ఆ ఇంట్లో అందరూ సైన్యం లో నే పనిచేస్తారు. యుద్ధం లో వీర మరణం పొందిన వారు,చిన్నతనం లోనే వైధవ్యం పొందిన వనితలెందరో. ఆ ఇంట్లోనే కాదు, ఆ ఊరిలో అదే పరిస్థితి.
నాలుగో తరంలో పుట్టిన భరత్ కి ఇది సరిగ్గా
అనిపించలేదు. బాగా చదువుకున్నాడు. వ్యవసాయం చేయడం మొదలెట్టాడు. అదే ఊరికి చెందిన ఒక వితంతువుని వివాహమాడేడు. భరత్ ని చూసి మరి కొందరు యువకులు కూడా వ్యవసాయమే చేపట్టారు. ఆహార పదార్థాలని ఎగుమతి చేయడం మొదలెట్టారు. ఆ రాష్ట్రం ఆర్ధికంగా సుభిక్షమయింది. యువకులు ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.
దేశం కోసం రక్త తర్పణం చేసిన ఆ నేల అహింసా పరమోధర్మః అంటోంది
No comments:
Post a Comment