నా మిత్రమా
నీకోసం ఎదురుచూస్తున్నా
జాతి గర్వించే సేవ నీది
యుద్ధంలో సంరక్షితంగా
బయటపడ్డావు
సెలవు దొరికితే
నాదగ్గరకే వస్తావు
అక్కడ నువ్వు
జైవాన్‌వి
ఇక్కడ ఇద్దరం జై కిసాన్
వ్యవసాయం చేయడానికి
వెనకాడవు నువ్వు
నా పిల్లలు మామా
అంటే మురిసిపోతావు
వాళ్ళూ నీ కోసం
ఎదురు చూస్తుంటారు
నీగురించి గర్వంగా చెప్తుంటారు
No comments:
Post a Comment