వృద్ధ మహిళలపై సైతం 

అత్యాచారాలు 

సమాజంలో పేలే

నిశ్శబ్ద  తుపాకీలు ఎన్నెన్నో  

బలయ్యేది మహిళలు


4.12.25

చూపుల మిణుగురులు

 మన చూపులే

మనకి‌ మిణుగురు

అవే మనకి వెలుగునిస్తాయి

ప్రపంచాన్ని చూపిస్తాయి


కొందరి చూడ్కులు 

మిణుగురులు 

అవి ఆకర్షవంతమై

మనం ఆ ఆకర్షణకి

లోనవుతాం


యుక్తవయసులో

ఆకర్షించే

చూపుల మిణుగురులెన్నెన్నో

నిశి రాతిరి సైతం 

తలపులలో

స్వప్నంలో

ఆ చూపుల మిణుగురుల

ఆకర్షణ వెన్నంటే

వారి మనసు


ప్రపంచంలో

ఎన్ని చూపుల  మిణుగురులు 

ఎన్నెన్ని అందాలు

3.12.25

Monday, 1 December 2025

గుండె అద్దం

 

నా గుండె అద్దం
నిన్నే చూపుతుంది

నాగుండె అద్దం
విశ్వ ప్రేమని చాటుతుంది

నాగుండె అద్దంలో
ప్రకృతి  సౌందర్యం
ప్రతిఫలిస్తుంది

నా గుండె అద్దంలో
స్నేహ సౌందర్యం
అనుబంధాల
చిక్కదనం
స్పష్టమౌతాయి

నా గుండె అద్దంలో
తోటి మానవుల
పట్ల  శ్రేయస్సు
ఆర్తిగా ఆవిష్కరింపబడుతుంది


అగ్ని తరంగం

 ఆమె హృదయం 

అగ్ని  తరంగం


ప్రేమించి వివాహమాడిన

వ్యక్తయినా అధికారం

చలాయిస్తాడు


ప్రేమ వివాహం

కాబట్టి 

మెట్టింటిలోనూ

పుట్టింటిలోనూ

చిన్న చూపే


ఆఫీసులో

మగ అధికారులు

మగ సహోద్యోగులు

చూసే చూపులు 

చీదరగా ఉంటాయి

వెకిలి మాటలు

వెకిలి చేష్టలు 

మనసుని ప్రశాంతంగా

ఉండనీయవు

అందుకే 

ఆమె హృదయం 

నిత్యం అగ్ని తరంగం


1.12.25

Saturday, 29 November 2025

శ్రీవారి‌ ముచ్చట్లు

 

అంశం: శ్రీవారి ముచ్చట్లు
తేదీ:14.11.25

శ్రీవారి ముచ్చట్లతో
కవితామయమైంది జీవితం.....
కవిత్వం పొంగి పొరలి
స్వర్గం  ఆవిష్కరించబడింది....
తల్లితండ్రులను  ,అక్కాచెల్లెళ్ళను
అన్నదమ్ములను, స్నేహితులను
మరిపించగలిగితే ఇక
శ్రీవారి ముచ్చట్లకి కొదవేముంది

ఇంటిపనిలో , వంటపనిలో
సాయం చేస్తూ
మనకి కావలసిన స్వేచ్ఛనిస్తే
అంతకంటే కావలసినదేముంది

నేను ఎక్కడకి వెళ్ళాలన్నా
తను తోడుంటే
వెన్నంటివున్న ఆ నీడ
ఒక ఆనందం

వృద్ధాప్యంలో  కూడా
నువ్వు అందంగా ఉంటావు
సుమీ అంటే నవ్వు  వస్తుంది కాని
ప్రేమ తెలుస్తుంది

శ్రీవారి ముచ్చట్లు
మనసులో ఉంటాయి
లేకుంటే అమ్మో
దిష్టి తగలదూ

ఇది నా స్వీయ  కవిత
డాక్టర్ గుమ్మా భవాని

ప్రత్యేక ప్రశంస

చల్లని నీడ

 

చెట్లిస్తాయి
చల్లని నీడ

మేఘాలు సూర్యుని కప్పేస్తే
చల్లని నీడ

అమ్మ ఒడి
నాన్న  ప్రేమ
చల్లని  నీడ

మిత్రుల తోడు
చల్లని  నీడ

విద్యాలయం
చల్లని నీడ

వివాహ బంధం 
చల్లని నీడ
ఎదిగిన పిల్లలు
చల్లని నీడ

చల్లని నీడలో
జనులందరి జీవితాలు
సాగిపోవాలని
కోరుకుంటా


చల్లని నీడ

 

చెట్లిస్తాయి
చల్లని నీడ

మేఘాలు సూర్యుని కప్పేస్తే
చల్లని నీడ

అమ్మ ఒడి
నాన్న  ప్రేమ
చల్లని  నీడ

మిత్రుల తోడు
చల్లని  నీడ

విద్యాలయం
చల్లని నీడ

వివాహ బంధం 
చల్లని నీడ
ఎదిగిన పిల్లలు
చల్లని నీడ

చల్లని నీడలో
జనులందరి జీవితాలు
సాగిపోవాలని
కోరుకుంటా


తలపులు

 తలపుల గుసగుసలు

నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తాయి

మొదలు నరికిన చెట్టు

 విరిగిన చెట్టు చూస్తే 

మనసు విలవిలాడుతుంది


మనసు విరిగినా

అది విరిగిన చెట్టే


తల్లితండ్రులలో

ఏ ఒక్కరు  మరణించినా

కుటుంబం  విరిగిన చెట్టే 


ప్రేమికుల నడుమ

ప్రేమలోపిస్తే

ఆ ప్రేమ  విరిగిన చెట్టే 


ప్రభుత్వంలో సమర్ధత లోపిస్తే 

ఆ దేశం మొదలు నరికిన చెట్టే


29.11.25

శూన్యగాలి

 

గాలిలో
పసిపిల్లల కేరింతలు లేవు

యువతీ యువకులు
ప్రేమ సల్లాపాలు లేవు

మధ్యతరగతి
మందహాసాలు లేవు

వృద్ధుల
అచ్చట్లు ముచ్చట్లు  లేవు

పూవుల పరిమళాలు
లేవు
కోకీల కుహుకుహు
గానాలు లేవు

గాలి అంతా శూన్యం
జగతిని వణికించిన
కరోనా చాప కింద
నీరులా గాలిలో
చేరుతుందేమో

28.11.25

నిరీక్షణ

 

నాతో పాటు
గాలి సైతం
ఎదురుచూస్తోంది
నీకోసం

నువ్వు మోసుకొచ్చే
పరిమళాల కోసం
ఎదురు చూస్తోంది
ఈ గాలి

నీ చిరునవ్వుల
గలగల కోసం
ఎదురుచూస్తోంది ఈ గాలి

నీ సిరిమువ్వల సందడి కోసం
ఎదురుచూస్తోంది  ఈ గాలి

నాతో పాటే గాలి కూడా
నిరీక్షిస్తోంది  ప్రతిక్షణం
నీకోసం

27.11.25

అగ్ని చెలరేగుడు

 

అగ్ని రేగితే
కార్చిచ్చు

అగ్ని  రేగితే
బడబానలం

ఆకలి మంటల
అగ్ని

కులాల మధ్య
మతాల మధ్య
ద్వేషాగ్ని

మానవుడు కనిపెట్టిన అగ్ని
అణుబాంబై
దేశాన్నే ధ్వంసం  చేసింది
ఆత్మాహుతి బాంబై
రాజకీయ  నాయకుడి
ప్రాణాల్నే హరించింది

పుణ్య కార్యాల
హోమాగ్ని
కడుపు నింపే
వంటింటి అగ్ని
దీపావళి  మతాబుల
అగ్గి రవ్వలు
కార్తీక  దీపాల వెలుగు
కావాలి మనందరికీ

కానీ మానవజాతి
విధ్వంసానికి
దారితీసే
మారణాయుధాల అగ్నిని
అరికట్టాలి తక్షణం

26.11.25

కర్తవ్యం

 సుదూర ప్రయాణాలు

దారిలో  నీడ

ఎంత సుఖం


జీవితం 

అలసటతో నిండిన 

ప్రయాణం 

చల్లని నీడ 

తోడు దొరికితే 

ఎంత హాయి


కాలికి చెప్పులు కూడా 

లేకుండా  

ప్రయాణించే

నిర్భాగ్యులకు

దారిలో నీడ 

ఎంత హాయి 


ఎగిరే పిట్ట

తలదాచుకుంటుంది

చెట్టు  గుబురులో


దారిలో

నీడ కోసం

చెట్లు నాటాలి

ప్రభుత్వం 

స్వచ్ఛంద సంస్థల

కర్తవ్యం ఇదే

25.11.25

యవ్వనం మాయావనం

 యవ్వనం 

అందాల ఉద్యానవనం

అక్కడ చివురించే పూలెన్నో

పరిమళభరిత ఉద్యానవనం


వృధ్ధాప్యంలో  ఆ పూవులు

వాడిపోతాయి

రంగు రంగుల  ఇంద్రజాలం

కరిగిపోతుంది

సుందర స్వప్నాలు ఎన్నో 

కరిగిపోతాయి


జీవితమే

ఒక భ్రమ

యవ్వనం 

మాయా వనం


మధ్య  వయసుకి వచ్చాక 

వెనుతిరిగి చూస్తే 

జ్ఞాపకాలే తప్ప

యవ్వనపు ఛాయలు

మటుమాయం

24.11.25

హృదయానందం

 కిటికీ వెలుగులో 

బయటి ప్రపంచం


కిటికీ వెలుగులో 

అందమైన ప్రకృతి 


కిటికీ వెలుగులో 

పుస్తక ప్రపంచం 


కిటికీ వెలుగులో 

ఇరుగు పొరుగుతో

అచ్చట్లు ముచ్చట్లు 


కిటికీ  వెలుగులో 

పున్నమి చంద్రుడు 

నీలాకాశం

నక్షత్రాలు 


కిటికీ వెలుగు

హృదయానందం

23.11.25

ఊహల తుఫాను

 ఊహల తుఫాను 

ఇది రచయితలకి

కవులకి 

చిత్రకారులకి

శాస్త్రవేత్తలకు 

ప్రేమికులకి తప్పదు


యుక్తవయసు వారికీ

తప్పదు

చిన్నారులకి

బుజ్జాయిలకి సైతం 

ఏవేవో ఊహల తుఫాన్లు 


మానవులకి ఆలోచనలు 

నిరంతరాయంగా

కొనసాగిపోతుంటాయి

అదంతా ఊహల తుఫానే


ఏదైనా పనిలో నిమగ్నమైతే

ఏకాగ్రత దానిమీద నిలిచి 

ఊహల తుఫాను 

తాత్కాలికంగా మటుమాయమౌతుంది


మనసుకి ఆనందం

సంతృప్తి  కలిగినంతవరకూ

ఊహల తుఫాను ఆరోగ్యకరమే

22.11.25

Thursday, 20 November 2025

మలినం పట్టిన ‌మనసులు

 

అంశం : మలినం పట్టిన మనసులు
తేది: 5.11.25
శీర్షిక  : స్వచ్ఛమైన  మనసుల సమాజం కోసం......

సరైన  పెంపకం కాకుంటే
మనసులకు మలినం పట్టవచ్చు

ధనమున్నా మృగాలుగా మారి
సాటి మనిషులను దోపిడీకి
గురిచేస్తే నిస్సందేహంగా  అవి
మలినం పట్టిన మనసులే

మహిళల  పట్ల  అకృత్యాలు
బాలల పట్ల అమానుషత్వం
జరిపేవి  మలినం పట్టిన మనసులే 

మడులు పూజలు
నిత్యం  కొనసాగిస్తున్నా
కుల మత ద్వేషాల
ఊబిలోనే ఉన్నవారివి
మలినం పట్టిన  మనసులే

మలినం పట్టిన మనసులు లేని
సమాజం కోసం అహర్నిశలూ
కృషి చేద్దాం

ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని


చెదిరిన మనసు

 

అద్దంలో
నా ప్రతిబింబం  విరిగింది

నీటిలో
నా ప్రతిబింబం  చెదిరింది

ఒళ్ళు తెలియని కోపంతో
అద్దాన్ని  నేను పగలగొట్టినా
విరిగేది నా ప్రతిబింబమే

ప్రశాంతమైన నీటిలోకి
నేను రాయి విసిరినా
చెదిరేది నా ప్రతిబింబమే

చెదిరిన  ప్రతిబింబం
ముక్కలయిన
నా మనసుని సూచిస్తుంది

అద్దాన్ని  పదిలంగా  ఉంచితే
కలతలెరుగని మనసు కూడా
ప్రతిఫలిస్తుంది

21.11.25

మానవ శక్తి

 

వంటింట్లో  నీళ్ళు
కళపెళ ఉడికితే
ఆవిరి తెరలు

సంద్రంలో  నీరు
ఆవిరవుతున్నప్పుడు
ఆవిరి తెరలు

కర్మాగారాలలో
ఆవిరి తెరలు
ఆవిరి ఇంజన్లో
ఆవిరి తెరలు

మస్తిష్కం వేడెక్కితే
ఆవిరి తెరలు
ఆరోగ్యం కోసం
ఆవిరి తెర

వర్షాన్ని  ఇచ్చేది
ఆవిరి తెర

ఆవిరిని
ఒడిసి పట్టుకుంటే
అదే మానవ శక్తి

20.11.25

మలుపు

 జీవితంలో 

మలుపు తిరిగే మార్గం 

అన్వేషించాలి మనం


నైతికంగా 

మానసికంగా 

శారీరకంగా 

గొప్ప మలుపులు 

ఎన్నో  కావాలి


విద్యకోసం

ఆరోగ్యం కోసం 

సంతోషం కోసం 

ఎదుగుదల కోసం 

జీవితంలో మలుపులు 

అత్యవసరం


మలుపులు

జాతి ప్రగతిలో

భాగమౌతాయి

పురోగమనం సాధ్యమౌతుంది

19.11.25

కలల ఊపిరి

 కలల ఊపిరి

ఎందరికో


తనకిష్టమైన  బొమ్మ 

అమ్మ కొంటుందని

పాపాయి కలలు కంటుంది


తనకిష్టమైన పుస్తకం 

నాన్న  కొంటాడని

చిట్టితండ్రి కలలు కంటాడు


కాలేజీలో అడుగుపెట్టిన 

నాటినుండి 

అమెరికా వెళ్ళేదెప్పుడని

అక్కడ స్థిరపడేదెప్పుడని

యువత కలలు కంటోంది


సిరులు కురిపించే పంట 

చేతికెప్పుడొస్తుందన్నది

రైతన్న కలల ఊపిరి 


సుపరిపాలన ప్రజల 

కలల ఊపిరి


వృధ్ధాప్యంలో

పిల్లల అండదండ

తల్లితండ్రుల కలల ఊపిరి


కలలే‌ మన ఊపిరి 

కలల ఊపిరి లేని

మనుగడ లేదు


18.11.25

వెలుగు వేడుక

 చీకటిని చీల్చుకుంటూ 

వెలుగు  వస్తే 

మనకానందం


అలాగని

వెలుగులో చేయాల్సిన  పనులు 

చేయకుండా కూర్చుంటే

శరీరానికి  తిమ్మిరి

మనసుకి తిమ్మిరి 


వెలుగును వాడుకుంటూ 

నడక

చదువు

వ్యాయామం 

ఉద్యోగం 

చేయాల్సిన  మంచిపనులు 


వెలుగు  కొద్దిసేపే

చక్కపెట్టాల్సిన పనులు 

ఎన్నెన్నో 


వెలుగు తిమ్మిరి కాకూడదు

వేడుక కావాలి మనకి

17.11.25

ఎదురుచూపు

 వర్షం  వర్షం 

ఒడ్డున  కూర్చుని మేము

కాగితప్పడవలు

వదులుతున్నాం


వర్షం వర్షం 

ఒడ్డున  నిలిచి

నేను ప్రకృతి  అందాలు

తిలకిస్తున్నా


వర్షం వర్షం 

నాలాగే అతనెవరో

ఆ ఒడ్డున 


వర్షం వర్షం 

ఒడ్డున నిలిచి 

ఓ రైతు కుండపోత

వర్షం ఎప్పటికి

ఆగుతుందా అని

ఎదురు చపు

16.11.25

సాగరుని చేరేవరకు

 

నది
పరిగెడుతూనే ఉంటుంది
పారుతూనే ఉంటుంది

ముందు
ఉరకలేసే గంగమ్మలా

ఆపై గలగలపారే
గోదావరిలా
కృష్ణమ్మలా

సాగరుని చేరేవరకు
నది ప్రవహిస్తూనే ఉంటుంది

15.11.25

అంచనాలకు అందని లోతు

 మౌనం

పైకి కనిపిస్తుంది 


కానీ మౌనలోతులను

కొలిచేదెవరు


అమ్మానాన్న

ఏమన్నా

మౌనమే సమాధానం 


అత్తగారు

శ్రీవారు

చికాకుపడినా

ఆఫీసులో బాస్

ఎన్ని  మాటలన్నా


వృద్ధాప్యంలో

పిల్లలు ఏమన్నా

మౌనమే సమాధానం 


అంతటి మౌనానికి

భూదేవంత సహనం

కావాలి


మళ్ళీ పెదవిపైకి

చిరునవ్వు 

వచ్చే వరకూ 

మౌనలోతుని అంచనా

వేయలేం

14.11.25

మదికి పులకింత

 చీకట్లో  నీరు

నది నీరు

ప్రశాంతంగా


సెలయేటి నీరు

వయ్యారంగా 


సముద్రం నీరు

అలలతో

ఉవ్వెత్తున ఎగసే

కెరటాలతో


అర్ధరాత్రి 

రైలు వంతెన

మీదుగా నదిని దాటే

దృశ్యం అద్భుతం


చల్లగాలుల

నదీ తీరం

చీకట్లోనైనా

నిశ్శబ్దంగా తన ప్రేమను 

అందిస్తుంది మనకు

13.11.25


దూరతీరాలకు నడక

 నడక మొదలెట్టిందామె

ప్రారంభ కాంతిలో


ఆ ఉదయకాంతి

ఆమె ఆశలకి

ఆశయాలకి

పట్టిన  దివిటీ


సామాన్యురాలే

అసమాన్యురాలవడానికి

దారి చూపుతోంది

సూర్యోదయ కాంతి 


ఒంటరి ప్రయాణమైనా

కోటి సూర్యప్రభలు

ఆమె మదిలో


ఇలాటి కధలు

కోకొల్లలు 

నిజమైన కధానాయికలు

12.11.25

రైలు ప్రయాణం

 రైలు ప్రయాణం 

ప్రకృతి అందాలు

ఆనందంగా చూస్తూ 


నాకిష్టమైన పల్లీలు

తింటూ

తోటి ప్రయాణీకుల

ఇంటింటి రామాయణం

కంటూ

వింటూ


సెల్స్  దొంగని

ప్రయాణికులు 

పోలీసులు పట్టుకున్న

వైనాన్ని  చూస్తూ 


నా ఫోను రైలులో

వదిలేసి

ఎంచక్కా ఇంటికెళ్ళిపోయిన

సంఘటన గుర్తు చేసుకుంటూ


చేసిన రైలు ప్రయాణాలు ఎన్నెన్నో 

యాదికొస్తవి 

పల్లీలు ఇష్టంగా చిన్నప్పుడు తల

11.11.25

మరచిన దారులు

 బాల్యం నుండి 

వృద్ధాప్యం  వరకూ

మనం నడిచిన దారులెన్నో


కలిసిన వ్యక్తులు

ఎందరెందరో 


కొందరే మనసుకి 

దగ్గరౌతారు

కొందరితోనే రాకపోకలు


ఎందరో 

మన మనసుకి

చేస్తారు గాయాలు


అటువైపుగా

వెళ్ళడానికి కూడా 

ఇష్టపడం మనం 


అవన్నీ  విస్మ్మత దారులే

మనకి ఇష్టమైన వారిని

కలిసే దారులని కూడా 

మరిచిపోతాం మనం

కాలగమనంలో


విస్మరించిన దారులని

గుర్తుచేసుకో

ఏ సమున్నత వ్యక్తిత్వాలని

కల వస్తాన

11.11.25

హృదయం చిలికితే అమృతం

 హృదయం చిలికితే

ఎన్నో గాయాలు

గేయాలు


ఎన్నో స్వప్నాలు 

వ్యధలు

వేదనలు


ఆశయాలు

నిరాశ 

నిస్సహాయత 


ప్రేమ 

అభిమానాలు

అనురాగం 


క్రోధం

దయాగుణం 


హృదయాన్ని 

చిలికేది ఎవరు

నాకు నేనేనా

10.11.25

నాలోకి తొంగిచూసే తానా

మనసుకి‌ హాయి

 నిశ్శబ్ద రాత్రి 

నేను మేలుకునే ఉన్నా


ఆరుబయట 

ఆకాశంలో చుక్కలు చూస్తూ 


పున్నమి నాడు 

వెన్నెల  సోయగాలు చూస్తూ 


పూల పరిమళాలు 

ఆఘ్రాణిస్తూ 


చిత్రకారుని కుంచె 

సృష్టించిన అద్భుతాలకు

అచ్చెరువొందుతూ


అమ్మానాన్నల ప్రేమ

గుర్తుచేసుకుంటూ

చెక్కిలిపై జారే

కంట నీటితో


జీవిత భాగస్వామి 

పిల్లల ప్రేమానురాగాలకి

పులకిస్తూ


చిరకాల మిత్రులతో ఉన్న

అనుబంధం తలుచుకుంటూ


ఒక నిశ్శబ్ద రాత్రి 

శబ్ద ప్రపంచాన్ని ఆహ్వానించి

అదృశ్యమైపోతుంది

నిశ్శబ్దంగానే


రొదల శబ్ద ప్రపంచం కంటే

నిశ్శబ్ద రాత్రులు

మనసుకి హాయి

అప్పుడప్పుడూ

9.11.25

కాలం ఆగిపోతుంది

 ప్రకృతి అందాలను

ఆస్వాదిస్తుంటే

కాలం ఆగిపోతుంది


కళాకారుల కళ

కనులకు విందయినపుడు

కాలం ఆగిపోతుంది 


అద్భుతమైన సంగీతం

వీనుల విందయితే

గడియారం మనకి

ఆగిపోతుంది 


పసిపాపల ఆటలు

కేరింతలు 

మిత్రులతో గడిపే కాలం 

అక్కడే ఆగిపోతుంది 


మనవారు మనకి

దూరమైతే 

కాలం ధ్యాసేలేక

కాలం ముందుకి 

నడవక ఆగిపోతుంది

8.11.25

మేఘమే‌ ఉక్కు కవచం

 మేఘం  

మన కవచం

సూర్య ప్రతాపం

తట్టుకోవాలంటే మేఘం 

మన కవచంగా మారాల్సిందే


పంట  రైతన్న చేతకి

అందాలంటే

వర్షమేఘమే

కవచం


పిల్లల 

కాగిత పడవల ఆటలకి

వర్ష మేఘమే ఆలంబన


ఉన్నత పర్వత శ్రేణులలో

మేఘాలు కవచంలా

మన దేహాన్ని తాకి

మనని పులకింప చేస్తాయి


మైళ్ళ కొద్దీ

నడిచే  పాదచారులకు

మేఘమే 

ఉక్కు కవచం

7.11.25

Wednesday, 5 November 2025

ఎప్పటికీ సజీవం

 చిత్రకారులం కాకుంటే

అవి పిచ్చి గీతలే


కానీ కొందరు పసివయసులోనే

చకచకా గీతలు కలిపేసి

మనం అచ్చెరువొందే

చిత్రాన్ని మన ముందు

నిలుపుతారు



గీతలు సజీవ చిత్రాలవుతాయి

రవివర్మ  అందాలవుతాయి

బాపు బొమ్మలవుతాయి

వడ్డాది అలవోక

చిత్రాలవుతాయి



కుంచె గీసిన గీతలు

అపురూప చిత్రాలవుతాయి 


చిత్రం గీతల సమాహారం

అది గీతలను సజీవంగా 

నిలుపుతుంది ఎప్పటికీ

6.11.25

సురక్షితం

 

పడవ నడి సంద్రంలో
తుఫాను  భీభత్సం
ఆటుపోట్లు
అల్లకల్లోలం

తుఫానులో చిక్కుకున్న
జాలరులెందరో

తీరం దగ్గర
వారి కోసం
వేచివుండి
వారి క్షేమం కోసం
ప్రార్థనలు చేస్తున్న
కుటుంబ సభ్యులు

చిట్టచివరికి
సంద్రంలో  ప్రశాంతత

ముసలి తల్లితండ్రులు
ఎదురు చూస్తున్న నావ
ముందుగా తీరం చేరింది

5.11.25

పూవు నేర్పే పాఠాలు

 

పువ్వు వికసించినట్టు
నవ్వు మన మోముపై
వికసించాలి ఎల్లపుడూ

హృదయం వికసించాలి
మేధస్సు  వికసించాలి
విజ్ఞానం వికసించాలి

మానవత్వం అందరిలో
వికసించాలి
మనసు ప్రేమానురాగాలతో
వికాసించాలి

సంస్కృతి
నాగరికత
నలుదిశలా వికసించాలి

పూవు వికసించడం
అనునిత్యం  గమనిస్తే
మనలో కూడా
ఆనందం
మనసులో మార్దవం
అన్నీ వికసిస్తాయి

ఒక చిన్ని పూవు
మనకి నేర్పే
పాఠాలు ఎన్నెన్నో

4.11.25

బంగరు భవితకి బాట

 

పసిడి తాళం చెవితో
ఆనందాల తలుపు
తెరుచుకోవచ్చు

విద్యాలక్ష్మి వరించొచ్చు
ఎన్నెన్నో  సదవకాశాలు
లభించవచ్చు
తరువాత  రోజుల్లో
నీకు జీవిత భాగస్వామిగా
అయ్యే వ్యక్తి ఖైదీగా
ఆ గదిలో
ఉండి ఉండవచ్చు
పసిడి తాళం చెవితో
పసిడి లభించకపోవచ్చు
కాని అది బంగరు భవితకి
బాట కావొచ్చు

3.11.25

మనకోసమే

 

తెరవబడిన
తలుపు వెనక
గుప్తనిధి ఉండొచ్చు

ప్రేమించిన అమ్మాయి
గాజుల సవ్వడి
నీకు  స్వాగతం  పలకొచ్చు

నువ్వు తలుపు తెరిస్తే
అదృష్టం నీ జీవితంలో
ప్రవేశించొచ్చు

ఊహించని విధంగా
ప్రియమితృడే
తలుపు తీయొచ్చు

తీయబడ్డ తలుపు
వెనక
నిందా వాక్యాలు
పరుషవాక్యాలు కూడా
వినిపించవచ్చు

2.11.25

దినకరుని సుస్వాగతం

 

సూర్యోదయ కాంతిలో
సూర్య నమస్కారాలు

ఇల్లాలికి  వంట పనులు
చిన్నారుల బడిబాట
ఇంటాయన ఆఫీసు పరుగులు

ఉద్యానవనాలు తాజాగా
రైతన్నని నేల తల్లి  పిలుస్తుంది

ఆసుపత్రులు కిటకిటా
రాత్రి దుర్మార్గాలు చేసి
లాకప్పులకు చేరే నిందితులు

సూర్యకాంతిలో చకచక
నడిచే పాదాలు
మొక్కల మీద
సూర్యకాంతి
అందరి  మొహాలను
వెలిగించే సూర్యకాంతి

సూర్యోదయ కాంతి
నలుదిశలా పరుచుకుంటుంది
దినకరుడు నూతన దినానికి
స్వాగతం పలుకుతాడు
ప్రజల కోసం

1.11.25

Friday, 31 October 2025

సంఘం చెక్కిన శిల్పం

 

సంఘం చెక్కిన శిల్పం
ఆమె
సంఘం చెక్కిన శిల్పం

సంఘపు కట్టుబాట్లు
ఆచారాలు
నియమాలు

ఆమె కిచ్చిన హోదా
స్థాయి

ఆమెకి  అప్పగించిన
బాధ్యతలు

సంఘమే ఆమెని
శాసిస్తుంది
లక్ష్మణ రేఖ గీస్తుంది

గీత దాటితే
వెలి వేస్తుంది సంఘం

ఆమె స్వేచ్ఛ
సంఘం గుప్పెట్లోనే

తరాలు  మారుతుంటే
సంఘ దృక్పధం
మారుతుంటే
ఆ శిల్ప సౌందర్యం
మారుతోంది

26.9.25

శ్రీ సూర్య నారాయణా

 

శ్రీ సూర్య నారాయణా...

ఇది నా‌స్వీయ రచన

తులసమ్మ గారికి రోజూ పొద్దున్నే   తలార స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం,సూర్య నమస్కారాలు చేసుకోవడం అన్నీ అయితే కాని పచ్చి మంచినీళ్ళు కూడా  ముట్టరు.

ఆరోజు  స్నానం అయిపోయింది గానీ మబ్బు కమ్మి ఉండి సూర్యుడు కనబడలేదు.
అంతే,మడిగా పీట మీద  కూర్చున్నారు కానీ ఏమీ తాగలేదు. కూతురు,అల్లుడు,మనవలు అందరూ చెప్పి చూసారు కానీ ఫలితం లేదు. ఆవిడ ఒక్క డాక్టర్ మనవరాలికే భయపడుతుంది. ఏవన్నా అయితే ఎక్కడ ఆసుపత్రిలో చేరుస్తుందో అని. ఓ రెండు గంటలు పోయాక మనవరాలు  డాక్టర్ సరిత ఓ గ్లాసుడు పాలు ఇస్తే ఎలాగో తాగింది.

మరో రెండు  గంటలు దాటిన దగ్గరనుంచి  కూతురు  పళ్ళయినా తినమని, లేకపోతే సరి తడి ఫోన్ చేసి చెప్తానని బెదిరించింది.
ఇక పళ్ళముక్కలు తినక తప్పలేదు.

సూర్యుడు కనబడలేదన్న దిగులుతో తులసమ్మకి  మధ్యాన్నం నిద్ర కూడా  పట్టలేదు. ఆ రోజంతా పాలు, పళ్ళతోనే కాలక్షేపం చేసింది.
మర్నాడు కూడా మేఘాలు ,వర్షం. ఆరోజు కూడా ఆవిడకి అన్నం తినాలనిపించలేదు.
ఇదంతా ఆ సూర్య భగవానుడు తనకి పెడుతున్న పరీక్ష అనుకుంది.
రెండో రోజు రాత్రి  సరిత తులసమ్మ  దగ్గరకి వచ్చి  " అమ్మమ్మా , సూర్యుడు నీకు కనిపించక పోయినా ఆకాశంలోనే ఉంటాడు కదా. నీ పూజలు  నువ్వు  చేసుకో. ఇలా అన్నం మానేసి, సరిగ్గా   ఏం తినకపోతే రేపు పొద్దున్నే  నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తాను " అని చెప్పి వెళ్ళిపోయింది.
తులసమ్మ ఇక సూర్యుడి కోసం ఎదురుచూడకుండా, మర్నాడు సూర్యనమస్కారాలు మొదలెట్టేయాలని నిశ్చయించుకుంది. మనవరాలిముందే ఇడ్లీలు తినేస్తే  మరి ఇక తనతో ఆసుపత్రికి తీసుకెళ్ళదు అనుకుంటూ పడుకుంది.

పొద్దుట స్నానం చేసి వచ్చేసరికి సూర్యభగవానుడు తనే నవ్వుతూ తులసమ్మని పలకరించేడు.

30.10.25

ఆహ్లాదకరం

 

మా ఊరి వాతావరణం 
బహు విచిత్రం
అరగంట వర్షం
అరగంట ఎండ

వర్షంలో తడిసేవారు
గాజు తలుపుల్లోంచి  చూసి
ఆనందించేవారు

ఎండొస్తే పనులు
షాపింగులు
నీళ్ళలో  పడవలేసే పిల్లలు
ఎండ కాచుకోవడం
ఎండలో నడక

వర్షానికి
ఎండకి
రెండింటికీ
గొడుగు తప్పదు
బయటకి వెళ్ళే
ప్రతీ ఒక్కరి
చేతిలో గొడుగు
హస్తభూషణం

31.10.25

ఊహల రెక్కలు

 

మనసు రెక్కల
వేగం
ఎక్కడికైనా మనని
తీసుకొని వెళ్తుంది

మనవాళ్ళు విదేశాల్లో ఉన్నా
మనసు ఎగిరెళ్ళి వాళ్లచుట్టే
గిరికీలు కొడుతుంది

పల్లెటూరి నుండి
ఉపాధి కోసం
మహానగరం వెళ్ళిన వ్యక్తికి
మనసు
కన్నవాళ్ళ దగ్గరే ఉంటుంది

ఒక క్రీడాకారిణి మనసు
అంతర్జాతీయ క్రీడలలో
పాల్గొని
బంగరు పతకం
సాధించాలనుకుంటే
మనసు అక్కడే ఉంటుంది

యువత మనసులు
స్వేచ్ఛ రెక్కలు
తొడిగి
ఊహాలోకాల్లో
విహరిస్తూనే ఉంటాయి

30.10.25

సాయంత్రం నీడలా

 జీవితం 

సాయంత్రం  నీడలా

జారిపోతుంది


బాలభానుని చందాన

బాల్యం 


నడినెత్తి సూరీడై

యవ్వనం 


వాలే పొద్దై

వృద్ధాప్యం 


ఆ నీడ 

జారిపోక తప్పదు

జీవితం ఆగక తప్పదు 

మిగిలిపోయేవి

మనం చేసిన మంచి పనుల

ఫలితాలే

28.10.25


Tuesday, 28 October 2025

గాయం మానే క్షణాల కోసం

 

మంట ఎక్కడైనా మంటే
భరించలేని బాధ
ఆవిడకి మణికట్టుపై మంట
అసలే రచయిత్రి
కవయిత్రి
చిత్రకారిణి 
నాట్య మయూరి
ఏ కళకైనా ఆ మంట అడ్డే
వాడని మందులు లేవు
చూడని వైద్యులు లేరు
మంట తగ్గే క్షణాల కోసం
ప్రతి రోజూ ఎదురుచూపు

28.10.25

క్షణాలకు రెక్కలొచ్చిన వేళ

 

కొన్ని  క్షణాలకు
రెక్కలు  వస్తాయి

అప్పుడు  మనం
ఊహాలోకాల్లో  తేలిపోతాం

మనకి కావలసినవి
తలుచుకుని
ఇట్టే  సాధిస్తాం

క్షణాలకు రెక్కలు రావడం
మంచిదే
మనలోని తలపులు
భావాలు
స్వప్నాలు  అన్నీ
తెలుసుకుంటాం

ఊహాలోకం నుండి
వాస్తవంలోకి వచ్చేక
అనుకున్నవి సాధించడానికి
ప్రణాళిక  రూపొందించుకుంటాం

27.10.25

భూభారాన్ని మించి

 

గగన భారం
అనితర సాధ్యం

మండే సూర్యుడి
ప్రతాపాన్ని భరిస్తుంది

రాత్రయ్యేసరికి
వేనవేల తారలను
మెరిపిస్తుంది
చంద్రకళలతో మరిపిస్తుంది

నల్లమబ్బులతో
వర్ష ప్రదాయిని అవుతుంది

మేఘాలతో సూర్యుని కప్పి
జనాలకి చల్లదనం ఇస్తుంది

భూభారాన్ని మించినది
గగనభారం

26.10.25

Saturday, 25 October 2025

బాధ్యతల బరువు

 

వయసొచ్చిన ఆడపిల్ల
తల్లితండ్రులకు
గుండెలపై భారమే

అది ఒకప్పటి మాట
తగిన అబ్బాయిని వెతికి
పెళ్లి చేయడం మాటలా

మెట్టిల్లు పుట్టింటిని
మైమరిపించాలి
ప్రేమించే భర్త లభించాలి

ప్రేమ  వివాహమైతే
ఇద్దరూ తల్లితండ్రులను
ఒప్పించాలి

తల్లితండ్రులకు
బాధ్యతలన్నీ తీరేవరకు
గుండెపై రాయి
అటుపై తమని తాము
పోషించుకోవడం
గుండెపై రాయి

25.10.25

పుస్తక నేస్తం

 

ప్రియ నేస్తాలు
తేది: 15.10.25

పుస్తకం
నా ప్రియ నేస్తం
బాల్యం  నుండి నువ్వు
నా నేస్తానివే
చందమామగా
బాల మిత్రగా
మా బొమ్మరిల్లుగా
వార పత్రికగా
మాస పత్రికగా
కథలుగ
కవితలుగ
నవలలుగ
నాటికలుగ
నేను గుండెకి హత్తుకోని
పుస్తకాలేవి
ప్రేమించిన పుస్తక నేస్తాలు
కోకొల్లలు
పుస్తకాలు మన వారసత్వ
సంపద
అవి ప్రియనేస్తాలు ఆజన్మాంతం


అపురూప దృశ్యం

 

పొగమంచు గుట్ట
ఆ పొగమంచులో
ఆ గుట్టని చేరుకోవాలని

గుట్టమీద అమ్మవారు
అమ్మవారి కోసం
పోటెత్తే జనం

పొగమంచు
గుట్ట అందం
అద్భుతం
గుట్టపైనుంచి  చూస్తే
మా ఊరు
అందాల లోయ
పొగమంచు  గుట్ట
అరుదుగా కనిపించే
అపురూప దృశ్యం

24.10.25

శిరోభారం

 

నెత్తిన భారం
రైతుకు  పంట  చేను
ధనరూపంలోకి
మారిన దాకా

మధ్య తరగతి తండ్రికి
పిల్లల చదువులు
ఆడపిల్లల పెళ్లిళ్ళు
తండ్రిగా
తన భారం
తీరేవరకు

ధనికులకు
తమ ఆస్తులను
కాపాడుకున్నంత వరకు
వాటిని మరింతగా
వృధ్ధి చేయనంతవరకు
తలపై భారం
దిగిపోదు ఎప్పటికీ

23.10.25


ఒకే గూటి పక్షులు. ...2

 

ఒకే గూటి పక్షులు
ఎక్కడ ఎగిరినా
చివరికి  చేరుకుంటాయి
తమ గూటినే

ఒకే  ఇంటి  వ్యక్తులు
తమ ఇంటినే
చేరుకుంటారు

తమ వాళ్ళనే
కలుసుకుంటారు

విప్లవకారులు
ఒక గూటి  పక్షులు

ఆధ్యాత్మిక వ్యక్తులు
ఒక గూటి పక్షులు

బడుగు జీవులు
ఒక గూటి పక్షులు

అనాధలు
అభాగ్యులు
ఒక గూటి  పక్షులు


దినదిన గండం

 అలల పై తేలే పడవ

హాయిహాయి ప్రయాణం 


రోజులు సాఫీగా

సాగినంతవరకు

మన జీవితం కూడా 

అలలపై తేలే పడవ 


సంద్రంలో  తుఫాన్లు 

పడవకి ప్రమాదం 


మన జీవితంలో సైతం 

ఎన్నో  తుఫాన్లు 

ధైర్యంగా ఎదుర్కోవాలంతే


సముద్రంలో వేటకి వెళ్ళే

జాలర్లకు తుఫాను

అపాయాలతో  జీవితం 

దినదిన గండమే 

21.10.25


ప్రయాణం

 మండుటెండలో 

నడుస్తున్న మనిషికి 

పల్లకిలో  ప్రయాణం


కష్టజీవి తాను

కష్టజీవికి పల్లకి పట్టిన

రోజొచ్చింది 

రైతన్నల 

రాజ్యమొచ్చింది


ప్రజాస్వామ్యానికి

పట్టం కట్టేం

సామాన్యుడే రాజు


కానీ

పల్లకిలో ప్రయాణం 

అంటే

పల్లకి  మోసేవారికి భారం

మనిషికి భారమివ్వని

సుఖ ప్రయాణమే

కావాలి మనకి

20.10.25

చీకట్లో బాణం

 

అవతలి వాళ్ళనుండి
సమాచారం రాబట్టడం కోసం
చీకట్లో  బాణం

పోటీ కోసం 
కధలు
కవితలు
నవలలు రాయడం
చీకట్లో బాణం

ప్రేమించిన అమ్మాయికి
ప్రేమలేఖ అందిస్తే
చీకట్లో బాణం

ఉద్యోగ ప్రయత్నం
చీకట్లో బాణం
అప్పు కోసం ప్రయత్నించడం
చీకట్లో  బాణం

ఎన్నికలలో
పోటీ చేయడం
చీకట్లో బాణం

రోగం ముదిరేక
ఆరోగ్యం కోసం
చేసే ప్రయత్నాలు
చీకట్లో బాణం

జీవితంలో చాలా సార్లు
చీకట్లో  బాణమే వేయాలి
మనకి కావలసిన
ఫలితం అందుకోవడానికి

19.10.25

నైపుణ్యం

 

ఏ పనిలో నైపుణ్యమంటే
అది ఎడమ చేతి ఆటే
ఎడమ చేతి  వాటమున్నా
ఎడమ చేతి ఆటే
చెయ్యి తిరిగిన
రచయితయినా
చిత్రకారుడయినా
వంటచేయడంలో
నైపుణ్యమైనా
వారికది
ఎడమచేతి ఆటే

18.10.25

నిశ్చయం

 భర్త మీద అలిగి

భార్య మొదటిసారి 

ఊళ్ళో ఉన్న 

పుట్టింటికి వెళ్ళిపోయింది 


ఆఫీసు నుండి 

వచ్చాక

అటూ ఇటూ 

తిరుగుతున్నాడు

కాలు కాలిన పిల్లిలా 


భార్య  తనకి

చెప్పనేలేదు

వెళ్తానని


ఎవరినైనా 

అడుగుదామంటే 

ఆత్మాభిమానం 


వంట చేసుకోవడం రాదు

బయటకి వెళ్లి 

తినాలనిపించలేదు 

ఏ తప్పులు చేసానా

అన్నదే ఆలోచన 

ఇంట్లో  లేని

భార్య  గురించి  దిగులు 

మరి కొద్ది  నెలల్లో

తండ్రిని కాబోతున్న 

సంతోషానికి 

ఈ పరిణామం 

ఓ గ్రహణం

పొద్దున్నే లేచి 

అత్తవారింటికి వెళ్ళి

బతిమాలో

బుజ్జగించో

తన భార్యని 

ఇంటికి  తెచ్చుకొని 

మహరాణిలా

చూసుకోవాలనే

నిశ్చయానికి 

వచ్చాడతను

17.10.25

మహాపర్వతం

 తలపై భారం

వింధ్య పర్వతం 

మోస్తున్నంత

అమ్మానాన్న 

కష్టంతో చదువుకున్నా

మంచి ఉద్యోగం  సంపాదించి 

వారికి  పేరు తేవాలి


మనసులో భారం కూడా 

గోవర్ధన పర్వతమంత 

అమ్మానాన్నలను

బాగా చూసుకోవాలి

తమ్ముడి బాధ్యత  

చెల్లి  బాధ్యత  

ఇకపై తనదే


బాధ్యతలు మోసేవారి

తలపై బరువు 

నిరంతరం 

మహా పర్వతమంత

15.10.25

Tuesday, 14 October 2025

కాల ప్రవాహంలో మనం

 

ప్రవాహం లో ఆకులు
తేలిపోతూ

ప్రవాహం తో కలిసి
మునుముందుకు
వెళ్ళిపోతూ

మనం కూడా
ప్రవాహం లో
ఆకుల్లాటి వాళ్ళమే

కాలప్రవాహంలో
మునుముందుకు
సాగిపోతాం

కొన్ని ఆకులు
ప్రాణ రహితమై
మట్టిలో కలిసి
అక్కడే ఆగిపోతాయి

12.10.25

వెన్నెల దీపం

 

నలువైపులా
అంధకారం
అకస్మాత్తుగా
వెలుగు చుక్క
అదే అవుతుంది
ఆశాదీపం
అంధకారంలో
చిరుదీపమైనా
మనకి
వెలుగు చుక్క
వెన్నెల దీపం

9.10.25

ప్రేమ వెలుగు

 

ప్రేమ
వెలుగుల  వలయం
యువతీ యువకుల
ప్రేమ అందంగా
మధురంగా
వెలుగుతో నిండిపోతుంది
ఆ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు
ఏ చీకటీ  వారికి తెలియదు
ఇరు హృదయాలు
వెలుగుతో నిండి
పరవశం
ఆనందం
వారిదౌతుంది

8.10.25

పరుగు

 

మనిషి
భయపడి పరిగెడితే
నీడ కూడా  పరిగెడుతుంది

పిరికిపందై పరిగెడితే
నీడ కూడా పరిగెడుతుంది

దొంగతనాలకి
అలవాటు పడితే
జనం వెంటపడితే
నీడ కూడా పరిగెడుతుంది

పోలీసుల నుండి
తప్పించుకోవాలని
పరుగులు తీస్తే
నీడ కూడా
పరిగెడుతుంది

7.10.25

విజయం ఆమె లక్ష్యం

 

పగటి కల
ఆమె ఇంట్లో
పని చేస్తున్నంతవరకూ

కలెక్టర్ అయి
ప్రజలకు
సేవ చేస్తుంది
పోలీస్ ఆఫీసర్ అయి
పేరు మోసిన నిందితులను
పట్టుకుంటుంది
ఉపాధ్యాయురాలిగా
విద్యార్థుల మెప్పు
పొందుతుంది
గ్రామీణ ప్రాంతాలలో
పంట పొలాల మధ్య
తిరుగుతుంది
శాస్త్రవేత్తగా విజయాలు
సాధిస్తుంది
ఆ పగటి కలలే
ఆమె స్వప్నాలు
ఆశయాలు
ఏదో ఒక
రంగంలో
విజయాన్ని కైవసం
చేసుకోవడమే
ఆమె
పగటికల

6.10.25

అక్షరాల ఆరాధన

 

అక్షరాల ఆరాధన

తేది: 20.8.25

అక్షరాభ్యాసం తో
మొదలౌతుంది
అక్షరాల ఆరాధన
తల్లీ నిన్ను తలంతు
నిరతము అనుకుంటా
అక్షరాల ఆరాధన
విద్యార్థులకు
ఉపాధ్యాయులకు
తల్లితండ్రులకు
సాహితీవేత్తలకు
శాస్త్రవేత్తలకు
సంగీత ఆచార్యులకు
తప్పనిసరి
మానవ ప్రగతి
అక్షరాల ఆరాధన లోనే
ఇమిడిఉంది


Sunday, 5 October 2025

కత్తి మీద సాము

 

కత్తి పైన నడక
ఆ అమ్మాయిది
ప్రేమించిన వ్యక్తి  కోసం
ఇల్లు వదిలి  వచ్చేసింది
పరువుకి ప్రాణమిచ్చే తండ్రి
ప్రేమిస్తున్నానంటూ
వెంటపడ్డ ప్రేమికుడు
మొహం చాటేసి
ధనికురాలైన
మరో అమ్మాయికి
తాళి కట్టేసాడు
ఇప్పుడు  ఆమె
జీవితం 
కత్తిమీద నడక
ఎక్కడో ఏదో ఉద్యోగం
వెతుక్కుని
స్థిరపడాలి తప్ప
తిరిగి ఇంటికి వెళ్ళే
సాహసం  చేయలేదు


ముళ్ళ కిరీటం

 

రాజుకి
సింహాసనం
ముళ్ళకిరీటం
ఎప్పుడు  ఏ రాజులతో
యుద్ధం  చేయాలో
ప్రధానికి తన పదవి
ముళ్ళ కిరీటం
దేశసేవ చేస్తూ
పదవిని
కాపాడుకోవాలి
నేటి ఇల్లాలికి
ఇల్లు
పిల్లలు
ఆఫీసు
అన్నిటినీ
సమన్వయ పరుచుకోవడం
ముళ్ళకిరీటం
జవాన్ కి
సరిహద్దులు కాపాడటం
తనవారి కోసం
జీవించడం
ప్రతిరోజూ ముళ్ళకిరీటమే
రైతుకి పంట పండించడం నుండి
తన కష్టానికి  ఫలితం
పొందేవరకూ
ముళ్ళకిరీటమే

4.10.25

Saturday, 4 October 2025

ఎంతందం

 

ఏనుగుల గుంపు
అడుగు వెనక అడుగు
చీమల దండుగ
ఒకటి  వెనుక  మరొకటి
బాతుల వరుస అందంగా
అబ్బాయి అమ్మాయి
అడుగు వెనక అడుగు
అంతా ఒద్దికగా
క్రమశిక్షణగా
ఇసుకలో
అడుగు వెనక అడుగు
ఎంతందం

18.9.25

ఒడిసి పట్టుకో

 

పట్టుకో పట్టుకో
మంచి అవకాశాలు
జారవిడుచుకోకు
మంచి  స్నేహాలు
బంధాలు
వదులుకోకు
తల్లితండ్రులు నీకిచ్చిన
సంస్కారాన్ని
మన సంస్కృతి
వదులుకోకు
కుటుంబంతో
గడిపే
అపురూప క్షణాలు
అద్భుత జ్ఞాపకాలు
పదిలంగా  దాచుకో
కాలం అమూల్యం
ముందుకు నడిచిపోవడమే
దాని లక్షణం
ఒడిసి పట్టుకో
నీ చేతిలో ఉన్న కాలాన్ని

21.9.25

చల్లని మేఘం

 

చల్లని మేఘం
వర్షించడానికి
సిద్ధంగా ఉన్న మేఘం
చిటపట చినుకులుగా
మారుతున్న మేఘం
రైతన్నకి ఇష్టమైన  మేఘం
వేసవిలో జనం
ఎదురుచూసే
మేఘం
మనందరకీ
ఎంతో ఇష్టమైన మేఘం 

24.9.25

అన్వేషణ

 

అన్వేషణ
ఒక దీపం
చీకట్లో  ప్రయాణిస్తున్నా
మనకి
దారి చూపుతునే
ఉంటుంది
మన అన్వేషణ
తరువాతి తరాలకు
వెలుగు చూపే
కాగడాగా
మారుతుంది

25.9.25

వెలుగు చుక్కలు

 

వెలుగు చుక్క
అమావాస్య చీకట్లో
సైతం ప్రకాశిస్తుంది
మనకి దారి చూపుతుంది
జీవితాన  మనకి
సన్మార్గం  చూపే
వెలుగు చుక్కలెన్నెన్నో
మనని ఉన్నత
శిఖరాలకి తీసుకెళ్ళే
వెలుగు చుక్కలెన్నాన్నో
ఆలుమగలే ఒకరికొకరు
కావొచ్చు  వెలుగుచుక్కలు
పిల్లలే తల్లి తండ్రుల
ఆశాదీపాలు

26.9.25

స్వప్నాలు

 తేది: 21.9.25

శీర్షిక: స్వప్నం సాకారమైతే...


రంగు  రెక్కల స్వప్నాలు

యువతవే

అబ్బాయిల స్వప్నాలు 

అమెరికాలో

గ్రీన్ కార్డ్ తో

స్థిరపడటం

అమ్మాయిలు కూడా 

నేడు ఆరోగ్యకరమైన పోటీ 

తన మనసుకి నచ్చిన 

తన కుటుంబానికి  నచ్చిన 

అబ్బాయి తనకి

తోడు నీడ కావాలని

అండ దండ అవ్వాలని

సీతాకోక చిలుకల్లాటి

అమ్మాయిల రంగు రంగుల

స్వప్నాలు 

స్వప్నాలు సాకారం 

కావొచ్చు 

తప్పటడుగులు వేస్తే

తమ రంగు రంగుల 

స్వప్నాలు కరిగిపోవచ్చు 


ఇది నా స్వీయ కవిత 

డాక్టర్ గుమ్మా భవాని


వెలుగు దారి

 

వెలుగు దారిలో
పయనించు
విద్య  నీకు
చూపుతుంది వెలుగు దారి
మానవత్వమే
వెలుగు దారి
అందరినీ ప్రేమించడం
వెలుగు దారి
తోటి మనిషికి
సాయపడటం
వెలుగు దారి
మహనీయుడివై
వెలిగిపోతావు
వెలుగుదారిని
నీదారిగ మార్చుకుంటే

27.9.25

ఉప్పెన

 

ఉప్పెన ఊళ్ళనే
మింగేస్తుంది
పంటచేలను
ముంచేస్తుంది
జన జీవనం
అల్లకల్లోలమౌతుంది
ప్రభుత్వ యంత్రాంగాన్ని
పరుగులు  పెట్టిస్తుంది
కోట్ల నష్టం
రాష్ట్రాలకి
ప్రజలకి
ప్రకృతి  విలయతాండవం
నిర్లక్ష్యం కూడదు
అప్రమత్తతమై ఉండాలి
ఎల్లవేళలా

28.9.25

గడియారం

 

గడియారంలో ముళ్ళు
పరిగెత్తుతునే ఉంటాయి
సెకన్ల ముల్లు  త్వర త్వరగా
నిముషం తెలియకుండానే
గంటల ముల్లు హుందాగా
గడియారం మనని కూడా
పరిగెట్టిస్తుంది
బడికి
ఆఫీసులకి
వంటకి
భోజనాలకి
వెనుతిరిగి చూసుకొని
అప్పుడే షష్ఠి పూర్తి
అయిపోయిందా
అనుకుంటాం
విశ్రాంతిగా ఉన్నప్పుడు
పరుగులు తీసే
గడియారాన్ని
చూస్తూనే ఉంటా

29.9.25

గుండె కోత జ్ఞాపకాలు

 అంశం: కత్తి కన్నా పదునైనవి జ్ఞాపకాలు 

ప్రతి క్షణం గుండెను కోస్తూ

తేది:24.9.25

శీర్షిక:  గుండెకోత జ్ఞాపకాలు 


ఆలుమగలు 

హాయిగా  కాపురం కొనసాగిస్తుంటే

ఏ ఒక్కరు ఒంటరిగా మిగిలినా

కత్తి కన్నా  పదునైనవి 

గుండెను కోసే జ్ఞాపకాలు

గాఢంగా  ప్రేమించిన అమ్మాయి 

తండ్రి మాటకి తలవంచి దూరమైతే

గుండెను పిండే జ్ఞాపకాలు 

మిగిలిపోతాయి ఎప్పటికీ  

ప్రేమించిన ప్రియుడు

మోసం చేసి నమ్మకాన్ని  వమ్ముచేస్తే

తీపి జ్ఞాపకాలు  తేనె పూసిన

కత్తవుతాయి 

తల్లితండ్రులను కోల్పోయి 

అనాధలయిన పిల్లల కన్నీరు  

జ్ఞాపకాల రక్త కన్నీరే

గత జ్ఞాపకాలు గుండెను 

కోసేవి ఎన్నెన్నో 


ఇది నా స్వీయ కవిత 

డాక్టర్ గుమ్మా భవాని 

Result declared


రాతిగోడ

 

రాతి గోడ
సుధృడం
మానవుడి  సాంకేతిక
పరిజ్ఞానానికి
నిదర్శనం
రాతి గోడలలో
అమాయకులని
బంధించవద్దు
రాతి గోడల మధ్య
నివసించి
మనుష్యుల మధ్య
దూరం పెంచొద్దు
దేవాలయాలు
గ్రంధాలయాలు
విశ్వ విద్యాలయాలు
రాతి గోడలమధ్య
మరింత  సురక్షితం
మనోహరం
చరిత్రలో
ఎన్నో  కట్టడాలు
రాతిగోడలవే
ఈనాటికీ
దర్శిస్తుంటాం మనం

1.10.25

విత్తనం

 

చిన్న విత్తనమే
మహా వృక్షం
పసిపాపే అవుతుంది
దేశాన్నేలే ప్రధాని
మరో శిశువు
కాలంతో పాటు
అడుగులేస్తూ
అంతరిక్షాన్ని చేరుకుంటుంది
అమ్మ ఒడిలోని పాపలే
విద్యార్థి దశ దాటి
ఉపాధ్యాయులు
వైద్యులు
జవాన్ లు
రైతన్నలు
ఎన్నెన్నో  వృత్తులలో
పాప అమ్మగా
అమ్మ అమ్మమ్మగా
విత్తనం
మహావృక్షమైనట్టు
వంశవృక్షం కూడా
విస్తరిస్తుంది

2.10.25

వెలుగు రేఖలు

 

అంశం:చీకటి  కిటికీ
తేది: 28.9.25
శీర్షిక: వెలుగు రేఖలు
ఈ గదిలో
నేను బందీని
గదిలో చీకటి
బయట చీకటి
కిటికీలో నుండి చూసినా
చీకటే
అయినా నాకు ఆశ
త్వరగా  తెల్లవారుతుందని
ఈ చీకటి కిటికీ నుండి
అరుణోదయాన్ని చూస్తానని
ఈ చీకటి కిటికీ  వెలుగులో
నన్ను  చూసి
నా కష్టం  తెలుసుకుని
నన్ను  స్వేచ్ఛా ప్రపంచం లోకి
తీసుకెళ్తారని
చీకటి కిటికీలోకి కూడా
వెలుగురేఖలు  వస్తాయి
వెలుగు నిండుతుంది
మన జీవితంలో

ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని


రాతలోనే జీవితం

 

చిన్నప్పుడు
కాలేజీ లో
వ్యాసకర్త ని నేను

ఆ తరువాత
సరదా కవితలు
ఉగాది కవితలు
కలం
కాగితం మీద
పరుగులు తీయించే
భావాలు

ఇప్పుడు  చిన్న కథలు
అప్పుడప్పుడూ పెద్దవి

ఎందరికి నచ్చిందో
లెక్కించుకుంటా
వీరు కదా
నా అభిమానులని
సంబరపడతా

రాయడం
నా అలవాటని
రాతలోనే జీవితమని
తెలుసుకున్నా
ఇప్పుడప్పుడే

ఇప్పుడు
కవితలే
నా సఖులు

22.9.25

నమ్మకం

 రైతుకు సాయంగా 

వర్షం కురిపించగలమని

సూర్యుడిని కప్పేసి

చల్లదనం  ఇవ్వగలమని

మేఘాల  నమ్మకం 

ప్రగతి పథంలో

ముందుకి నడిచే మానవుడు

కాలుష్యాన్ని దూరం

చేస్తాడని

మేఘాల నమ్మకం

23.9.25

ఊహాలోకం

 

ఆ లోకం లో
ఆనందాల హరివిల్లు
సంతోషాల విరిజల్లు
చిన్నారుల కేరింతలు
యువతీ యువకుల
ఆటపాటలు
విద్యని తపస్సుగా
పరిగణించే
సరస్వతీ పుత్రులు
అసమానతలు లేని
లోకం
అనాధలు లేని
లోకం
కళకళలాడే మొహాలతో
వృద్ధులు
లోకం
ఇదే లోకం అయితే
ఎంత హాయి

14.9.25

Wednesday, 17 September 2025

నదీమతల్లి

 

తేది: 14.9.25
శీర్షిక:  నదీమతల్లి

మీకు తాగే నీరిస్తా
చల్లని గాలిస్తా
మీ పొలాలకి నీరందిస్తా
నా నీటిలో స్నానాలు చేసి
అందరికీ  రోగాలు తేకండి
అన్నిచోటలా కైలాసభూములు
ఉన్నాయి
మృతదేహాలు గంగమ్మ తల్లిలోనే
పడేయకండి
నా పుష్కరాలకి
తొక్కిసలాటలతో
జనం ప్రాణాలు తీయకండి
నేను ప్రవహించిన ప్రాంతాలు
నాగరికత  కేంద్రాలుగా
అభివృద్ధి  చెందాయి
తిరోగమనానికి తావీయక
మునుముందుకు సాగిపొండి

ఇది నా స్వీయ కవిత


చిన్ని  చిన్ని సరదాలు

 

తేది:2.8.25
శీర్షిక: చిన్ని చిన్ని సరదాలు

స్నేహితులతో ముచ్చట్లు
అట్లతద్ది  ఆటలు
అన్నదమ్ములతో దెబ్బలాటలు
రేడియోలో పాటలు
స్నేహితులతో
చూసిన చలనచిత్రాలు
కెరటాలతో ఆడిన
ఆటలు
అమ్మానాన్నలతో
ప్రయాణాలు
పెళ్లి నాటి ముచ్చటలు
తలచి తలచి నవ్వుకోవడం
కన్నబిడ్డల పెంపకం
మనవల కబుర్లు
పుస్తకాలు  చదవడం
అంశం కనపడగానే
కవిత రాయడం
అన్నీ చిన్ని చిన్ని
సరదాలే

ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని


విజయకేతనం

 

నగరం నడిబొడ్డున
అంతా  హడావుడి
అంతా చైతన్యం
కారులు
బైకులు
షాపులు
మాల్స్
కిక్కిరిసిన జనం
జనం కోసం హోటళ్ళు
ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్
నగరం నడిబొడ్డు
అంటే
నగరానికే
విజయకేతనం

17.9.25

విలయతాండవం

 

సముద్రపు గుండెలపై
ఎన్నెన్నో  ఓడలు
ఎన్నెన్నో   జలచరాలు
నూతన ప్రాంతాలని
సంపదలని  వెతుకుతూ
ఎందరో ఓడలమీద
ప్రయాణాలు
అపాయాలతో
మృతదేహాలుగ
మారిన వేలవేల
ప్రయాణికులు
సమూద్రం పోటెత్తింది
అంటే ఆ గుండెల
విలయతాండవమే

16.9.25

ఊహాలోకం

 అదే లోకం లో

ఆనందాల హరివిల్లు 

సంతోషాల విరిజల్లు

చిన్నారుల కేరింతలు

యువతీ యువకుల

ఆటపాటలు

విద్యని తపస్సుగా

పరిగణించే

సరస్వతీ పుత్రులు

అసమానతలు లేని

లోకం

అనాధలు లేని

లోకం

కళకళలాడే మొహాలతో

వృద్ధులు 

అదేలోకం

ఇదేలోకం అయితే 

ఎంత హాయి

14.9.25

Friday, 12 September 2025

చిరస్థాయి

 

ఆది మానవుడి నుండి
ఆధునిక  మానవుడి  వరకు
ఎన్నెన్నో  కట్టడాలు
సింధు నాగరికత  కట్టడాలు
హంపీ కట్టడాలు
షాజహాన్ కట్టడాలు
బ్రిటిష్ దొరల కట్టడాలు
ధనవంతుల కట్టడాలు
ప్రభుత్వాల కట్టడాలు
గ్రంధాలయాలు
విజ్ఞానకేంద్రాలు
కట్టడాలు  ఎంత
దృఢంగా ఉంటే
అంత చిరస్థాయిగా
చిరకాలం నిలుస్థాయి


Thursday, 11 September 2025

ద్వీపం లో తానే రాజు

 

ఒకానొక ద్వీపం
ఒకే ఒక మనిషి
పడవ ఒడ్డుకు
చేరిస్తే చేరేడు అక్కడికి
దొరికిన ఆహారం తిన్నాడు
కర్రలతో తనే ఇల్లు
కట్టుకున్నాడు
ద్వీపమంతా తిరిగాడు
అందాలు చూసి ఆనందించేడు
ద్వీపంలో  నలువైపులా
ఎర్రజెండాలు ఎగురవేసాడు
ఏ పడవైనా  రాకపోతుందా అని
ఒక రోజు అనుకోకుండా
పెద్ద పడవ అటువైపు వచ్చింది
అతనిని సంరక్షితంగా
తన వాళ్ళ దగ్గరకి  చేర్చింది


మారణహోమం

 

కొన్ని పానీయాలు
విషం విషం
మరికొన్ని  తాపీగా
ప్రాణం హరిస్తాయి
ప్రభుత్వం  ఆ పానీయాలు
నిషేధించాలి
పానీయ  సంస్థలతో
కుమ్మక్కై ప్రజల ప్రాణాలు
హరించకూడదు
కొన్ని వేల
కుటుంబాల క్షోభకి
కారణం కాకూడదు

11.9.25

ఎదురుచూపు

 

ఆయన సైన్యం లో
పనిచేస్తున్నారు
పెద్ద ఉద్యోగమే
నేను
మా పాప
అత్తమామలు
మా ఊళ్ళో
ఆయన దగ్గర నుండి
ఉత్తరాలు
అప్పుడప్పుడు  వచ్చేవి
ఆరోజు  ఇంట్లో  పండగే
ఉత్తరం రాసా
పోస్ట్ చేసా
అని ఫోన్ లో చెప్పారు
ఎప్పటి లాగే
ఆ ఉత్తరం  నన్ను
చేరనేలేదు
అడుగుదామంటే
ఆయనే
మమ్మల్ని చేరలేదు
కన్నీళ్ళతో ఎదురు చూస్తున్నా
ఉత్తరం కోసం
ఆయన కోసం

10.9.25

ఎడబాటు

 

ఎడబాటు
వృద్ధ దంపతుల మధ్య
ఒకరేమో అమెరికా
ఒకరేమో ఆస్ట్రేలియా
కొడుకులిద్దరూ
పంచుకున్నారు
మనవరాలు  జాలితో
వీడియో కాల్ లో
కలుపుతుంది
కన్నీళ్ళతో
పలకరించుకుంటారు
అనారోగ్యాల గురించి
తెలుసుకుంటారు
వారి చూపుల నిండా  ప్రేమే
మనవరాలికి ధన్యవాదాలు
చెప్తారు
వారు కలిసే రోజు
ఎప్పటికైనా వస్తుందా
అని ఎదురు చూస్తుంటారు

9.9.25

Sunday, 7 September 2025

కలువభామలు

 

నీటిలో కలువలు
నీటికే అందం
మన కనులకి విందు
చంద్రకాంతిలో వికసిస్తూ
చంద్రుడి రాకకై ఎదురు చూస్తూ
పూజకి పుష్పాలౌతూ
కలువభామల సొగసు
సున్నితత్వం వర్ణనాతీతం


సూర్యులు

 

ఆకాశంలో వేనవేల సూర్యులు
ఒకటి వెలుగుతుంది పగలు
మిగతావి రాత్రి

7.9.25

రెండు గుండెలు

 

అది ప్రేమ దీపం
జీవితమంతా వెలగాలని
వారిద్దరూ
తీవ్ర ప్రయత్నం చేసారు
దీపం ఆరిపోకుండా
తమ ‌చేతులు
అడ్డుపెట్టారు
ఇన్ని ప్రయత్నాలు చేసినా
రెప్పపాటులో
ప్రేమ దీపం ఆరిపోయింది
రెండు గుండెలు
ఆగిపోయేయి

7.9.25

Saturday, 6 September 2025

నీటి నీడల సొగసులు

 

నీరంటే ఆహ్లాదం
నీటి దగ్గర  జంటలు
నీటిలో నీడలు
సముద్రం ఒడ్డున
ఆటలు
కేరింతలు
మరిచిపోని అనుభవాలు
కెరటాలతో
ప్రమాదం లేని ఆటలు
సముద్రం దగ్గర
సూర్యాస్తమయ
అందాల కోసం
ఎదురుచూపులు
నదులన్నా
సముద్రమన్నా
ఆటవిడుపు కేంద్రాలు
సెలయేటి అందాలలో
నీటిలో నీడలు
తీరప్రాంతాలలో
చిన్న పిల్లల
ఇసుక గూళ్ళు
ప్రేమ పక్షుల
చెట్టాపట్టాలు
అన్నీ కలిసి
నీటికే అందం
నీటిలో
తమ నీడలు
చూసి మురిసే
జంటలెన్నో

6.9.25

మరుక్షణం

 

ఒక క్షణం నుండి
మరో క్షణం  లోకి
ఆ శుభ క్షణంలో
అడుగు పెట్టగానే
నూతన దంపతులు
కావొచ్చు
బిడ్డకి జన్మనిచ్చి
మాతృమూర్తి  కావొచ్చు
ప్రేమించిన అమ్మాయి
తన ప్రేమను అంగీకరించవచ్చు
అనుకోకుండా ప్రమాదం
సంభవించొచ్చు
ఎవరైనా  తన
జీవిత భాగస్వామిని
కోల్పోవచ్చు
మరు క్షణం
ఏం జరుగుతుందో
ఎవరికెరుక

5.9.25

పదిలం పదిలం

 

ఆకుల పల్లకిలో
అక్షరాల బొమ్మలు
అందంగా
పల్లకి మోసేది మనమే
బొమ్మలు  తయారుచేసేది
మనమే
ఆ బొమ్మలు
కవితలు
కథలు
కావ్యాలు
ఆకుల పల్లకి
పదిలం
అక్షరాల బొమ్మలు
పదిలం
అవి శాశ్వతంగా
నిలవాలి
మనకోసం

4.9.25

మంచి రోజుల కోసం

 

జీవితం లో
ఎన్నో అందుకోలేం
అందుకోలేక నిరాశానిస్పృహలు
చిన్న చిన్న కోర్కెలు కూడా
తీరవు
తమ బిడ్డలని
మంచి  చదువులు
చదివించుకోలేక
మనసుకి నచ్చిన
మనువు చేసుకోలేక
సరైన ఉద్యోగం దొరకక
ఆశించినవి అందుకోలేక
నిస్సహాయంగా
మంచిరోజులు రాకపోతాయా
అని ఎదురుచూస్తూ
బతుకులు
గడిపేస్తుంటాం

3.9.25

Tuesday, 2 September 2025

బాపు

 సాక్షివై సాక్షీభూతమై

తెలుగు తేజమైన బాపుఫ్ర

గీతలతో గీతాంజలి 

ఘటించావు తెలుగు తల్లికి

రాతలతో కంప్యూటర్  చేరాతని

శాసించావు నువ్వు 

స్నేహానికి అందమైన

నిర్వచనం  నువ్వు 

పొందికైన అతివ అందాలు

సెల్యులాయిడ్కెక్కించిన బాపు

మౌన ఋషివి నీవు

ముళ్ళపూడి  నీమాట

ముచ్చటైన జంటై

అద్భుతాలు సృష్టించారు  మీరు

ముత్యాల  ముగ్గుని

తీర్చిదిద్దేవు తెలుగు  వాకిట

సుస్థిరం నీ స్థానం

తెలుగువారి 

ఎదలో  మదిలో 

సినీ వినీలాకాశంలో

తళుకులీనే తారవు నీవు 


2.9.2014

ఆశకి ప్రాణం

 

మనిషి   ఆశాజీవి
తనకి
తనవాళ్ళకి
మంచి జరగాలని
తను అనుకున్నది
సాధించాలని
ఆశ పడుతూనే ఉంటాడు
ఆశించని జరగని
ప్రతిసారీ
నిరాశల అలసట
తప్పదు
చేసేదేం లేక
ఆశకి మళ్ళీ
ప్రాణం
పోస్తూ
బతికేస్తూ ఉంటాడు

2.9.25

తెర వెనుక భాగోతం

 

పెళ్ళంటేనే
అమ్మాయికి
కొత్త తెర
బిడియం
తెలియని ఇంట్లో 
మసలడం
నోములు
పూజలు
అత్తమామలకి
భర్తకి
ఎదురు  చెప్పలేక పోవడం
సంసారం  గుట్టుగా
చేసుకోవడం
అంతా
తెర వెనుక భాగోతం

1.9.25

పురాతన కళలే మన వారసత్వ సంపద

 

వీణ
వేణువు
చిత్రలేఖనం
శిల్పం
నాట్యం
సాహిత్యం
నాటకం
ఇవన్నీ  పురాతన
కళలే
గుహలలో చిత్రాలు
అజంతా
ఎల్లోరా  చిత్ర సంపద
అన్నీ
పురాతన కళలే
మన
పురాతన కళలను
చూసి
మనం గర్విద్దాం

31.8.25

అవగాహనకి అతిముఖ్యం

 

చిన్న  పిల్లలు
బాగా పరిశీలిస్తారు
అందుకే అన్నీ త్వరగా
నేర్చుకుంటారు.
యువత టెక్నిలజీ
పరిశీలించి ప్రగతికి
దోహదం చేస్తారు
విప్లవకారులు రాజకీయ
సామాజిక పరిస్థితితులను
పరిశీలిస్తుంటారు
పరిశీలన అవగాహనకి
అతిముఖ్యం

30.8.25

నడినెత్తి సూరీడు

 నడి నెత్తిన సూరీడు

కొడుకింటికి

చేరాలంటే

ఎంత దూరం ప్రయాణం 

ఆ వృద్ధ  దంపతులకు

నడి నెత్తిన  సూరీడు 

ఐనా తప్పవు

పొలం పనులు

ఇంటావిడ

బువ్వ తెచ్చేదాకా

నడి నెత్తిన  సూరీడు 

రక్తమోడుతూ

మొగుడి బారినుండి 

తప్పించుకొని

పుట్టింటికి చేయాలి

గృహహింస  బాధితురాలు

29.8.25

అందమైన మజిలీ

 

యవ్వనపు మజిలీ
కొన్నాళ్ళే
ఆశయాలు సాధించే
తరుణం అది
తనని తాను తీర్చి
దిద్దుకునే కాలం అది
తన వ్యక్తిత్వానికి
మెరుగులు పెట్టుకునే
యుక్తవయసు
అది అందమైన మజిలీ
కానీ
యవ్వన ప్రాయం
కరిగిపోతుంది  త్వరగా
యవ్వనం కేవలం
ఓ మజిలీ
మధ్యవయసుకి
సాగిపోకతప్పదు
కాలం తెచ్చే మార్పులతో
మనకి తెలియకుండానే
వృద్ధాప్యం వరకు
చేరుకుంటాం


28.8.25

నేలమీది చుక్కలు

 ఆనందంగా  విహార యాత్రకి బయలు దేరా  కుటుంబం.అకస్మాత్తుగా  ఘోర ప్రమాదం.అనుకోకుండా ఓ నవయువకుడు కారులో ఆ పక్కగా వెళ్తున్నాడు.వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసేడు.సకాలంలో ఆసుపత్రికి  తీసుకెళ్ళి వైద్యం చేయించడంతో కుటుంబం అంతా కళకళలాడి ఆ యువకుడిని తమ కుటుంబ సభ్యుడిగా భావించడం మొదలెట్టారు.చుక్కలు విరిగినా అప్పుడప్పుడు అతుక్కుంటాయి.

27.8.25

మహా కావ్యం

 

ఆ సముద్రం
నాకో మహాకావ్యం
ఎగిసి పడే కెరటాలు
అలల గలగలలు
ప్రాణాలకు తెగించే
బెస్తల జీవితాలు
తుఫాన్లకు
అల్లకల్లోలమయ్యే
తీరప్రాంతాలు
ప్రశాంత సమయంలో
కేరింతలతో
పులకించే
పర్యాటకులు
బతుకు మీద
విరక్తి పుట్టి
ఆ సముద్రంలోకే
నడుచుకొని వెళ్లి
ప్రాణాలు తీసుకునే
అభాగ్యులు
సముద్రం
రారమ్మని
కవ్విస్తుంటుంది
తానే ఓ మహాకావ్యం

26.8.25

Sunday, 24 August 2025

ప్రేమలేఖలు

 

కన్నుల కవితలు
యువత ప్రేమలేఖలు
ముదిమి వయసులో
కూడా రాయగలరు కొందరు
ఆ కైతల అందమే అందం
ఎవరి కోసమో ఆ కైతలు
వారి మనసుని మరింత
రంజింపచేస్తాయి

25.8.25

Saturday, 23 August 2025

వెన్నెల దిమ్మె

 

అనగనగా ఓ చిన్న గ్రామం.గ్రామంలో మర్రిచెట్టు  చుట్టూతా దిమ్మె.పున్నమి నాడు వెన్నెల అంతా ఆ దిమ్మె  మీదే.గ్రామస్థులంతా ఆ దిమ్మెని చంద్ర దిమ్మె అని పిలిచేవారు.వెన్నెల రాత్రులు యువకులు అక్కడ కుమికూడి నృత్యాలు చేసి ఆనందించేవారు

24.8.25


కనులకి విందు

 

మామిడిపూత
శోభాయమానంగా
వేపపూత
ఉగాది పచ్చడికి
ఉద్యానవనంలో
అందమైన పూత
అడవులలో
ఆహ్లాదకరంగా పూత
యువత జాతి
మెచ్చే పూత
పూత చెట్టుకి
అందం
పూత కనులకి విందు

23.8.25


సలసలమరిగే రక్తం

 

వయసు
ఇరవై మూడు
ఆవేశం యువకుల్లో
కొందరు యువతుల్లో
అడవిలో అన్నల్లో
రక్తం సలసల మరుగుతుంది
ఎర్రజెండా రెపరెప లాడుతుంది
కమ్యూనిజం
మార్క్సిజం
మావోయిజం
ఎర్రజెండాని
గౌరవించేవే

22.8.25


Wednesday, 20 August 2025

అలా ఒక్కటయ్యారు

 

అనగా అనగా ఒక జంట.అబ్బాయికి  చిన్నతనంలో అమ్మ నాన్న ప్రమాదంలో  మృత్యువాత పడ్డారు.అందుకు ఆ అబ్బాయికి ఎప్పుడూ ప్రాణ రక్షణ  గురించి  భయం.
అబ్బాయి  పేరు పాణి.అమ్మాయి  పేరు ఝాన్సీ.అది కన్నతల్లి  పెట్టిన పేరు.తల్లి  అకాల మరణం  తరవాత, తండ్రి  మరో పెళ్ళి  చేసుకొని తండ్రి, సవతి తల్లి ఆమెని నిర్లక్ష్యం  చేసేరు.
ఝాన్సీ, పాణిని ఒకసారి  కలిసింది.ఇద్దరి మధ్య  ప్రేమ రోజు రోజుకీ పెరిగింది. పాణి తన పట్ల  చూపే ప్రేమ, ఆరాధన,అతని బిగి కౌగిలి  అన్నీ ఝాన్సీకి ఎంతో ఇష్టం. ఝాన్సీ  ధైర్యం, సాహసం పాణికి ఎంతో భద్రతని ఇచ్చేది.అలా బిగి కౌగిలి, భద్రతా భావంతో వారిరువురూ ఆలు మగలయ్యారు.

21.8.25

ప్రేమకి ప్రతిరూపాలు

 

పసి ప్రాయంలో
అమ్మ  కౌగిలి
నాన్న భద్రత

పెద్దయ్యాక
మిత్రుల
ఆప్యాయపు కౌగిలి

వైవాహిక జీవితం
జీవిత భాగస్వామి
కౌగిలి
భద్రత

వృద్ధాప్యంలో
కన్నబిడ్డల
భద్రత
కౌగిలి

కౌగిలి
భద్రత
ప్రేమకి ప్రతిరూపాలే

21.8.25

అద్భుతాలు

 

మబ్బులు   ఆడుతునే
ఉంటాయి
అటూఇటూ  పరిగెడుతునే
ఉంటాయి
వర్షిస్తాయి
నీలి మబ్బులు
నల్లమబ్బులు
అవన్నీ మనకి
అద్భుతాలు
ఆనందాలు

20.8.25

వాగ్దేవి

 

మా తాతగారు
మా నాన్న గారు
దాచిపెట్టిన సాహిత్యం
అటకమీద అక్షరాలు
నాకు  గణితం
విజ్ఞానశాస్త్రం
చాలా ఇష్టమున్నా
సాహిత్యం కూడా
చాలా ఇష్టం
అది మా బామ్మ నుండి
అమ్మ నుండి వచ్చింది
నాన్న గదిలో  ఎన్నో
పుస్తకాలున్నా
అటకమీద అక్షరాని
కూడా  దింపి చదువుతుంటాం
అక్షరాలు  వాగ్దేవి కదా
వాటిని ఎంత ప్రేమిస్తే
అంత ఆనందం

19.8.25

విజేత

 

ఆమె జీవితంలో
మొదటి  మలుపు
అష్టకష్టాలే
వైఫల్యాలే
వెటకారాలు
ఎత్తిపొడుపులే
ఐనా ఆమె
రెండో మలుపు కోసం
ఎదురు చూసింది
విజయలక్ష్మి
ఆమెని వరించింది
విజేతగ నిలిచింది
ఆదరణ
మర్యాద
ప్రతిష్ట
అన్నీ లభించాయి
ఆ మలుపు
తరువాత

18.8.25

ప్రగతికి దారి

 

అగ్గి కావ్యం
శ్రీశ్రీ మహాప్రస్థానం
అగ్గి కావ్యం
ప్రతీ విప్లవకారుని
కవిత్వం  అగ్గి కావ్యం
దళిత కవిత్వం
అగ్గి కావ్యం
స్త్రీ వాద కవిత్వం
అగ్గి కావ్యం
కార్మిక కర్షక
పక్షపాత కవిత్వం
అగ్గి కావ్యం
అగ్గి కావ్యం
ప్రగతికి  దారితీస్తుంది
వ్యత్యాసాలను
దూరం చేస్తుంది

17.8.25

దీపకళికలా వెలుగుదాం

 

వెలుగు
వెలిగించు
నీ చదువుతో
సంస్కారంతో
వినయ విధేయతలతో
మంచి మర్యాదలతో
స్నేహంతో
ఆదరంతో
నిండు మనసుతో
సాయపడే మనసుతో
నీ ఆశయాలతో
ప్రేరణతో
ఒక దీపంతో
ఎన్నో  దీపాలు
వెలిగించినట్లు
జీవితమంతా
ఎన్నో దీపాలు
వెలిగించుదాం

16.8.25

అందాల చంద్రుడు

 అందాల  చంద్రుడు.వెండి వెన్నెల  కురిపిస్తాడు.చంద్ర లోయ ఎంత అందంగా  ఉంటుంది!  మానవుడు చంద్ర మండలం మీద అడుగు  పెట్టాడు.అదో అద్భుత  విజయం.చంద్ర  మండల అందాలు, లోయ అద్భుతాలు అన్నీ చూడగలిగాడు. భూమి మీద  ఉన్న  మనం కూడా  ఆ అద్భుతాలను,ఆహ్లాదకర వాతావరణాన్ని  చూడగలిగాం

15.8.25

మనోగతం

 గతం

స్వగతం

మనోగతం

14.8.25

ఆశాజీవిని

 పేదల బతుకులు

పూట గడవని

బతుకులు

దీనంగా

హీనంగా 

భయం భయంగా 

గడిచే బతుకులు

నిర్భాగ్యపు బతుకులు

ఏసాయం  దొరకని

బతుకులు

అవిద్య 

అంధకారం 

చీకటి బతుకులు

వారి బతుకుల్లో  కూడా 

ఆశాదీపం

కనిపిస్తుంది  నాకు 

ఆశాజీవిని నేను

14.8.25

అరుణ కిరణాల కోసం

 చీకటి కిటికీ

లోంచి

వెలుతురు ఎప్పుడు 

వస్తుందా అని చూస్తున్నా

బతుకులో చీకటి

జీవితంలో నిరాశ 

వెలుగురేఖలు

ఎప్పుడు  పరుచుకుంటాయా

అన్న ఆశ

చీకటి కిటికీ  వెనక

అపరిచితుడు

ఎవరైనా ఉన్నాడేమో

అన్న భయం

కిటికీ  మూసేస్తే

చల్లగాలి లేదు

ప్రకృతి తోడు ఉండదు

అరుణ కిరణాల కోసం

ఎదురు చూస్తూ

13.8.25

సంస్కారం

 

చిన్న వయసులో
పెద్ద మనసు
ముసలివాళ్ళని
రోడ్డు దాటించేవారు
అమ్మకి ఇంటి పనిలో
సాయం చేసేవారు
ఇంట్లో పెద్దవారి గురించి
శ్రద్ధ  తీసుకునేవారు
చుట్టు పక్కల చెత్త
శుభ్రం చేసేవారు
చిన్న పిల్లలకి  ఎంత
పెద్ద మనసైనా ఉంటుంది
అది వారి సభ్యత
సంస్కారం  మీద ఆధారపడి
ఉంటుంది

12.8.25


Tuesday, 12 August 2025

విద్యాదీపాలు

 

దీపం జ్యోతి  పరబ్రహ్మం
పూజ మొదలెట్టాలంటే
దీపం వెలిగిస్తాం
దీపావళి నాడు
ఇంటింటా దీపావళి
చీకట్లని తొలిగించేది
దీపకాంతి
కార్తీక  మాసంలో
కార్తీక  దీపోత్సవం  చేస్తారు
విద్యాదీపాలు వెలగాలి
ఇంటింటా
దేశమంతా

11.8.25

చిన్న వయసులో పెద్ద మనసు

 

చిన్న వయసులో
పెద్ద మనసు
ముసలివాళ్ళని
రోడ్డు దాటించేవారు
అమ్మకి ఇంటి పనిలో
సాయం చేసేవారు
ఇంట్లో పెద్దవారి గురించి
శ్రద్ధ  తీసుకునేవారు
చుట్టు పక్కల చెత్త
శుభ్రం చేసేవారు
చిన్న పిల్లలకి  ఎంత
పెద్ద మనసైనా ఉంటుంది
అది వారి సభ్యత
సంస్కారం  మీద ఆధారపడి
ఉంటుంది


Saturday, 9 August 2025

జై జవాన్

 

నా మిత్రమా
నీకోసం  ఎదురుచూస్తున్నా
జాతి గర్వించే సేవ నీది
యుద్ధంలో సంరక్షితంగా
బయటపడ్డావు
సెలవు దొరికితే
నాదగ్గరకే వస్తావు
అక్కడ  నువ్వు
జైవాన్‌వి
ఇక్కడ  ఇద్దరం  జై కిసాన్
వ్యవసాయం  చేయడానికి
వెనకాడవు నువ్వు
నా పిల్లలు  మామా
అంటే  మురిసిపోతావు
వాళ్ళూ నీ కోసం
ఎదురు చూస్తుంటారు
నీగురించి గర్వంగా చెప్తుంటారు


మిత్రమా

 

మిత్రమా
నా చిన్ననాటి  నేస్తమా
భుజాలమీద చేతులేసుకుని
తిరిగాం
కన్నీరొచ్చేదాకా నవ్వేం
ఏటి ఒడ్డున  గంటల
తరబడి గడిపేం
బడిలో ఎందరు మిత్రులున్నా
నాకు నువ్వు ప్రత్యేకం
మనిద్దరి మధ్య
పేద గొప్ప
బేధం లేదు
జీవితమంతా కలిసే నడిచాం
మిత్రమా
ఈరోజు నువ్వు లేవు
నీ జ్ఞాపకాలు మాత్రమే
నాతో ఉన్నాయి

9.8.25


Selected 

Thursday, 7 August 2025

తెలివిని ఉపయోగించాల్సిందే

 

తెలివి
చిక్కులనుండి
తప్పించుకోవడానికి
తమని తాము
రక్షించుకోవడానికి
సమయస్ఫూర్తిగా
ప్రవర్తించడానికి
చదువు లేకున్నా
తెలివైన వాళ్ళుంటారు
చదువుకున్నా
తెలివితేటలు ప్రదర్శించరు
కొందరు
అనుభవంతో కూడిన
తెలివితేటలు కొందరివి
తెలివిని ఉపయోగించాల్సిందే
దైనందిన జీవితంలో


Monday, 4 August 2025

ప్రకృతిలో గడపడం ఆహ్లాదం

 

ప్రకృతిలో గడపడం
ఆహ్లాదం
పిట్టల కుహు కుహు
రాగాలు  ఆహ్లాదం
చిన్నపిల్లల చిలిపి చేష్టలు
ఆహ్లాదం
యౌవ్వన దశ
ఆహ్లాదం
రంగు రంగు పూవులు
ఆహ్లాదం
ముచ్చటైన జంట
ఆహ్లాదం
ఆహ్లాదమైన వాటిని
అనుభవించడమే  జీవితం


Sunday, 3 August 2025

వివాహ బంధం  ఏకం చేస్తుందన్న ఆశ

 

ఇద్దరి  మధ్య
ప్రేమ  ఉన్నా
ఇద్దరం చెరోవైపు
ఉన్నాం
నేను అతి సామాన్యుడిని
మీరు కోటీశ్వరులు
నీవేమో పెద్ద చదువులు
నాది డిగ్రీ  చదువు
ఇరు హృదయాలు
ఎలా  ఏకమయ్యాయో
మీ పెద్దలని ఎలా
ఒప్పించగలమో
ఇద్దరం చెరోవైపు ఉన్నా
నా ప్రాణం ‌నువ్వు
నా జీవితమే‌ నువ్వు
ఏదో ఒక నాటికి
వివాహ బంధం 
మనని ఒక్కటి
చేస్తుందని ఆశ

4.8.25

మనసు వేదన

 

అంశం:తలుపులు   మూసుకున్న తరువాత
తేది:30.7.25
శీర్షిక: మనసు వేదన
తలుపులు మూసుకున్న
తరువాత
అంతా  నిశ్శబ్దం
నిర్లిప్తత
మనసులో బాధలు
మౌనం
ఎవరికీ చెప్పుకోలేని
నిస్సహాయత
పిల్లల ప్రపంచం వేరు
మనవల
ప్రపంచం  వేరు
గతకాలపు  వైభవాలెన్నున్నా
నేటి ఒంటరితనం
భయంకరం
అప్పుడప్పుడూ
ఓ ఫోన్ కాల్
వీడియో కాల్
పలకరిస్తాయి
ఆనందం
హుషారు నటిస్తాము
తలుపులు తెరిచినా
అదే నటన

ఇది నా స్వీయ కవిత
డాక్టర్  గుమ్మా భవాని
Result  announced


సమాజంలో మనిషి ఒంటరి కాదు

 

ఒంటరి బతుకు
ఒంటరి జీవితం
జీవితం లో తోడు
లేకుంటే
ఉన్న తోడు విడిచి
వెళ్ళిపోతే
తిరిగి రాని లోకాలకి
వెళ్లిపోతే
ఉద్యోగాల కోసం
ఒక్కరే దూరప్రాంతాలకి
తరలివెళ్తే
దేశసేవ కోసం
సరిహద్దుల రక్షణ
కర్తవ్యదీక్షలో నిమగ్నమైతే
ఒంటరితనం లో కూడా
సమాజంలో స్నేహితులని
తోడుని వెతుక్కోవచ్చు

3.8.25

తోడు కావలసిందే

 

చిన్నప్పుడు
అమ్మానాన్నల తోడు
అన్నదమ్ముల తోడు
అక్కచెల్లెళ్ళ తోడు
స్నేహితులతోడు
ప్రేమించిన వారి తోడు
జీవిత భాగస్వామి తోడు
మంచి వ్యక్తుల తోడు
సమాజం తోడు
సంఘాల తోడు
జీవితమంతా ఎవరో ఒకరి
తోడు కావలసిందే

2.8.25

నాణేనికి మరోవైపు

 అందరూ  చూసేది

ఒకవైపు

కొందరే చూసేది

మరోవైపు 

భార్య చూసేది

మరోవైపు 

కన్న బిడ్డలు చూసేది

మరోవైపు 

సన్నిహితులు  చూసేది

మరోవైపు 

నాణేనికి  మరోవైపు 

ఉన్నట్టే

అమానుషత్వం

దౌర్జన్యం 

దుర్మార్గం 

మరోవైపు 

ఎందరిలోనో

1.8.25

స్వీయ రక్షణ

 అమ్మ రక్షణ

నాన్న రక్షణ 

అన్నదమ్ముల రక్షణ

అక్కాచెల్లెళ్ళ రక్షణ

పోలీస్ రక్షణ 

జవాన్ రక్షణ 

ఇరుగూ పొరుగూ

రక్షణ 

వైద్యుల రక్షణ

పచ్చని చెట్ల రక్షణ 

స్వీయ రక్షణ 

రక్షణ వల్లే

కొనసాగుతోంది 

మన జీవితం

లేకుంటే  ప్రాణాంతకమే

30.7.25

నైపుణ్యం విలువ

 మట్టితో కుండలు

మట్టితో దేవుని విగ్రహాలు 

చేనేత వస్త్రాలు 

కొండపల్లి బొమ్మలు 

అన్నీ నైపుణ్యంతోనే

కానీ వారి కష్టానికి 

విలువ తక్కువ 

మనం

ప్రభుత్వం కూడా 

ఆ నైపుణ్యం విలువ  గుర్తించాలి

29.7.25

నా దేశం

 

నాదేశం
ఆర్యులదీ కాదు
తురుష్కులదీ కాదు
బ్రిటిష్ దొరలదీ కాదు

ఈ దేశం
ఈ గడ్డలోనే పుట్టిన
ఆదిమజాతి వారిది
ఈ గడ్డలో పుట్టిన
వారి పూర్వీకులది

అయినా ఈ దేశం నాదేశమే
మా తాత తండ్రులదీ
ఈ దేశమే  నాకు తెలిసిన
విశ్వం
నాకు  తెలిసిన  ప్రకృతి
నేను  చూసిన అందం

ఈదేశం
ఈ సమాజం
మా పరిసరాలు
స్నేహితులు సన్నిహితులు
అన్నిటికీ  అలవాటు  పడ్డ
ప్రాణం  నాది

ఈదేశం నాతల్లి
అమ్మని ఆలింగనం  చేసుకుంటూ
అణువణువూ
దర్శిస్తూ స్పర్శిస్తూ

అమ్మ  ఒడిలోనే
కనుమూస్తానని
ఖచ్చితంగా  తెలుసు 🙏
Selected 2

కవితాగుచ్ఛం

 

అమ్మానాన్నలుఆచార్యులు గురువమ్మలుపడేసారు  నాఒళ్ళో అక్షరాలపొట్లంఆ అక్షరాలు ఇప్పటికీపూసగుచ్చుతున్నా పదాలుగా కవితలుగా1..8. 15
3 50 A.M
Selected


మనోబలం

 

బలం
శారీరిక  బలం
మానసిక బలం
ఆరోగ్యం కోసం
శారీరిక  బలం అవసరం
మనోబలం తో
ఏదైనా  సాధిస్తాం
మన కుటుంబం
మన బలం
మన మిత్రులు
మన బలం
ఆరోగ్యకరమైన ఆహారం
వ్యాయామం
యోగా
ఇవన్నీ
మన బలం
ఎటువంటి బలహీనతలూ
లేకపోవడమే
మనబలం

28.7.25

ఆజన్మాంతం నిలిచేది

 అనుబంధం

అమ్మానాన్న లతో

అక్కాచెల్లెళ్ళతో

అన్నదమ్ములతో

స్నేహితులతో 

జీవిత భాగస్వామితో

కన్నబిడ్డలతో

గురుశిష్యుల  నడుమ 

అహంభావం 

దురాశ

స్వార్ధం 

పెరిగితే

అనుబంధం తగ్గుతుంది 

అనుబంధం  చిక్కనైనది

నమ్మకాన్ని  పెంచుతుంది

ఆజన్మాంతం నిలిచే

అనుబంధం 

అందరికీ  ఆదర్శం


స్వర్ణ భారతం కోసం

 రేపటి కోసం 

కలలు కందాం

మన పిల్లల కోసం

మన జాతి కోసం

రేపటి కోసం 

కష్ట పడదాం

మన స్వప్నాలు

సాకారం చేసుకోవడం

కోసం 

ఉన్నత చదువుల కోసం 

ఉపాధి కోసం 

జాతి మెచ్చే 

క్రీడా పతకాల

కోసం 

ఆస్కార్ల కోసం 

నోబెల్ బహుమతుల కోసం

జాతి గర్వించే

నేతల కోసం

స్వర్ణ భారతం కోసం


క్రమశిక్షణ కోసం

 

ఆదాయం
తక్కువైనప్పుడు
నెలఖర్చు
రాసుకోవాల్సిందే

ఆదాయంలో కొంత భాగం
భవిష్యత్తు కోసం
దాచాలన్నా
నెలఖర్చు  రాయాల్సిందే

పిల్లల చదువుల కోసం
పెళ్ళిళ్ళ కోసం
అమ్మానాన్నల  ఆరోగ్యం
కోసం నెల ఖర్చు
రాయాల్సిందే
దుబారా ఖర్చు  తగ్గించడం
కోసం నెలఖర్చు  రాయాల్సిందే
నెలఖర్చు  రాయడం
క్రమశిక్షణ


Friday, 18 July 2025

ఆత్మ స్థైర్యమే ఆయుధం

 

హక్కుల కోసం
పోరాటాలు
ఉద్యోగులు తమ భద్రత
కోసం నిద్రలేని రాత్రులు
భార్యాభర్తలు ఇద్దరూ
ఉద్యోగాలు చేస్తున్నా
అనిశ్చిత పరిస్థితి 
ఉద్యోగాల కోసం
ర్యాంక్ ల కోసం
మానసిక అశాంతి
పెళ్ళిళ్ళు కుదరక
పెళ్లిళ్ళు కాక
అశాంతి
తమకి తోడు  లేక
వృద్ధుల అశాంతి
ప్రభుత్వం
సమాజం
కుటుంబం
ప్రశాంతతని తీసుకు రావల్సిందే

ఆత్మ స్థైర్యమే ఆయుధం 
భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి
నమ్మకం ప్రశాంతతని ఇస్తుంది


Thursday, 17 July 2025

వెలుగుల జీవితం

 

ఇతరుల జీవితాల్లో
వెలుగు నింపాలనుకున్నవారిదే
వెలుగుల జీవితం
మానవ సేవకి
అంకితమైన వారిదే
వెలుగుల జీవితం
మృత్యుముఖం  నుండి
వెలికితెచ్చే వైద్యులదే
వెలుగుల జీవితం
దేశసేవకి ప్రాణాలు
త్యాగం చేసే అమర జవాన్లది
వెలుగుల జీవితం
అనాధలకి
వృద్ధులకి
సాయం చేసేవారిది
వెలుగుల జీవితం


భయంకర నిజాలు

 

ముసుగు లేని నేను
నా ప్రేమ  కథ చెప్తా
నాలోని కోపాలు
ద్వేషాలు చెప్తా
కోరికలు
అత్యాశలు
దురాశలు
పేరాశలు చెప్తా
ఎదుటివాడి పతనం
గురించి ఆలోచిస్తే
నిస్సిగ్గుగా
బయట పెడతా
ముసుగు తొలగిస్తే
భయంకర నిజాలు
బయట పడతాయి


చిన్ని చిన్ని ఆశలు

 

మన కోరికలన్నీ
తీరాలన్న ఆశ
మన వారికి మంచి
జరగాలన్న ఆశ
పేదవారికి చిన్న చిన్న
ఆశలు
పసి మనసువి
చిన్ని చిన్ని ఆశలు
ప్రేమికులవి అందమైన
ఆశలు
ఆశకి అంతులేదు
ఆశ నెరవేరితే
అంతకు మించిన 
ఆనందం లేదు
ఆశ ఊపిరి
ఆగేవరకు


నవ్వు నవ్వించు

 

నవ్వు  వరం
నవ్వించడం కళ
నవ్వే అందం
నవ్వే ఆరోగ్యం
నవ్వే ఆకర్షణ
నవ్వించడం అందరినీ
ఆరోగ్యం గా ఉంచడం
అందరినీ నీ వాళ్ళని
చేసుకోవడం
నవ్వే ఆనందం
నవ్వించడం  పరమానందం


అర్ధనారీశ్వరమై

 నీలో సగమై

చెరి సగమై

రస జగమై

అర్ధ నారీశ్వరమై

పాలు తేనె

పూవు తావి

కష్ట సుఖాలలో

పాలు పంచుకుంటూ

తోడూ నీడై

నీ బలం నేనై

నా ధైర్యం  నువ్వై

జీవిత సంథ్యల వరకు

చెట్టాపట్టాలేసుకుని

కాల గమనం లో

కలిసిపోదాం

తక్షణ కర్తవ్యం

 ఒకప్పుడు గ్రామాలు

తక్కువ  జనాభాతో

నగరాలు పరిమిత

జనాభాతో

ఇప్పుడు  మహా నగరాలు 

విపరీతమైన రద్దీగా

గంటల  తరబడి 

ట్రాఫిక్లో

ప్రమాదాలు

దుర్మరణాలు

ట్రాఫిక్ని నియంత్రించడమే

కష్టమౌతోంది

షాపుల దగ్గర  రద్దీ 

హొటళ్ళలో రద్దీ 

బస్సులలో రద్దీ 

ప్రాణ రక్షణ  లేదు

భద్రత లేదు 

పిక్  పాకెట్ లు

ప్రశాంతత లేదు 

ఒకపక్క

గ్రామ  జనాభా 

పట్టణాలకి

రద్దీని నియంత్రించడమే

ప్రభుత్వాల

స్వచ్ఛంద సంస్థల

కర్తవ్యం


ధిక్కార స్వరం

 



శీర్షిక: ధిక్కారం ఎప్పుడూ సజీవమే


అరాచకానికి వ్యతిరేకంగా  

అక్రమాలకి వ్యతిరేకంగా  

దోపిడీకి  వ్యతిరేకంగా  

ధిక్కార స్వరం 


దళితులపై

స్త్రీలపై

నిరుపేదలపై

దౌర్జన్యాలకు వ్యతిరేకంగా  

ధిక్కార స్వరం 


అధికార దుర్వినియోగం 

అవినీతికి వ్యతిరేకంగా  

ధిక్కార స్వరం 

వినిపించే పత్రికలను

వ్యక్తులను

శక్తులను  భూస్థాపితం 

చేస్తారు 

ఐనా అవి తిరిగి 

బలంగా తమ ధిక్కారాన్ని

వినిపిస్తూనే ఉంటాయి 


ఇది నా స్వీయ కవిత 

డాక్టర్ గుమ్మా భవాని 

23.5.25

Thursday, 10 July 2025

జీవిత పోరాటం

 

పోరాటమే జీవితం
పొట్టకూటి కోసం పోరాటం
చదువు కోసం పోరాటం
ఆత్మాభిమానం కోసం
పోరాటం
అధికార్లతో పోరాటం
బిడ్డల జీవితం  కోసం
పోరాటం
మానం కోసం పోరాటం
ప్రాణం కోసం పోరాటం
మృత్యువుతో పోరాటం
అంతులేని  పోరాటాలే
జీవన పోరాటం


విషాదాంతం

 

నాకు కలల ప్రపంచం  మ్యాజిక్
చిన్న పిల్లలకి చిట్టి పొట్టి
కథలే మ్యాజిక్
నచ్చిన  అమ్మాయి
అబ్బాయికి మ్యాజిక్
షష్ఠి పూర్తి పెళ్లి కొడుక్కి 
తన అర్ధాంగి చిరునవ్వే
మ్యాజిక్
మృత్యువు మనకి
తెలియని విషాదాంత
మ్యాజిక్


నాక్కొంచెం స్వేచ్ఛ కావాలి

 

నాక్కొంచెం స్వేచ్ఛ కావాలి
చదువుకోడానికి
ఆటలాడటానికి
తలెత్తుకు నడవడానికీ
నా జీవిత భాగస్వామిని
ఎంచుకోవడానికి
మాతృత్వపు ఆనందాన్ని
పొందడానికి
హక్కుల కోసం జరిపే
పోరాటాలలో పాల్గొనే స్వేచ్ఛ
మహిళగా నేను కోరే
కొద్ది  స్వేచ్ఛ ఇంతే


Thursday, 3 July 2025

రాజకీయ ప్రక్షాళన కోసం

 శీర్షిక:  రాజకీయ ప్రక్షాళన కోసం. ..




నేను రాజకీయ పార్టీ 


జండా మోస్తున్న  మహిళని  ....




నమ్ముకున్న  రాజకీయపక్షం


మా ఆశలు వమ్ము చేయదని  .....




లక్షలాది పార్టీ అభిమానుల్లో


నమ్మకం కలిగిస్తుంటా. ..




పార్టీజండా మోసి నాయన 


భుజాలు కాయలు కాసేయి  




అయినా అలుపెరుగని


నడక  ఆయనది పార్టీ చరిత్రలో. ...




ఆయన నుండి నేర్చుకున్నా


ఆశయ సాధనలో...




వెనుకడుగు లేదని


మునుముందుకు సాగాలని...




ప్రజాస్వామ్యం గణతంత్రం


సామ్యవాదం పునాదులుగా 




కులమత వర్గ వివక్షత లేని


రాజ్యం దిశగా  




అంబేద్కర్ చేతిలోని రాజ్యాంగం 


మన దేశ భగవత్గీత 




చట్టసభలలో మహిళల 


 గొంతు మార్మోగేలా  .....


దళితులు తమ  తమ 


హక్కులు అనుభవించేలా .......


మా నాయకుల మీద 


తప్పక ఒత్తిడి తెస్తాం  ......


విద్యాధికులు చట్ట సభలకు


ఎన్నిక అయ్యేలా ......


ఎన్నికల ముందు వాగ్దానాలు 


అధికారం  చేపట్టేకా అమలుజరిపేలా .....


పార్టీ కార్యకర్తలం మేము 


ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తాం .......


మహిళల భద్రత కోసం 


చట్టాలు చేయమని  .....


గ్రామీణ భారత  వికాసం


నేతల లక్ష్యం  కావాలని ......


ఎన్నికలు ప్రజల విజయంగా


మార్పు ప్రగతికి ముందడుగుగా .....




స్వచ్ఛ రాజకీయాల కోసం 


నిరంతరం పోరాడుతున్న పార్టీకార్యకర్తని  


*        *         *         *     *       *


ఇది నా స్వీయ రచన.

నీ నవ్వు ఏ రాగమో

 తేది:15.5.25

శీర్షిక: నీ నవ్వు  ఏ రాగమో 


నీ నవ్వు  ఏ రాగమో

మనసుని  మురిపించే

మోహన రాగమో   

తొలిపొద్దు తొలిసంధ్యలలో

పూల తెమ్మెరగా వీచే

భూపాలమో 

అర్ధనారీశ్వర  తత్వాన్ని 

తలపింపచేసే

 శంకరాభరణమా 

మన కళ్యాణం ఎప్పుడెప్పుడా

అని ఎదురు చూస్తూ

నవ్వలొలకబోసే

కల్యాణి రాగమో

నన్ను  మురిపించే రాగం

మైమరిపించే రాగం 

వసంత రాగమో 

నవ‌వసంత రాగమో 


ఇది నా స్వీయ కవిత 

డాక్టర్ గుమ్మా భవాని

దుఃఖలిపి


తేది: 21.5.25 

శీర్షిక: దుఃఖ లిపి 


ఎన్ని  కోట్ల జీవితాలది

దుఃఖలిపి

ఎన్ని వేల ఆడజన్మలది

దుఃఖలిపి    

ఎన్ని లక్షల జీవితాలు 

దోపిడీకి  గురైతే

అది వేదనాభరిత చరిత. 

ఎందరు చిన్నారులు

అనాధలైతే అది

దుఃఖ లవకుశ గానం    


ఎందరు వృద్ధులు

ఇలలోనే నరకయాతన

అనుభవిస్తే

అది మనసువేదన


దుఃఖలిపిని చెరిపేస్తే

నాగరికత పరోగమనం


ఇది నా స్వీయ  కవిత 

డాక్టర్ గుమ్మా భవాని

Wednesday, 2 July 2025

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం

 

మసకబారిన చూపు
వృద్ధాప్యపు కష్టం

ఇష్టమైన వారిని
ప్రేమగా చూసుకోలేం
సొంత  ఇంట్లోనే
తడుముకుంటూ  నడవడం
ప్రకృతి అందాలు
చూడలేని దుస్థితి

చిన్ననాటి స్నేహితులను
ఆప్యాయంగా తడుముతాం
భార్యని కూడా ఆనందంగా
చూసుకోలేకపోతే
అదెంత కష్టం
ఇతరుల మీద
ఆధారపడే జీవితం


Tuesday, 1 July 2025

ఆనాటి ఆప్రేమ ఏమాయె

 

ప్రేమిస్తారు
మనసిచ్చి పుచ్చుకుంటారు
వివాహ బంధం లో
ఒక్కటవుతారు

మరికొద్ది రోజులలోనే
మాటామాటా  వచ్చి
విడిపోతారు
మరో మగువ మీద
మోజు పడితే
విడిపోతారు
మరో ప్రియునితో
కలిసి ఉండాలనుకుంటే
విడిపోతారు
సొంత బిడ్డల
భవితని గూర్చి
ఇద్దరూ ఆలోచించాలి


Monday, 30 June 2025

ప్రేమకి నిర్వచనం

 

నువ్వు  నేను
పూవు తావి
నువ్వు  నేను
ఒకరికి ఒకరం
నువ్వు నేను
తోడు నీడ
నువ్వు  నేను
పాలు తేనె
నువ్వు  నేను
వివాహ బంధం
మనిద్దరిదీ కలిసి
జీవన గమనం
మన బంధం
ప్రేమకి నిర్వచనం


నిరంతర జపం

 

ప్రేమించే  ప్రతివ్యక్తి
తన ప్రియురాలికై
జపం చేస్తూనే ఉంటాడు
ఆమె తన ప్రేమను
అంగీకరించాలని
తనతో   జీవితం
పంచుకోవాలని
తనను కూడా
అంతగానూ ప్రేమించాలని
ఆమెను ఎప్పుడెప్పుడు
కలుస్తానని  తహతహలాడుతూ
తన మనసులోని మాటలన్నీ
ఆమెకి  చెప్పుకోవాలని
నిరంతర ధ్యాస
నిరంతర జపం


Sunday, 29 June 2025

ఆసేతు హిమాచల

 

భరతమాత
ఎందరో జాతి రత్నాలను కన్న
బంగరుతల్లి
ఎన్ని  భాషలు
ఎన్ని  మతాలు
ఎన్ని సంస్కృతులు
శాంతియుత సహజీవనం
అందాల హిమాలయాలు
హిందూ మహాసముద్రం
అరేబియా సముద్రం
బంగాళాఖాతం
నోబుల్  గ్రహీతలు
అలీన విధానం
రైతన్నల భారతం
ఆసేతు హిమాచల
భారతం


ధృఢ నిశ్చయం

 

ప్రతీ మనిషిదీ
ఓ గమ్యం
వైద్యుడు కావాలని
శాస్త్రవేత్త కావాలని
ప్రజాసేవ  చేయాలని

గమ్యం ఏదైనా
ఎన్నుకున్న మార్గం
మంచిదై ఉండాలి
గమ్యం  చేరడం కోసం
ఎన్ని  ఒడుదుడుకులు
అయినా ఎదుర్కోవాలి
దృఢనిశ్చయం
ఏకాగ్రత తప్పనిసరి


ప్రేమలకి అర్ధం

 

లవ్ యూనే
అబ్బాయిలు అమ్మాయిలకు
చెప్పే మాట
లవ్ యూ రా
అమ్మాయిలు చనువుగా
అబ్బాయిలకి చెప్పే మాట

ఆ తర్వాత మొదలౌతుంది
అసలు కథ
ఇద్దరూ పరస్పరం
ఇష్టపడాలి
ఇద్దరి  ఇంట్లో 
పెద్దవాళ్ళు  ఇష్టపడాలి
పెద్దలు విలన్లుగా
మారకూడదు
రక్తపాతాలు జరగకూడదు
అన్యోన్య  దంపతులుగ
మారినప్పుడే
ప్రేమలకి అర్ధం


Thursday, 26 June 2025

ఇది కల‌ కాదు

 

మన కలయిక నిజమే
అనుకోకుండా కలసిన కలయిక

నువ్వు  ఎప్పుడూ పుస్తకాలు
నేను ఎప్పుడూ  ఆటలు

నా చుట్టూ  స్నేహితులు
నీ చిరునామా గ్రంధాలయం

నీ కోసమే  నేను
గ్రంధాలయానికి
వచ్చేదాన్ని
నీతో మాటామాటా
కలిపేదాన్ని

చూపులు కలిసాయి
నువ్వే నన్ను ఎక్కువ
ఇష్టపడ్డావు

మన కలయిక
కల కాకుండా
చెట్టాపట్టాలేసుకు
నడిచినంత నిజమయింది


Wednesday, 25 June 2025

ప్రియాతిప్రియం

 

శిల్పి బొమ్మలు చేస్తాడు
రంగులతో మెరిపిస్తాడు
అందాలు  చిందిస్తాడు
మనం అచ్చెరువొందుతాం

మెరిసే బొమ్మలు  కొన్ని
కలకాలం
కళకళలాడే బొమ్మలు
ప్రాణం పోసుకున్న బొమ్మలు

మెరిసే బొమ్మలకి
ప్రాణం పోసే శిల్పి
సాక్షాత్తూ  బ్రహ్మ

మెరిసే బొమ్మలు
పిల్లలకి ప్రియం
పెద్దలకి సంబరం


వనాలని సంరక్షించుకుందాం

 అంశం: సూర్యుడి పగ/ఈ ఎండు పాపం ఎవ్వరిది

తేది: 9.6.25

శీర్షిక  :వనాలని సంరక్షించుకుందాం


చెట్లు   కొట్టేస్తున్న మానవుడు

చల్లదనం

వర్షాలు 

లేకుండా   చేస్తున్నాడు

నీటి చక్రం గూర్చి 

పాఠ్య పుస్తకాలలోనే 

పచ్చదనం ఉంటేనే

చల్లదనం

నీటి మబ్బులు 


కారుమబ్బులు  లేకుంటే

సూర్యుడి ప్రతాపమే 

ప్రకృతిని నాశనం చేస్తున్న

ఆధునిక మానవుడి మీదే

సూర్యుడి  కసి


మనం వనాలని 

సంరక్షించుకుంటే

సూర్యుడు  చల్లబడతాడు



ఇది నా స్వీయ కవిత 

డాక్టర్ గుమ్మా భవాని


ఆశావాదం

 




శీర్షిక: ఆశావాదం


మన దారులన్నీ 

మూసుకుపోయినా

ఏదో ఒకదారి తెరిచేవుంటుంది

ఆ దారి ఏదో మనం

అన్వేషించాలి 

ధనం లేని రోజు

కష్టే ఫలే

చదువురాని రోజు

విద్యాదాతలుంటారు 

ఆరోగ్యం  పాడయితే  

మిత్రులు సాయం చేయకున్నా

సాయం చేసే ఆత్మబంధువులు

దొరుకుతారు

ఆశావాదం ఏదో ఒక

దారి చూపుతుంది

నిరాశావాదం అన్నిదారులు

మూసుకుపోయాయన్న

భావన కలిగిస్తుంది 


ఇది నా స్వీయ కవిత 

డాక్టర్ గుమ్మా భవాని


చదువు

 ఇది నా స్వీయ  రచన


చదువు 


సుశీల పది ఇళ్ళలో పని చేస్తూ కూతురు ఉమని పెంచుతుంటుంది. ఒకరోజు ఒక అబ్బాయి తన ఇంటి దగ్గర కూర్చుని ఉండటం చూసింది.

"ఏమ్మా, అలా కూర్చున్నావు" అని అడిగింది  సుశీల.

"నా  పేరు  శీను. రోజూ  ఏదో ఒక పని  చేసి ఎంతో కొంత సంపాదిస్తుంటాను. ఇవాళ  పనీ లేదు. ఏదీ తినడానికీ లేదు " అన్నాడు. 

సుశీల శీనుని లోపలకి రమ్మని తను వండిందే కొంత పెట్టింది. ఆ రోజు  నుండి  శీనుని  తమతోనే ఉండమంది.

శీను సుశీలని అమ్మ అని పిలిచేవాడు. ఉమని బాగా చదివించాలని ఎప్పుడూ  సుశీలతో అనేవాడు. శీను కోరుకున్నట్టే ఉమ బాగా చదువుకుంది. 

"శీనుతో నువ్వు కూడా  నా దగ్గర చదువు నేర్చుకోకపోతే నువ్వు చాలా మంది  దగ్గర  మోసపోతావు. నీకు కూడా ఇంకా  మంచి పనులు దొరుకుతాయి. నేను కూడా  ఇంక ఉద్యోగం  చేస్తాను. మనిద్దరం అమ్మని సుఖపెట్టాలి.

ఉమ లెక్చరర్ అయింది. సుశీల ఇప్పుడు ఓ లెక్చరర్ తల్లి.


మనసులు విశాలం కావాలి

 

ఇరుకు సందులు
ఇరుకు వీధులు

ఇరుకు హృదయాలు
జనాభా పెరిగిపోయి
ఇరుకు బస్సులు
వాహనాలు కదలలేని
పరిస్థితి 
విద్యాలయాల్లో
సీట్లులేని
ఇబ్బంది
చిన్న చిన్న  ఇళ్ళు 
గుడిసెలు
ఐనా ఆకాశం
విశాలమే
భూమాతా
విశాలమే
మన మనసులు
ఆలోచనలు
విశాలమైతే
అంతేచాలు


తెలియకుండానే

 

జీవిత ప్రయాణం
అమ్మతో మొదలైంది
నాన్నతో నడక
తోబుట్టువులతో
ఆటపాటలు
పలకాబలపం చదువు
గురువుల నీడన
విద్యార్జన
స్నేహబంధాలు
ప్రేమలు
పెళ్ళిళ్ళు
ఉద్యోగ యాతనలు
సంసార సాగరం
జీవిత ప్రయాణంలో
సహ ప్రయాణీకులెందరెందరో
మనకే తెలియకుండా
మన ప్రయాణం
ఆగిపోతుంది


Tuesday, 17 June 2025

మనమీద మనకి నమ్మకం

 

మనవారి పై
నమ్మకం
మంచి జరుగుతుందన్న
నమ్మకం
వివాహ బంధం మీద
నమ్మకం
ఆ దేవుడు
మనని చల్లగా
చూస్తాడని నమ్మకం
ప్రజాస్వామ్యం మీద
నమ్మకం
పాలకుల మీద  నమ్మకం
మన మీద మనకి నమ్మకం
అత్యవసరం


Monday, 16 June 2025

కార్తీక దీపోత్సవం

 కార్తీక పున్నమి 

దినోత్సవం 

కోటి దీపోత్సవం

నదిలో దీపాలు వదిలే

దీపోత్సవం

మగువలు సౌభాగ్యానికి

చేసే పూజ

కోవిళ్ళలో జరిగే

కోటి దీపోత్సవం 

ఆధ్యాత్మిక చింతన 

వెల్లువెత్తే వేళ


సఖీ నీ తోడుంటే

 కేవలం మనమే ఉందామా

సాగర తీరంలో

పచ్చని పొలాలలో

పచ్చిక మైదానాలలో

మన పొదరింటిలో

ఇసుక తిన్నెల మీద

ఆరుబయట

వెన్నెల  రాత్రులలో

సఖీ నీ తోడుంటే

కేవలం మనమే చాలు


ఇష్టం

 

నా స్వేచ్ఛ దూరమైతే అయిష్టం
ఆడవారిని తక్కువ  చేస్తే
నాకు నచ్చదు
పిల్లలకి చదువే సర్వవేళలా
ఆటలేదంటే అయిష్టం
జీతమిస్తున్నాము కదా
గడియారం చూడకుండా
పనిచేయమంటే
ఉద్యోగికి ఎంత కష్టం
తల్లి తండ్రుల మాటకి
విలువలేని చోట
కాలం గడపడం వారికి
ఎంతో అయిష్టం
అయిష్టాలు దూరమైన నాడే
ఇష్టంగా జీవించగలం


బాలవాక్కు బ్రహ్మవాక్కు

 పిల్లలే  దేవుళ్ళు 

ఆ నవ్వులో స్వచ్ఛత

మాటలో నిర్మలత్వం 

వారి ప్రేమలో

ఆప్యాయత

అభిమానం


బాలవాక్కు

బ్రహ్మ వాక్కంటారు

పెద్దలు 

మన దుఃఖాన్ని

చిరునవ్వుగా

మార్చేది వారే

మన మదిలో దిగులు 

పోగొట్టేది వారే

దేవుడు మన కోసం

కానుకగా పంపుతాడు

పిల్లలని


చిట్టి పాపాయి

 

ఓ చిట్టి పాపాయి
నీవెవరివే
నిద్రలో  నేనమ్మ  విరిజాజినే
నిద్రలో నేనమ్మ సిరిమల్లెనే
గులాబీ రేకుపై మురిసే
మంచు ముత్యాన్నే
నిద్రలో నేనమ్మ
బంగారు బొమ్మనే
అందాల కొమ్మనే


జీవితం రైలుబండి

 జీవితమే

ఓ ప్రయాణం 

భూమి తిరుగుతూ 

మనమూ

భూమితో పాటు

తిరుగుతూ 


అమ్మ నాన్న 

చేయి పట్టుకుని 

కొన్నాళ్ళు 

నడుస్తాం

చదువులమ్మ

చేయి పట్టుకుని 

మరి కొన్నాళ్ళు 


తోటి  ఉద్యోగులతో

ఎన్నో   ఏళ్ళు 

ఆలుమగలుగా

జీవితాంతం

కన్నబిడ్డలతో

ప్రయాణం 

వారికి రెక్కలొచ్చేదాకా

జీవితం రైలుబండి 

మనకి తెలియకుండా 

దిగిపోతాం


అవరోహణం

 

కొండ ఎక్కడం
మొదలుపెట్టా
అమ్మ పొత్తిళ్ళలో
మరి కొంచెం  ఎక్కా
నాన్న   చేయిపట్టుకొని
ఇంకొంచెం ఆచార్యుల
సాయంతో
వివాహ బంధంతో
మరి కొంచెం 

శ్వాస ఆగి
ఎవరెస్ట్ శిఖరం
నుంచి లోయల్లోకి


శిలలపై శిల్పాలు

 

శిలకి ప్రాణమొస్తే
శిల్పమౌతుంది
అందాల సుందరి
అవుతుంది
ప్రపంచ వింతవుతుంది
హంపీ
అజంతా శిల్పాలవుతాయి
కోణార్క
రధ చక్రమౌతుంది
విదేశీ యాత్రికులు
సైతం
అచ్చెరు వొందుతారు
శిల్పాలని
తరచి చూడాలంటే
ఎంతైనా సమయం
కేటాయించాలి
కనిపించని
శిల్పులకు
అభినందనలు
కృతజ్ఞతలు


Saturday, 14 June 2025

ఎదురుచూపు

 

పెళ్ళయిన మూడో రోజే
అత్యవసరమని
దేశ సరిహద్దుల వరకు
వెళ్ళిపోయావు

అప్పుడు  మొదలయ్యాయి
నాఎదురుచూపులు
ఉత్తరమయినా
వస్తుందని
నేను ఎదురు చూస్తుండగానే
చిరునవ్వుతో
నువ్వు ఇంటికి వస్తావని

నీ పాపాయి
నా కడుపులో
ఉందన్న విషయం
నీకెంత ఆనందమో

మీ అమ్మ నాన్న  కూడా
నీకోసం ఎదురు చూపులు

ఆ మూడు రోజులలోనే
నువ్వు  నాకు  చాలా
మానసిక ధైర్యం ఇచ్చేవు

ఒక వీరుడు చిరునవ్వుతో
తన వారిని చేరుకుంటాడు
లేకుంటే దేశసేవలో
అమరుడౌతాడు

అమరుడెప్పుడూ
మన గుండెల్లో


ప్రేమ పారిజాతాలు

 

తేది: 16.5.25
శీర్షిక: ప్రేమ పారిజాతాలు

తలపుల వాకిలిలో
ఎన్నెన్ని  వసంతాలో
భీభత్స  తుఫానులో
ప్రేమ పారిజాతాలు

కన్నవారితో అనుబంధాల మాలిక
కన్నబిడ్డల పట్ల  ప్రేమానురాగాల
పాశం 

నా తలపుల వాకిలిలో
కవితల సందడి
కథల్లో  పాత్రల  హడావుడి
స్నేహబంధాల మధురిమలు
రక్త బంధాల అన్యోన్నతలు
నా తలపులవాకిలిలో
మధుర స్మృతులు
బంగరు భవిత గూర్చి
తియతియ్యని కలలు
స్వప్నం  సాకారమయ్యే
తలపులు

ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని


అమృత ధార

 

వేసవిలో  అమృత
చినుకులు
ఎడారిలో
అమృత చినుకులు
బీడు నేలకి
అమృత చినుకులు
రైతన్న
పంట పొలానికి
అమృత చినుకులు
చిటపట  చినుకులు
అమృత చినుకులే
జలకళని తీసుకువచ్చేది
అమృత చినుకులే
చిన్నారులు  కేరింతలు
కొట్టేది  అమృత చినుకులకే


Saturday, 24 May 2025

సప్తవర్ణం

 

నా ప్రేమ సప్తవర్ణం
నా ప్రేమ ఇంద్ర ధనుస్సు

ఎర్ర గులాబీల ప్రేమ 
హృదయాన్ని తాకుతుంది

తెల్లమల్లెల ప్రేమ
పరిమళాలు  నింపుతుంది

ఆకుపచ్ఛ రంగు
నిత్యహరితంగా
మా ప్రేమని నిలుపుతుంది

పసుపురంగు అంతా
శుభమే అని భుజం
తడుతుంది

ప్రేమలో శాంతి అవసరం
తెల్లజెండానే ఎగరేద్దాం
శాంతి సూచకంగా


Monday, 19 May 2025

అనుబంధాలు

 

ఈ కధ నా స్వీయ సృజన.
శీర్షిక: అనుబంధాలు
 

""చూడు రాధా... వాసు నీకొక్కదానికే కాదు... నాకూ కొడుకే. వాడి జీవితం ఎలా ఉండాలి అనే దానిమీద నాకు స్పష్టమైన ఆలోచన, అవగాహన ఉన్నాయి. రమ్య..నీ అన్న కూతురు అనే ఒక్క అంశం తప్ప ఎందులో వాసు గాడికి సరిపోతుంది చెప్పు? నీ మాట కాదన్నానని నన్ను తప్పుగా అనుకోకు. నాకు వాసు భవిష్యత్తు ఎంత ముఖ్యమో, నువ్వు.. నీ మనోభావాలు అంటే అంత గౌరవం. ప్రశాంతంగా కూర్చుని, ఆలోచించి నీ మాట ఏమిటో చెప్పు నీ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుంది." అన్నాడు భార్గవ.

భర్త మాటలకు చిరాగ్గా తలతిప్పుకోబోయి గుమ్మం దగ్గర ఏదో అలికిడి అవడం తో అటు తిరిగి చూసింది ప్రొఫెసర్ రాధాదేవి. అక్కడ కనిపించిన దృశ్యానికి చేష్టలుడిగి పోయి సర్పద్రష్టలా నిలబడిపోయిందామె.

అది గమనించిన భార్గవ, అవాక్కయి, ఆపై గుండెలో సన్నగా మెలి తిరుగుతూ నొప్పి రాగా "రాధా..." అంటూ నేలకొరిగిపోయాడు.
గుమ్మం దగ్గర  రాధ  చూసినది తన అన్న  కల్యాణ్ ని. కల్యాణ్ భార్గవకి ఆప్తమిత్రుడు  కూడా.తమ మాటలు కల్యాణ్ విన్నాడేమో అన్న ఊహ అతని గుండె  నొప్పికి  దారి తీసింది.
రాధాదేవి వెంటనే తన  స్నేహితురాలు డాక్టర్  శశిప్రభకి ఫోన్ ‌చేసింది. ఆమె గుండె చికిత్స  నిపుణురాలు.
రాధాదేవి తనకి తన భర్తకి జరిగిన సంభాషణ తన స్నేహితురాలికి తెలిపింది. డాక్టర్ శశిప్రభ వెంటనే “రాధా నువ్వు ప్రొఫెసర్ వి అయిఉండి కూడా నీ మేనకోడలు మీద అభిమానంతో కోడలుని చేసుకుందామనుకుoటున్నావు. నిజానికి వాసుకి కూడా దగ్గర సంబంధం చేసుకోవడం ఇష్టం  లేదట. మరో విషయం – నా కొడుకు శశాంక్ మీ రమ్య వెనక పడుతున్నాడన్న విషయం కూడా వాసుకి తెలుసట. మీ అన్నయ్య కళ్యాణ్ నీకే కాదు నాకు కూడా అన్నయ్యే. మా అబ్బాయిని అల్లుడిగా చేసుకోవడానికి అభ్యంతరం చెప్పడులే."
రమ్య శశాంక్ ల పెళ్లి అయ్యాకే వాసు తన పెళ్లి చేసుకుందామనుకున్నాడు. వాసు, రాధాదేవి,  కళ్యాణ్  పెళ్లి పనులలో మునిగిపోయారు. రమ్య పెళ్లి నిరాడంబరoగానే జరగాలనుకుంది.
ఈలోగా, భార్గవ వాసుకోసం చదువుకున్న అమ్మాయి, ఉద్యోగస్తురాలు, అందగత్తె అయిన వైదేహి ని చూసాడు. వాసు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళ పెళ్లి ఘనంగానే జరగాలని వైదేహి కోరింది.
వైదేహికి తన అందాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం, తనకి కావలసినవి తెప్పించుకొని తినడం, తన ఆఫీసు పని చూసుకోవడంలాంటివి మాత్రమే ఆమె దినచర్య. ఎవరి మాట వినకపోవడం, తనకి తోచింది మాత్రమే చెయ్యడం ఆమె అలవాటు.
కొద్ది రోజుల్లోనే రమ్య పండంటి పాపాయిని కంది. ఆ పాపకి మనోజ్ఞ  అని పేరు పెట్టారు. డెలివరీ సమయంలో రమ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు వాసు, రాధాదేవిగారు ఆసుపత్రికి వెళ్లి వచ్చేవారు. తరువాత రమ్య అత్తవారింటికి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా రాధాదేవిగారు, వాసు, రమ్య వాళ్ళ ఇంటికి వెళ్లి మనోజ్ఞని చూసేవారు .
వాసుకి పిల్లలంటే చాల ఇష్టం. పాపని పుట్టినప్పటినుండి చూడడం, రోజూ వెళ్లి పాపతో ఆడుకోవడం వల్ల మనోజ్ఞ అంటే  వాసుకి ఎంతో మమకారం. వైదేహికి ఇది నచ్చేది కాదు.
వైదేహి కి అసలు పిల్లలని కనాలనే ఉద్దేశ్యమే లేదు. తన అక్క కూతుర్ని చిన్నప్పటినుండి చూసి చికాకు పడేది . ఆ పాప ఒక్క నిముషం కూడా వాళ్ళ అమ్మని వదిలేది కాదు. అలాగే తన స్నేహితుల పిల్లలని చూసి విసుక్కొనేది. పిల్లల్ని కనడం, పెంచడం అంటే తలనొప్పి, టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు అనుకొనేది. పైపెచ్చు పిల్లల్ని కనడం, పెంచడం వల్ల శారీరిక అందం తగ్గుతుందనే భావన దృడంగా ఉండడం వల్ల పిల్లల్ని కనకూడదు అనుకుంది.
వైదేహికి ఇష్టం లేకుండా పిల్లల్ని కనాలని వాసు కానీ ,రాధాదేవి కానీ ఆమెకు చెప్పే సాహసం చెయ్యలేదు. ఈ విషయంలో, వైదేహి కన్నతల్లి మాట కూడా వినట్లేదనే సంగతి వాళ్ళిద్దరికీ తెలుసు. అందుకే పిల్లలంటే ఎంత ఇష్టం ఉన్నా వాసు బాధ పడడం తప్ప ఇంకేం చెయ్యలేకపోయేడు.
ఈ నేపధ్యంలోనే  వాసు మనోజ్ఞకి  దగ్గర అయ్యేడు. మనోజ్ఞకి  కూడా వాసు దగ్గర బాగా అలవాటైపోయింది. రమ్య వాళ్ళ అత్తగారి హాస్పిటల్ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేషన్ చూసుకొనేది . దానికి సంబంధించి  కొన్ని కోర్సులు కూడా చేసింది. శశాంక్ కూడా డాక్టర్ అవ్వడంతో, మనోజ్ఞకి నాయనమ్మ , అమ్మ, నాన్నలు బిజీగా ఉండేవారు .
వాసు మనోజ్ఞని  పార్కులకి తీసుకొని వెళ్ళడం, వ్యాయామం చేయించడం, ఆటలు ఆడించడం అన్నీ చేసేవాడు . వాసుతో బయటికి వెళ్తే మనోజ్ఞ  పుస్తకాలూ, ఆటబొమ్మలు కొనుక్కొనేది.
మనోజ్ఞ  ప్లే స్కూల్ ,తరువాత ఆమె చదువుకున్న బడి అన్ని వాసు ఎంపిక చేసి శశాంక్ ,రమ్యలకి చెప్పేవాడు. ఈ రకంగా మనోజ్ఞ  స్కూలింగ్ అంతా వాసు కనుసన్నలలోనే జరింగింది.
వాసు దగ్గర చాల పుస్తకాలుండేవి. ఆ పుస్తకాలు చదవడం మనోజ్ఞకి  అలవాటైంది. కాలేజీలో చేరేముందే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతానని వాసుకి మనోజ్ఞ  చెప్పింది. వాసు ఆ విషయం మనోజ్ఞ  తల్లి తండ్రులకి తెలియజేసి దానికి కావలిసిన ఏర్పాట్లన్నీ చేసేడు. మంచి శిక్షణ ఇప్పించడంతో,మనోజ్ఞ సివిల్స్‌లో మొదటిసారే విజయం  సాధించింది.
మొదటిసారి పోస్టింగ్ కి వెళ్తున్నప్పుడు మనోజ్ఞ వాసుతో "చిన్నాన్నా,మీరు వచ్చి కొద్ది రోజులు అక్కడ  ఉండాలి, నాకు అలవాటయ్యేవరకు" అని చెప్పింది.

మనోజ్ఞ వెళ్ళిపోయాక వాసుకి ఏం తోచేది కాదు. మనోజ్ఞ ఫోన్   కోసం, వీడియో కాల్ కోసం  ఎదురు చూస్తుండేవాడు .
వాసు కొత్తగా ఒక స్టార్ట్ అప్ మొదలెట్టి తనకి బాగా తెలిసిన స్నేహితులనే అందులో చేర్చుకున్నాడు.
కొన్నాళ్ళకి మనోజ్ఞకి అక్కడే పోస్టింగ్ వచ్చింది.అందరూ చాలా సంతోషించారు. మనోజ్ఞ తను ఇష్టపడిన పోలీస్ ఆఫీసర్ అభిరామ్ ని  పెళ్ళి చేసుకుంటానని చెప్పింది.
మనోజ్ఞ చిన్నప్పుడు ,రమ్య  మనోజ్ఞ పుట్టినరోజున అనాధ శరణాలయానికి తీసుకెళ్ళి అక్కడ పళ్ళు, పుస్తకాలు, బొమ్మలు మనోజ్ఞతో ఇప్పించేది. అమ్మకి నిరాడంబరమే నచ్చుతుందనిమనోజ్ఞ తన పెళ్ళి కూడా నిరాడంబరంగా చేసుకుంది.

పెళ్ళయిన‌ తర్వాత ఒకరోజు   "మనోజ్ఞా,నువ్వు, అభిరామ్ చర్చించుకొని నాకు  మూడేళ్ళలో ఒక అబ్బాయిని ఇవ్వాలి. అబ్బాయిని పెంచడం కూడా  నేను నేర్చుకోవాలి కదా" అన్నాడు వాసు".
మనోజ్ఞ గురుదక్షిణలానే మూడేళ్ళలో పండంటి బాబుని  కంది. ఇక అప్పటినుంచి వాసుకి వాడితోనే ఆటలు.బాబు పేరు సాగర్. మహా పెంకివాడు. వాసుని బాగా పరుగులు తీయించేవాడు.
సాగర్ కి  తల్లి  కలెక్టర్, తండ్రి పోలీస్ ఆఫీసర్ అయి బిజీ  అయిపోవడంతో ఆడుకోవడానికి
వాసు తాత దొరికాడు. వాడికి వాళ్ళ నాన్న  పోలీస్ డ్రస్, క్యాప్ అన్నీ నచ్చేవి.
సాగర్ వాసు దగ్గర  గణితం, ఇంగ్లీషు, కంప్యూటర్ కోర్సులు  నేర్చుకునేవాడు. "తాతా  నీ కంపెనీని ఇంకా పెద్ద కంపెనీగా చేస్తాను" అనేవాడు  సాగర్.
వాసు" ఈ కంపెనీలు చాలా ఉంటాయి కానీ మంచి  పోలీస్ ఆఫీసర్ లు మనకి కావాలి" అనేవాడు సాగర్ తో.
డాక్టర్  శశిప్రభ సేవలు,డాక్టర్ శశాంక్  పేరు ప్రఖ్యాతులు, రమ్య ఆసుపత్రిలో సేవల మెరుగుదలకి తీసుకునే జాగ్రత్తలు  వాళ్ల ఆసుపత్రికి మంచిపేరు తెచ్చింది.
రమ్య తండ్రి కల్యాణ్ అనారోగ్యంతో రమ్య  కొన్నాళ్ళు పూర్తిగా అతనినే చూసుకోవలసి వచ్చింది. ఆసుపత్రిలో చేర్చిన కొద్ది రోజులకే ఆయన  కాలం   చేసారు.
వైదేహి ఆఫీసులో  పని చేస్తున్న ఆమె సీనియర్  సుజాత వాసు దగ్గరికి వచ్చి "నేను మీకంపెనీలోచేరదామనుకుంటున్నా. మావారు నేను ఇద్దరం ఒకే చోట పని చేస్తే మా పిల్లల చదువు మీద శ్రద్ద పెట్టగలం”అన్నారు .
అక్కడే ఉన్న వైదేహి ఆశ్చర్యపోయింది అంత సీనియర్ పొజిషన్ వదిలి తన భర్త దగ్గర పనిచేయడానికి వచ్చేస్తున్నాదా అని.
సుజాత వెళ్తూ వైదేహితో “మీరు చాలా అదృష్టవంతులు. మావారు ఎప్పుడూ  మీవారిగురించి చెప్తుంటారు ”అంది.
ఒక రోజు సాగర్ వాసుతో “తాతా,కొత్త కారు కొను. ఈ పాత కారు నువ్వు ఇంక నడపకూడదు “అన్నాడు. వాసుకి అది సమంజసమే అనిపించి కొత్త కారు తీసుకున్నాడు . అందుకు  వైదేహి “ నాకో కొత్త కారు కొనిద్దామని మీకెప్పుడూ అనిపించలేదు. ఇవాళ సాగర్ అన్నాడని కొత్త కారు కొనేసారు”అంది , కయ్యానికి కాలు దువ్వుతూ. వాసుకి ఇలాటివన్నీ అలవాటైపోయి నిశ్శబ్దంగా అక్కడినుండి వెళ్ళిపోయాడు .
కొన్నాళ్ళకే  వైదేహికి కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. శశిప్రభ ఆసుపత్రిలో చేర్పిస్తే వాసు,రమ్య అందరూ అక్కడే ఉండేవారు.ఆసుపత్రి సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా, మర్యాదగా వైదేహిని  చూసుకునే వారు. వాళ్ళందరికీ  వాసు తెలుసు.తను వాసు భార్య  కాబట్టే ఈ  మర్యాద అని వైదేహి  అంతరంగానికి తెలుసు.
‌వైదేహికి ఎంత వైద్యం చేసినా తన ఆరోగ్యం పూర్తిగా  నయం కాలేదు. మునుపటి అందం లేదు.వాసు దగ్గరుండి ఆమె అవసరాలు చూసుకునేవాడు. "నువ్విప్ఫుడు  నా పాపాయివే " అనేవాడు వాసు వైదేహితో.
వైదేహిని చూసుకోడానికి ఒక అటెండెంట్ ని ,ఆమెకి కావలసినవన్నీ చేసిపెట్టడానికి ఒక కుక్ ని కూడా వాసు ఏర్పాటు చేశాడు.
వైదేహి ఆఫీసు పని ఇప్పుడు చేయలేక పోతోంది.తన స్నేహితురాళ్ళు కూడా కనీసం ఫోను చేయడం లేదు.రమ్య, అభిరామ్ అప్పుడప్పుడు వచ్చి వైదేహిని చూసి  వెళ్ళేవారు. వాళ్లిద్దరికీ ప్రతిసారీ వాసుకి పాదాభివందనం  చేయడమే అలవాటు.
వైదేహిని చూడడానికి ఆమె అక్కలు , అమ్మ, నాన్న అందరూ వచ్చేవారు . కానీ వైదేహికి ఏది సంతోషంగా అనిపించేది కాదు. రాధాదేవిగారు, వాసు వాళ్ళకి సకల మర్యాదలు చేసేవారు.
వైదేహి గదిలో మంచి పుస్తకాలు, ఆడియో కధలు , మంచి సంగీతం అన్ని తెచ్చి పెట్టేవాడు వాసు.
భార్య అందంగా ఉన్నప్పుడు ప్రేమించడం సర్వ సాధారణం . భార్య మంచం పట్టి అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే ఆమెని ప్రేమించేవాడే అసలైన ప్రేమికుడు.
సాగర్ అభిరాం ప్రభావంలోకే వెళ్ళాడు. వాసు తాత కూడా పోలీస్ ఆఫీసర్ కమ్మని ప్రోత్సహించేడు . తను తప్పనిసరిగా పోలీస్ ఆఫీసరై అందరి మన్ననలు పొందాలన్నదే సాగర్ లక్ష్యం .
ఒక రోజు వైదేహి వాసుతో “ నన్ను మీ కంపెనీలో  చేర్చుకోండి. నేను ఇలా ఒక్కదాన్ని ఏ పని లేకుండా ఉండలేకపోతున్నా. టైం గడవడం చాల కష్టంగా  ఉంది. నేను మీ అందరిలాగా ఎక్కువ నైపుణ్యంతో పని చేయలేకపోవచ్చు. కానీ మీ అందరిని చూసి నేర్చుకోగలను. కొన్నాళకి మీ అందరిలాగే పని చేయగలననే నమ్మకం నాకు ఉంది. ఐనా , మా సీనియర్ సుజాతకి మీరు అవకాశం ఇచ్చి నాకు ఇవ్వలేరా” అంది.
ఆమెలో వస్తున్న మార్పులు చూస్తూంటే వాసుకి చాల ఆనందం,  ఆశ్చర్యం కలిగాయి. "తప్పకుండా  వైదేహీ,  నువ్వు  కంపెనీ పనులేంటో చూస్తుండు,నీకే అర్ధమైపోతుంది. అసలు,ఈ కంపెనీ నీదే" అన్నాడు వాసు.
సాగర్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. వాసు తాతని తానున్న చోటుకి రమ్మని సతాయిస్తుంటాడు. వాసుకి కూడా సాగర్ ని పోలీస్ ఆఫీసర్ హోదాలో చూడాలని సరదా.మనోజ్ఞ , సాగర్  తను నాటిన  విద్యా విత్తులు.తనకెంత ఆనందంగా..,ఆత్మసంతృప్తి గానో ఉంటుంది.
వాసు ఆ కుటుంబాలకి కేంద్ర బిందువు లాంటి వాడు  రమ్యకి, శశాంక్ కి ,డా. శశిప్రభకి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉన్నాడు. మనోజ్ఞ  నైతే తనే పెంచాడు .
భార్గవ, రాధాదేవి ఎంత అన్యోన్య దంపతులో వాసుకి తెలుసు. తన తండ్రి తన తల్లి మనోభావాలకి విలువిస్తాడని తెలిసే తనకే రమ్య తో వివాహం ఇష్టం లేదని చెప్పేసాడు. మేనమామ బిడ్డ దగ్గరి సంబంధం  ఎందుకు చేసుకోవడం అని తాను వద్దన్నాడు తప్ప రమ్యని కాదనడానికి మరో కారణం లేదు. అందుకే శశాంక్ ఇష్టపడితే వాళ్లిదరి వివాహాన్ని ప్రోత్సహించేడు.
వైదేహిని    చూడటానికి మనిషిని పెట్టినా ఆమె కట్టుకోవాల్సిన బట్టలు  వాసు తీసి ఉంచేవాడు. వేసవిలో  మనసుకి  హాయి నిచ్చే మల్లె పూచెండులు, సన్నజాజులు,విరజాజులు అన్నీ ఉంచడం వాసుకి సరదా. వైదేహిని    పెళ్ళయిన‌ కొత్తలో  ఎలా చూడాలనుకునేవాడో వాసు ఇప్పుడు అలా చూస్తున్నాడు.

వాసు ఒకరోజు   వైదేహితో "మన ఇంటికి దగ్గరగా  ఒక ఇల్లు అమ్ముతున్నారు. మనం ఆ ఇల్లు  కొని మీ అమ్మ, నాన్నగారిని అక్కడ ఉండమందాం.వాళ్లు  పెద్దయిపోయారు కదా. .మనమే వాళ్లని చూసుకోవాలి" అన్నాడు.
తన తల్లితండ్రులకి,అత్తమామలకి తేడా  చూపించని అల్లుళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారేమో ఈ దేశంలో అనుకుంది వైదేహి. ఆ ఇల్లు  కొనడానికి అంగీకరించింది వైదేహి.
రాధాదేవి,భార్గవ    ఇప్పుడు  కొడుకు, కోడలుతోనే ఉంటున్నారు. కారు ప్రమాదం తరవాత కోడలిలో వచ్చిన  మార్పులు గమనిస్తున్నారు.
ఇప్పటికీ రమ్య  అప్పుడప్పుడు  తన మేనత్త  ఇంటికి  వస్తుంటుంది. త్వరలో  మరో స్పెషలిస్ట్  తమ ఆసుపత్రికి వస్తారని ,అతనికి వైదేహిని  చూపిద్దామని అంది.
వైదేహికి తాను జీవితం లో తీసుకున్న తప్పుడు నిర్ణయం అర్ధమైంది.వాసుకి పిల్లలంటే ఎంత  ఇష్టమో తెలిసి కూడా తను పిల్లలు  అసలు అక్కరలేదనుకుంది. వాసు మనోజ్ఞ ని,మనోజ్ఞ కొడుకు సాగర్ ని పెంచాడు. ముత్యాల్లా తీర్చి  దిద్దాడు. వజ్రాల్లా తయారు చేసేడు.వాసుకి తన సొంత  పిల్లలుంటే ఇంకా ఎంత అపురూపంగా చూసుకొనే వాడో.

వాసు మాత్రం  ఎప్పుడూ అలా అనుకోలేదు.
మాతృత్వం  స్త్రీకి ఒక  ఎంపికగా ఉండాలి. తనకి పిల్లలంటే చాలా ఇష్టమని తన భార్య మీద  ఆ బరువు  మోపకూడదు.
రమ్య తీరిక   లేకుండా ఉంటే మనోజ్ఞ ఓ తోడు కోసం తపించిపోయేది.  సాగర్ తల్లితండ్రులు బిజీగా ఉంటే  వెతుక్కుంటూ  తన దగ్గరకే  వచ్చేవాడు.
ఈ దేశంలో అలాటి పిల్లలు  కోకొల్లలు. తన స్వంత పిల్లలే కానక్కరలేదు.
వైదేహికి అతని భావాలు అర్థమయ్యాయి. వాసు కంపెనీ బాగా పెద్ద కంపెనీ అయింది. వైదేహి ఆరోగ్యం
ఇప్పుడు బాగా కుదుటపడింది.

వైదేహి తల్లి తండ్రులు కొద్ది  నెలల తేడాలో స్వర్గస్తులయ్యారు
రమ్య  తన భర్త  శశాంక్ తో,అత్తగారు శశిప్రభ గారితో మాటాడి  మురికి వాడలలో, చుట్టు పక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలలో  ఉచిత వైద్య  తనిఖీలు చేయిద్దామంది. వారిద్దరూ దానికి అంగీకరించారు.
వాసు కంపెనీ   కూడా  సాయంత్రం పూట కాలేజీలలో ఉచితంగా కంప్యూటర్ కోర్సులు  నేర్పించడం మొదలెట్టారు. ఉత్తమ  ప్రతిభ చూపిన వారిని వారి డిగ్రీ  చదువు అయిపోయాక తమ కంపెనీలోనే కావాలంటే చేరవచ్చని చెప్పేరు.

ప్రొఫెసర్ రాధాదేవి ఎందరో విద్యార్థులను తీర్చి దిద్దేక ఇప్పుడు  ఆవిడ గొంతుక మొరాయించింది. అందరి కంటే  బెంగపెట్టుకున్నది ఆవిడ భర్త  భార్గవ. ఇద్దరూ  ఆదర్శ  దంపతులు . డాక్టర్ శశిప్రభ తన ఆసుపత్రిలో అన్నిపరీక్షలూ చేయించారు. కానీ ఆమె ఇంతకు మునుపులా మాట్లాడలేకపోతున్నారు. సరిగ్గా   భోజనం చేయలేకపోతున్నారు.
రమ్యకి మేనత్తంటే ప్రాణం. తల్లిలా తనని పెంచింది. కూతురి లాగే జీవితమంతా చూసుకుంది. ఆవిడ ఒక ప్రొఫెసర్ అని తనకి ఆనందం, గర్వం. తనకి ఎన్నో  నేర్పించేది. అలాటి మేనత్త నోరు  తెరవకుండా, మాట్లాడకుండా, సరిగా భోజనం కూడా  చేయలేకుండా పడుక్కుంటే రమ్యకి దుఃఖం వచ్చేసేది.
వాసు రమ్యకి  ధైర్యం చెప్పేవాడు. "పెద్దవాళ్ళకి ఏవో సమస్యలు తప్పవు. మీ అత్తగారు మంచి  డాక్టర్, ఆవిడ స్నేహితురాలు. అంత సులువుగా ఏమీ చేయలేమని వదిలేయరు. ఆవిడ మీద నమ్మకముంచు. నేను నమ్ముతున్నాను" అనేవాడు.
భార్గవ రాధాదేవికి చాలా  సేవలు  చేసేవారు. ఆవిడకి ఆడియో  కథలు,పాటలు  వినిపించడం,ఆవిడ గది శుభ్రంగా ఉంచడం,ఆవిడ  తినగలిగినవి తినిపించడం. "జీవితమంతా నువ్వే నాకు చేసావు. ఇప్పుడైనా నేను చేయనీ. సరస్వతి  నడయాడిన నాలుకకి ఇప్పుడు  ఇన్ని  బాధలా" అని ఎంతో బాధపడేవాడు.
సాగర్ కి ఇక పెళ్లి  సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు మనోజ్ఞ , అభిరామ్.
అకస్మాత్తుగా సాగర్  వీర మరణ వార్త.  దుండగులు  మాటు వేసి పోలీసులని చంపేసారట.."ఇది యుద్ధం .యుద్ధంలో ఇరు పక్షాలు నష్టపోతారు" అని అక్కడ  కరపత్రాలు.
సాగర్  తన కంపెనీలో పని చేస్తానంటే నిజాయితీ  పరుడైన పోలీస్ ఆఫీసర్ అవమని తను సలహా  యిచ్చి తనే తప్పు చేసానేమో అని వాసుకి అనిపించింది.

మనోజ్ఞ, అభిరామ్ మొహం లో నెత్తుటి చుక్క లేకుండా  చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో సాగర్  అంతిమ యాత్ర సాగింది. సాగర్ వీరత్వానికి బిరుదు ప్రదానం కూడా  కేంద్ర ప్రభుత్వం త్వరలో చేస్తుంది.
సాగర్  మరణం వాసుకి తట్టుకోలేని ఆవేదన. వాడితో గడిపిన క్షణాలు గుర్తొస్తునే ఉన్నాయి. మనోజ్ఞ  మొహం ఇక తను చూడలేడు. కన్న బిడ్డని కోల్పోయిన  వీరమాత. రెండు కుటుంబాలకీ తీరని గాయం.
రమ్యకి అటు కూతుర్ని  ఓదార్చాలో, ఇటు మనవడి అకాల‌ మృత్యువుకి  బాధపడాలో తెలియని విషాద క్షణాలు. మనోజ్ఞ  వాళ్ళ అమ్మని కొన్నాళ్ళు వచ్చి  తనతో  ఉండమంది."ఎంత పనిలో ఉన్నా ఈ దుఃఖం  నేను  తట్టుకోలేక పోతున్నానమ్మా" అంటుంది. వాసుకి ఫోన్ చేసి కూడా చాలా బాధపడుతుంది.
రాధాదేవికి కూడా  మనోజ్ఞ  చిన్నప్పుడు మనోజ్ఞ తో, తర్వాత  సాగర్ తో అనుబంధం. రమ్య కి, మనోజ్ఞకి వచ్చిన తీవ్ర కష్టానికి ఆవిడ కూడా  ఎంతో బాధ పడింది.

ఆవిడ అనారోగ్యం  గురించి  అందరూ బాధ పడుతుంటే ఉరమని పిడుగులా సాగర్ అకాల మరణం.
వాసు ఈ విషాదాన్ని తట్టుకోలేక చాలా కృంగిపోయాడు. వైదేహి ఇన్నేళ్ళ జీవితంలో వాసుని ఇంత ఉదాసీనంగా  ఎప్పుడూ చూడలేదు. ఆమెలో వాసు మళ్ళీ   మాములు మనిషి అవుతాడా అనే దిగులు మొదలైంది. వాసుని చాల ఓదార్చింది.

అనుబంధాలు వివాహ బంధాలతోనే కలియక్కరలేదు.అది రక్త బంధం కావొచ్చు, స్నేహ బంధం  కావొచ్చు.