కన్నుల కవితలు
యువత ప్రేమలేఖలు
ముదిమి వయసులో
కూడా రాయగలరు కొందరు
ఆ కైతల అందమే అందం
ఎవరి కోసమో ఆ కైతలు
వారి మనసుని మరింత
రంజింపచేస్తాయి
25.8.25
కన్నుల కవితలు
యువత ప్రేమలేఖలు
ముదిమి వయసులో
కూడా రాయగలరు కొందరు
ఆ కైతల అందమే అందం
ఎవరి కోసమో ఆ కైతలు
వారి మనసుని మరింత
రంజింపచేస్తాయి
25.8.25
అనగనగా ఓ చిన్న గ్రామం.గ్రామంలో మర్రిచెట్టు చుట్టూతా దిమ్మె.పున్నమి నాడు వెన్నెల అంతా ఆ దిమ్మె మీదే.గ్రామస్థులంతా ఆ దిమ్మెని చంద్ర దిమ్మె అని పిలిచేవారు.వెన్నెల రాత్రులు యువకులు అక్కడ కుమికూడి నృత్యాలు చేసి ఆనందించేవారు
24.8.25
మామిడిపూత
శోభాయమానంగా
వేపపూత
ఉగాది పచ్చడికి
ఉద్యానవనంలో
అందమైన పూత
అడవులలో
ఆహ్లాదకరంగా పూత
యువత జాతి
మెచ్చే పూత
పూత చెట్టుకి
అందం
పూత కనులకి విందు
23.8.25
వయసు
ఇరవై మూడు
ఆవేశం యువకుల్లో
కొందరు యువతుల్లో
అడవిలో అన్నల్లో
రక్తం సలసల మరుగుతుంది
ఎర్రజెండా రెపరెప లాడుతుంది
కమ్యూనిజం
మార్క్సిజం
మావోయిజం
ఎర్రజెండాని
గౌరవించేవే
22.8.25
అనగా అనగా ఒక జంట.అబ్బాయికి చిన్నతనంలో అమ్మ నాన్న ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.అందుకు ఆ అబ్బాయికి ఎప్పుడూ ప్రాణ రక్షణ గురించి భయం.
అబ్బాయి పేరు పాణి.అమ్మాయి పేరు ఝాన్సీ.అది కన్నతల్లి పెట్టిన పేరు.తల్లి అకాల మరణం తరవాత, తండ్రి మరో పెళ్ళి చేసుకొని తండ్రి, సవతి తల్లి ఆమెని నిర్లక్ష్యం చేసేరు.
ఝాన్సీ, పాణిని ఒకసారి కలిసింది.ఇద్దరి మధ్య ప్రేమ రోజు రోజుకీ పెరిగింది. పాణి తన పట్ల చూపే ప్రేమ, ఆరాధన,అతని బిగి కౌగిలి అన్నీ ఝాన్సీకి ఎంతో ఇష్టం. ఝాన్సీ ధైర్యం, సాహసం పాణికి ఎంతో భద్రతని ఇచ్చేది.అలా బిగి కౌగిలి, భద్రతా భావంతో వారిరువురూ ఆలు మగలయ్యారు.
21.8.25
పసి ప్రాయంలో
అమ్మ కౌగిలి
నాన్న భద్రత
పెద్దయ్యాక
మిత్రుల
ఆప్యాయపు కౌగిలి
వైవాహిక జీవితం
జీవిత భాగస్వామి
కౌగిలి
భద్రత
వృద్ధాప్యంలో
కన్నబిడ్డల
భద్రత
కౌగిలి
కౌగిలి
భద్రత
ప్రేమకి ప్రతిరూపాలే
21.8.25
మబ్బులు ఆడుతునే
ఉంటాయి
అటూఇటూ పరిగెడుతునే
ఉంటాయి
వర్షిస్తాయి
నీలి మబ్బులు
నల్లమబ్బులు
అవన్నీ మనకి
అద్భుతాలు
ఆనందాలు
20.8.25
మా తాతగారు
మా నాన్న గారు
దాచిపెట్టిన సాహిత్యం
అటకమీద అక్షరాలు
నాకు గణితం
విజ్ఞానశాస్త్రం
చాలా ఇష్టమున్నా
సాహిత్యం కూడా
చాలా ఇష్టం
అది మా బామ్మ నుండి
అమ్మ నుండి వచ్చింది
నాన్న గదిలో ఎన్నో
పుస్తకాలున్నా
అటకమీద అక్షరాని
కూడా దింపి చదువుతుంటాం
అక్షరాలు వాగ్దేవి కదా
వాటిని ఎంత ప్రేమిస్తే
అంత ఆనందం
19.8.25
ఆమె జీవితంలో
మొదటి మలుపు
అష్టకష్టాలే
వైఫల్యాలే
వెటకారాలు
ఎత్తిపొడుపులే
ఐనా ఆమె
రెండో మలుపు కోసం
ఎదురు చూసింది
విజయలక్ష్మి
ఆమెని వరించింది
విజేతగ నిలిచింది
ఆదరణ
మర్యాద
ప్రతిష్ట
అన్నీ లభించాయి
ఆ మలుపు
తరువాత
18.8.25
అగ్గి కావ్యం
శ్రీశ్రీ మహాప్రస్థానం
అగ్గి కావ్యం
ప్రతీ విప్లవకారుని
కవిత్వం అగ్గి కావ్యం
దళిత కవిత్వం
అగ్గి కావ్యం
స్త్రీ వాద కవిత్వం
అగ్గి కావ్యం
కార్మిక కర్షక
పక్షపాత కవిత్వం
అగ్గి కావ్యం
అగ్గి కావ్యం
ప్రగతికి దారితీస్తుంది
వ్యత్యాసాలను
దూరం చేస్తుంది
17.8.25
వెలుగు
వెలిగించు
నీ చదువుతో
సంస్కారంతో
వినయ విధేయతలతో
మంచి మర్యాదలతో
స్నేహంతో
ఆదరంతో
నిండు మనసుతో
సాయపడే మనసుతో
నీ ఆశయాలతో
ప్రేరణతో
ఒక దీపంతో
ఎన్నో దీపాలు
వెలిగించినట్లు
జీవితమంతా
ఎన్నో దీపాలు
వెలిగించుదాం
16.8.25
అందాల చంద్రుడు.వెండి వెన్నెల కురిపిస్తాడు.చంద్ర లోయ ఎంత అందంగా ఉంటుంది! మానవుడు చంద్ర మండలం మీద అడుగు పెట్టాడు.అదో అద్భుత విజయం.చంద్ర మండల అందాలు, లోయ అద్భుతాలు అన్నీ చూడగలిగాడు. భూమి మీద ఉన్న మనం కూడా ఆ అద్భుతాలను,ఆహ్లాదకర వాతావరణాన్ని చూడగలిగాం
15.8.25
పేదల బతుకులు
పూట గడవని
బతుకులు
దీనంగా
హీనంగా
భయం భయంగా
గడిచే బతుకులు
నిర్భాగ్యపు బతుకులు
ఏసాయం దొరకని
బతుకులు
అవిద్య
అంధకారం
చీకటి బతుకులు
వారి బతుకుల్లో కూడా
ఆశాదీపం
కనిపిస్తుంది నాకు
ఆశాజీవిని నేను
14.8.25
చీకటి కిటికీ
లోంచి
వెలుతురు ఎప్పుడు
వస్తుందా అని చూస్తున్నా
బతుకులో చీకటి
జీవితంలో నిరాశ
వెలుగురేఖలు
ఎప్పుడు పరుచుకుంటాయా
అన్న ఆశ
చీకటి కిటికీ వెనక
అపరిచితుడు
ఎవరైనా ఉన్నాడేమో
అన్న భయం
కిటికీ మూసేస్తే
చల్లగాలి లేదు
ప్రకృతి తోడు ఉండదు
అరుణ కిరణాల కోసం
ఎదురు చూస్తూ
13.8.25
చిన్న వయసులో
పెద్ద మనసు
ముసలివాళ్ళని
రోడ్డు దాటించేవారు
అమ్మకి ఇంటి పనిలో
సాయం చేసేవారు
ఇంట్లో పెద్దవారి గురించి
శ్రద్ధ తీసుకునేవారు
చుట్టు పక్కల చెత్త
శుభ్రం చేసేవారు
చిన్న పిల్లలకి ఎంత
పెద్ద మనసైనా ఉంటుంది
అది వారి సభ్యత
సంస్కారం మీద ఆధారపడి
ఉంటుంది
12.8.25
దీపం జ్యోతి పరబ్రహ్మం
పూజ మొదలెట్టాలంటే
దీపం వెలిగిస్తాం
దీపావళి నాడు
ఇంటింటా దీపావళి
చీకట్లని తొలిగించేది
దీపకాంతి
కార్తీక మాసంలో
కార్తీక దీపోత్సవం చేస్తారు
విద్యాదీపాలు వెలగాలి
ఇంటింటా
దేశమంతా
11.8.25
చిన్న వయసులో
పెద్ద మనసు
ముసలివాళ్ళని
రోడ్డు దాటించేవారు
అమ్మకి ఇంటి పనిలో
సాయం చేసేవారు
ఇంట్లో పెద్దవారి గురించి
శ్రద్ధ తీసుకునేవారు
చుట్టు పక్కల చెత్త
శుభ్రం చేసేవారు
చిన్న పిల్లలకి ఎంత
పెద్ద మనసైనా ఉంటుంది
అది వారి సభ్యత
సంస్కారం మీద ఆధారపడి
ఉంటుంది
నా మిత్రమా
నీకోసం ఎదురుచూస్తున్నా
జాతి గర్వించే సేవ నీది
యుద్ధంలో సంరక్షితంగా
బయటపడ్డావు
సెలవు దొరికితే
నాదగ్గరకే వస్తావు
అక్కడ నువ్వు
జైవాన్‌వి
ఇక్కడ ఇద్దరం జై కిసాన్
వ్యవసాయం చేయడానికి
వెనకాడవు నువ్వు
నా పిల్లలు మామా
అంటే మురిసిపోతావు
వాళ్ళూ నీ కోసం
ఎదురు చూస్తుంటారు
నీగురించి గర్వంగా చెప్తుంటారు
మిత్రమా
నా చిన్ననాటి నేస్తమా
భుజాలమీద చేతులేసుకుని
తిరిగాం
కన్నీరొచ్చేదాకా నవ్వేం
ఏటి ఒడ్డున గంటల
తరబడి గడిపేం
బడిలో ఎందరు మిత్రులున్నా
నాకు నువ్వు ప్రత్యేకం
మనిద్దరి మధ్య
పేద గొప్ప
బేధం లేదు
జీవితమంతా కలిసే నడిచాం
మిత్రమా
ఈరోజు నువ్వు లేవు
నీ జ్ఞాపకాలు మాత్రమే
నాతో ఉన్నాయి
9.8.25
Selected
తెలివి
చిక్కులనుండి
తప్పించుకోవడానికి
తమని తాము
రక్షించుకోవడానికి
సమయస్ఫూర్తిగా
ప్రవర్తించడానికి
చదువు లేకున్నా
తెలివైన వాళ్ళుంటారు
చదువుకున్నా
తెలివితేటలు ప్రదర్శించరు
కొందరు
అనుభవంతో కూడిన
తెలివితేటలు కొందరివి
తెలివిని ఉపయోగించాల్సిందే
దైనందిన జీవితంలో
ప్రకృతిలో గడపడం
ఆహ్లాదం
పిట్టల కుహు కుహు
రాగాలు ఆహ్లాదం
చిన్నపిల్లల చిలిపి చేష్టలు
ఆహ్లాదం
యౌవ్వన దశ
ఆహ్లాదం
రంగు రంగు పూవులు
ఆహ్లాదం
ముచ్చటైన జంట
ఆహ్లాదం
ఆహ్లాదమైన వాటిని
అనుభవించడమే జీవితం
ఇద్దరి మధ్య
ప్రేమ ఉన్నా
ఇద్దరం చెరోవైపు
ఉన్నాం
నేను అతి సామాన్యుడిని
మీరు కోటీశ్వరులు
నీవేమో పెద్ద చదువులు
నాది డిగ్రీ చదువు
ఇరు హృదయాలు
ఎలా ఏకమయ్యాయో
మీ పెద్దలని ఎలా
ఒప్పించగలమో
ఇద్దరం చెరోవైపు ఉన్నా
నా ప్రాణం నువ్వు
నా జీవితమే నువ్వు
ఏదో ఒక నాటికి
వివాహ బంధం
మనని ఒక్కటి
చేస్తుందని ఆశ
4.8.25
అంశం:తలుపులు మూసుకున్న తరువాత
తేది:30.7.25
శీర్షిక: మనసు వేదన
తలుపులు మూసుకున్న
తరువాత
అంతా నిశ్శబ్దం
నిర్లిప్తత
మనసులో బాధలు
మౌనం
ఎవరికీ చెప్పుకోలేని
నిస్సహాయత
పిల్లల ప్రపంచం వేరు
మనవల
ప్రపంచం వేరు
గతకాలపు వైభవాలెన్నున్నా
నేటి ఒంటరితనం
భయంకరం
అప్పుడప్పుడూ
ఓ ఫోన్ కాల్
వీడియో కాల్
పలకరిస్తాయి
ఆనందం
హుషారు నటిస్తాము
తలుపులు తెరిచినా
అదే నటన
ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని
Result announced
ఒంటరి బతుకు
ఒంటరి జీవితం
జీవితం లో తోడు
లేకుంటే
ఉన్న తోడు విడిచి
వెళ్ళిపోతే
తిరిగి రాని లోకాలకి
వెళ్లిపోతే
ఉద్యోగాల కోసం
ఒక్కరే దూరప్రాంతాలకి
తరలివెళ్తే
దేశసేవ కోసం
సరిహద్దుల రక్షణ
కర్తవ్యదీక్షలో నిమగ్నమైతే
ఒంటరితనం లో కూడా
సమాజంలో స్నేహితులని
తోడుని వెతుక్కోవచ్చు
3.8.25
చిన్నప్పుడు
అమ్మానాన్నల తోడు
అన్నదమ్ముల తోడు
అక్కచెల్లెళ్ళ తోడు
స్నేహితులతోడు
ప్రేమించిన వారి తోడు
జీవిత భాగస్వామి తోడు
మంచి వ్యక్తుల తోడు
సమాజం తోడు
సంఘాల తోడు
జీవితమంతా ఎవరో ఒకరి
తోడు కావలసిందే
2.8.25
అందరూ చూసేది
ఒకవైపు
కొందరే చూసేది
మరోవైపు
భార్య చూసేది
మరోవైపు
కన్న బిడ్డలు చూసేది
మరోవైపు
సన్నిహితులు చూసేది
మరోవైపు
నాణేనికి మరోవైపు
ఉన్నట్టే
అమానుషత్వం
దౌర్జన్యం
దుర్మార్గం
మరోవైపు
ఎందరిలోనో
1.8.25
అమ్మ రక్షణ
నాన్న రక్షణ
అన్నదమ్ముల రక్షణ
అక్కాచెల్లెళ్ళ రక్షణ
పోలీస్ రక్షణ
జవాన్ రక్షణ
ఇరుగూ పొరుగూ
రక్షణ
వైద్యుల రక్షణ
పచ్చని చెట్ల రక్షణ
స్వీయ రక్షణ
రక్షణ వల్లే
కొనసాగుతోంది
మన జీవితం
లేకుంటే ప్రాణాంతకమే
30.7.25
మట్టితో కుండలు
మట్టితో దేవుని విగ్రహాలు
చేనేత వస్త్రాలు
కొండపల్లి బొమ్మలు
అన్నీ నైపుణ్యంతోనే
కానీ వారి కష్టానికి
విలువ తక్కువ
మనం
ప్రభుత్వం కూడా
ఆ నైపుణ్యం విలువ గుర్తించాలి
29.7.25
నాదేశం
ఆర్యులదీ కాదు
తురుష్కులదీ కాదు
బ్రిటిష్ దొరలదీ కాదు
ఈ దేశం
ఈ గడ్డలోనే పుట్టిన
ఆదిమజాతి వారిది
ఈ గడ్డలో పుట్టిన
వారి పూర్వీకులది
అయినా ఈ దేశం నాదేశమే
మా తాత తండ్రులదీ
ఈ దేశమే నాకు తెలిసిన
విశ్వం
నాకు తెలిసిన ప్రకృతి
నేను చూసిన అందం
ఈదేశం
ఈ సమాజం
మా పరిసరాలు
స్నేహితులు సన్నిహితులు
అన్నిటికీ అలవాటు పడ్డ
ప్రాణం నాది
ఈదేశం నాతల్లి
అమ్మని ఆలింగనం చేసుకుంటూ
అణువణువూ
దర్శిస్తూ స్పర్శిస్తూ
అమ్మ ఒడిలోనే
కనుమూస్తానని
ఖచ్చితంగా తెలుసు 🙏
Selected 2
అమ్మానాన్నలుఆచార్యులు గురువమ్మలుపడేసారు నాఒళ్ళో అక్షరాలపొట్లంఆ అక్షరాలు ఇప్పటికీపూసగుచ్చుతున్నా పదాలుగా కవితలుగా1..8. 15
3 50 A.M
Selected
బలం
శారీరిక బలం
మానసిక బలం
ఆరోగ్యం కోసం
శారీరిక బలం అవసరం
మనోబలం తో
ఏదైనా సాధిస్తాం
మన కుటుంబం
మన బలం
మన మిత్రులు
మన బలం
ఆరోగ్యకరమైన ఆహారం
వ్యాయామం
యోగా
ఇవన్నీ
మన బలం
ఎటువంటి బలహీనతలూ
లేకపోవడమే
మనబలం
28.7.25
అనుబంధం
అమ్మానాన్న లతో
అక్కాచెల్లెళ్ళతో
అన్నదమ్ములతో
స్నేహితులతో
జీవిత భాగస్వామితో
కన్నబిడ్డలతో
గురుశిష్యుల నడుమ
అహంభావం
దురాశ
స్వార్ధం
పెరిగితే
అనుబంధం తగ్గుతుంది
అనుబంధం చిక్కనైనది
నమ్మకాన్ని పెంచుతుంది
ఆజన్మాంతం నిలిచే
అనుబంధం
అందరికీ ఆదర్శం
రేపటి కోసం
కలలు కందాం
మన పిల్లల కోసం
మన జాతి కోసం
రేపటి కోసం
కష్ట పడదాం
మన స్వప్నాలు
సాకారం చేసుకోవడం
కోసం
ఉన్నత చదువుల కోసం
ఉపాధి కోసం
జాతి మెచ్చే
క్రీడా పతకాల
కోసం
ఆస్కార్ల కోసం
నోబెల్ బహుమతుల కోసం
జాతి గర్వించే
నేతల కోసం
స్వర్ణ భారతం కోసం
ఆదాయం
తక్కువైనప్పుడు
నెలఖర్చు
రాసుకోవాల్సిందే
ఆదాయంలో కొంత భాగం
భవిష్యత్తు కోసం
దాచాలన్నా
నెలఖర్చు రాయాల్సిందే
పిల్లల చదువుల కోసం
పెళ్ళిళ్ళ కోసం
అమ్మానాన్నల ఆరోగ్యం
కోసం నెల ఖర్చు
రాయాల్సిందే
దుబారా ఖర్చు తగ్గించడం
కోసం నెలఖర్చు రాయాల్సిందే
నెలఖర్చు రాయడం
క్రమశిక్షణ