Sunday, 3 August 2025

నా దేశం

 

నాదేశం
ఆర్యులదీ కాదు
తురుష్కులదీ కాదు
బ్రిటిష్ దొరలదీ కాదు

ఈ దేశం
ఈ గడ్డలోనే పుట్టిన
ఆదిమజాతి వారిది
ఈ గడ్డలో పుట్టిన
వారి పూర్వీకులది

అయినా ఈ దేశం నాదేశమే
మా తాత తండ్రులదీ
ఈ దేశమే  నాకు తెలిసిన
విశ్వం
నాకు  తెలిసిన  ప్రకృతి
నేను  చూసిన అందం

ఈదేశం
ఈ సమాజం
మా పరిసరాలు
స్నేహితులు సన్నిహితులు
అన్నిటికీ  అలవాటు  పడ్డ
ప్రాణం  నాది

ఈదేశం నాతల్లి
అమ్మని ఆలింగనం  చేసుకుంటూ
అణువణువూ
దర్శిస్తూ స్పర్శిస్తూ

అమ్మ  ఒడిలోనే
కనుమూస్తానని
ఖచ్చితంగా  తెలుసు 🙏
Selected 2

No comments:

Post a Comment