Saturday, 3 May 2025

చలిమంట

 

జీవితమంతా
పచ్చగా మెరిసి
చెట్టుకి
సౌందర్యాన్ని
జీవాన్ని అందించి
కాయలతో
పూలతో
పళ్ళతో
సహజీవనం చేసిన
ఈ ఎండుటాకులను
ఎవరు తొక్కుతారో
చలి కాచుకోవడానికి
చలిమంట వేసుకుంటారో


No comments:

Post a Comment