అంశం:తలుపులు మూసుకున్న తరువాత
తేది:30.7.25
శీర్షిక: మనసు వేదన
తలుపులు మూసుకున్న
తరువాత
అంతా నిశ్శబ్దం
నిర్లిప్తత
మనసులో బాధలు
మౌనం
ఎవరికీ చెప్పుకోలేని
నిస్సహాయత
పిల్లల ప్రపంచం వేరు
మనవల
ప్రపంచం వేరు
గతకాలపు వైభవాలెన్నున్నా
నేటి ఒంటరితనం
భయంకరం
అప్పుడప్పుడూ
ఓ ఫోన్ కాల్
వీడియో కాల్
పలకరిస్తాయి
ఆనందం
హుషారు నటిస్తాము
తలుపులు తెరిచినా
అదే నటన
ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని
Result announced
No comments:
Post a Comment