అనగా అనగా ఒక జంట.అబ్బాయికి చిన్నతనంలో అమ్మ నాన్న ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.అందుకు ఆ అబ్బాయికి ఎప్పుడూ ప్రాణ రక్షణ గురించి భయం.
అబ్బాయి పేరు పాణి.అమ్మాయి పేరు ఝాన్సీ.అది కన్నతల్లి పెట్టిన పేరు.తల్లి అకాల మరణం తరవాత, తండ్రి మరో పెళ్ళి చేసుకొని తండ్రి, సవతి తల్లి ఆమెని నిర్లక్ష్యం చేసేరు.
ఝాన్సీ, పాణిని ఒకసారి కలిసింది.ఇద్దరి మధ్య ప్రేమ రోజు రోజుకీ పెరిగింది. పాణి తన పట్ల చూపే ప్రేమ, ఆరాధన,అతని బిగి కౌగిలి అన్నీ ఝాన్సీకి ఎంతో ఇష్టం. ఝాన్సీ ధైర్యం, సాహసం పాణికి ఎంతో భద్రతని ఇచ్చేది.అలా బిగి కౌగిలి, భద్రతా భావంతో వారిరువురూ ఆలు మగలయ్యారు.
21.8.25
No comments:
Post a Comment