మిత్రమా
నా చిన్ననాటి నేస్తమా
భుజాలమీద చేతులేసుకుని
తిరిగాం
కన్నీరొచ్చేదాకా నవ్వేం
ఏటి ఒడ్డున గంటల
తరబడి గడిపేం
బడిలో ఎందరు మిత్రులున్నా
నాకు నువ్వు ప్రత్యేకం
మనిద్దరి మధ్య
పేద గొప్ప
బేధం లేదు
జీవితమంతా కలిసే నడిచాం
మిత్రమా
ఈరోజు నువ్వు లేవు
నీ జ్ఞాపకాలు మాత్రమే
నాతో ఉన్నాయి
9.8.25
Selected
No comments:
Post a Comment