Sunday, 9 December 2012
nee kosam eduru choostu
లాంగ్ టర్మ్ కోచింగ్ లో
చేరతానన్నావు
కెరీర్ కోసం
జైలు జీవితంలా
భావించావు చేరిన క్షణం నుండి
నరకాన్ని అనుభవించే ఉంటావు
నిద్రకళ్ళతో పరీక్షలు రాయాలంటే
నీ దగ్గిరకి వచ్చి తిరిగి వచ్చినపుడు
నీ ఆక్రందన రోదన మరిచిపోం
భీమవరం నుండి
పరిగెత్తు కొచ్చే దానివి
ఇంటికి వచ్చినప్పుడల్లా ఎంత ఆనందం
ఈరోజు నీమార్గం
నువ్వే నిర్దేశించుకున్నావు
నీ స్వర్గం నీ జీవిత సహచరునితోనే
ఆ జన్మాంత స్నేహితునితోనే
అమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంటుంది
నేను ఇక్కడే
నీకోసం ఎదురు చూస్తూ
నా తల్లి దుఃఖం నాకు తెలియదు
నాజీవిత సహచరునితో నేను వచ్చేసినపుడు
అమ్మ దుఃఖం ఇంతేనేమో
అమ్మ
10.12.2012
చేరతానన్నావు
కెరీర్ కోసం
జైలు జీవితంలా
భావించావు చేరిన క్షణం నుండి
నరకాన్ని అనుభవించే ఉంటావు
నిద్రకళ్ళతో పరీక్షలు రాయాలంటే
నీ దగ్గిరకి వచ్చి తిరిగి వచ్చినపుడు
నీ ఆక్రందన రోదన మరిచిపోం
భీమవరం నుండి
పరిగెత్తు కొచ్చే దానివి
ఇంటికి వచ్చినప్పుడల్లా ఎంత ఆనందం
ఈరోజు నీమార్గం
నువ్వే నిర్దేశించుకున్నావు
నీ స్వర్గం నీ జీవిత సహచరునితోనే
ఆ జన్మాంత స్నేహితునితోనే
అమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంటుంది
నేను ఇక్కడే
నీకోసం ఎదురు చూస్తూ
నా తల్లి దుఃఖం నాకు తెలియదు
నాజీవిత సహచరునితో నేను వచ్చేసినపుడు
అమ్మ దుఃఖం ఇంతేనేమో
అమ్మ
10.12.2012
Sunday, 4 November 2012
varsham varsham
గంటయి కుండపోత వృష్టి దుఃఖం
కట్టలు తెంచుకున్నట్టు
ఆవేశంతో విరుచుకు పడ్డట్టు
నేలతల్లిని నీటితో
కన్నీటితో ముంచెత్తుతోంది
అంత గంభీరమైన ఆకాశం
బేలగా విలవిలలాడుతోంది
ఉరుముతోంది
గర్జిస్తోంది
గూట్లో వెచ్చగా నేనున్నా
ఆ వర్షంలో తడిసి ముద్దవుతున్న అనుభూతి
వర్షం వర్షం శబ్దిస్తోన్న వర్షం
రెండు గంటలయి
నన్ను లేపి కూర్చోపెట్టింది
నా సంగీతాన్ని
నువ్వు వినితీరాలని
భవాని
4.11.2012-2.30a.m.
కట్టలు తెంచుకున్నట్టు
ఆవేశంతో విరుచుకు పడ్డట్టు
నేలతల్లిని నీటితో
కన్నీటితో ముంచెత్తుతోంది
అంత గంభీరమైన ఆకాశం
బేలగా విలవిలలాడుతోంది
ఉరుముతోంది
గర్జిస్తోంది
గూట్లో వెచ్చగా నేనున్నా
ఆ వర్షంలో తడిసి ముద్దవుతున్న అనుభూతి
వర్షం వర్షం శబ్దిస్తోన్న వర్షం
రెండు గంటలయి
నన్ను లేపి కూర్చోపెట్టింది
నా సంగీతాన్ని
నువ్వు వినితీరాలని
భవాని
4.11.2012-2.30a.m.
lovely message
lovely message:
shahjahan`s taj for mumtaj
is only a glory
devadas`s love for paru is a story
my love for you
is a living eternity
3.11.2012
ఏ క్షణంలోనైనా
ఎగిసిపడే అలలతో
సంద్రం అలిసిపోవచ్చు
ఏ క్షణంలోనైనా
సూర్యుడి చుట్టూ పరిభ్రమించే భూమి
భ్రమణాన్ని మరిచిపోవచ్చు
నిరంతరం నిన్ను
ప్రేమించే నా హృదయం
అలిసిపోదు మరిచిపోదు
RAM-the best half
3.11.2012
shahjahan`s taj for mumtaj
is only a glory
devadas`s love for paru is a story
my love for you
is a living eternity
3.11.2012
ఏ క్షణంలోనైనా
ఎగిసిపడే అలలతో
సంద్రం అలిసిపోవచ్చు
ఏ క్షణంలోనైనా
సూర్యుడి చుట్టూ పరిభ్రమించే భూమి
భ్రమణాన్ని మరిచిపోవచ్చు
నిరంతరం నిన్ను
ప్రేమించే నా హృదయం
అలిసిపోదు మరిచిపోదు
RAM-the best half
3.11.2012
gnapakaala tadi
మీ కవితల సంపుటిలో
భీమవరం ప్రస్తావన లేదేమని
అడిగాడు డిప్యూటీ తాశీల్దారు
నాలుగిళ్లలోగిలి
చెరుకు చేనై ఆ అపురూప దృశ్యం
మటుమాయమయిందని
నేను వలవలా ఏడిస్తే
ఆ విషాద దృశ్యానికి
సాక్షీభూతం తాను
బొబ్బిలి దగ్గర కుగ్రామం భీమవరం
మా నలుగురితాతల స్వగ్రామం మా భీమవరం
ఆ నాలుగిళ్ళ లోగిలిలో
తాతలు బామ్మలు
అన్నలు చిన్నాన్నలు
అక్కలు అత్తలు
బాల్యంలో వేసవి సెలవుల్లో
ఆ నాలుగిళ్ళ లోగిలిలో
మేమాడిన ఆటలు
తాతగారి కాశీ ప్రయాణ ముచ్చటలు
వూళ్ళో పెట్టగానే
బుచ్చి బుగత పిల్లలా
గ్రామస్తుల పలకరింపుల ఆప్యాయతలు
ఆ పంటచేల గట్లమీద నడవడం సరదా
ప్రతి వేసవికీ మంచి వేసవి విడిది అది
ప్రతి వేసవి సెలవులూ గొప్ప అనుభూతి
అనిర్వచనీయ ఆనందం
అంతా మన వాళ్ళన్న రక్త బంధం
ఎన్నో ఏళ్ళ తర్వాత
ఆపక్కగా ఎం ఫిల్ ఫీల్డ్ వర్క్ కి వెళ్తూ
మావూరు మావూరంటూ సంబర పడుతూ
కార్లోంచి తొంగి తొంగి చూస్తే ఏముంది
పొలంగా మారిన నాలుగిళ్ళ లోగిలి
తాతగారి నుయ్యని మేం చెప్పుకునే బావి
చేనుకి నీరందిస్తూ
మిగిలిన చిట్ట చివరి అనుబంధం
పిన్నలనీ పెద్దలనీ
ఎంతగానో అలరించి
బంధుత్వాలు ఆప్యాయతలు
పెనవేసిన నాలుగిళ్ళ లోగిలి
తలుచుకుంటే చెమ్మగిల్లుతాయి
ఇప్పటికీ నాకళ్ళు
కవిత రాయడానికి
ప్రేరణ నిచ్చిన శంకర్ కి
కృతజ్ఞతలతో
భవాని
11.10.2007
భీమవరం ప్రస్తావన లేదేమని
అడిగాడు డిప్యూటీ తాశీల్దారు
నాలుగిళ్లలోగిలి
చెరుకు చేనై ఆ అపురూప దృశ్యం
మటుమాయమయిందని
నేను వలవలా ఏడిస్తే
ఆ విషాద దృశ్యానికి
సాక్షీభూతం తాను
బొబ్బిలి దగ్గర కుగ్రామం భీమవరం
మా నలుగురితాతల స్వగ్రామం మా భీమవరం
ఆ నాలుగిళ్ళ లోగిలిలో
తాతలు బామ్మలు
అన్నలు చిన్నాన్నలు
అక్కలు అత్తలు
బాల్యంలో వేసవి సెలవుల్లో
ఆ నాలుగిళ్ళ లోగిలిలో
మేమాడిన ఆటలు
తాతగారి కాశీ ప్రయాణ ముచ్చటలు
వూళ్ళో పెట్టగానే
బుచ్చి బుగత పిల్లలా
గ్రామస్తుల పలకరింపుల ఆప్యాయతలు
ఆ పంటచేల గట్లమీద నడవడం సరదా
ప్రతి వేసవికీ మంచి వేసవి విడిది అది
ప్రతి వేసవి సెలవులూ గొప్ప అనుభూతి
అనిర్వచనీయ ఆనందం
అంతా మన వాళ్ళన్న రక్త బంధం
ఎన్నో ఏళ్ళ తర్వాత
ఆపక్కగా ఎం ఫిల్ ఫీల్డ్ వర్క్ కి వెళ్తూ
మావూరు మావూరంటూ సంబర పడుతూ
కార్లోంచి తొంగి తొంగి చూస్తే ఏముంది
పొలంగా మారిన నాలుగిళ్ళ లోగిలి
తాతగారి నుయ్యని మేం చెప్పుకునే బావి
చేనుకి నీరందిస్తూ
మిగిలిన చిట్ట చివరి అనుబంధం
పిన్నలనీ పెద్దలనీ
ఎంతగానో అలరించి
బంధుత్వాలు ఆప్యాయతలు
పెనవేసిన నాలుగిళ్ళ లోగిలి
తలుచుకుంటే చెమ్మగిల్లుతాయి
ఇప్పటికీ నాకళ్ళు
కవిత రాయడానికి
ప్రేరణ నిచ్చిన శంకర్ కి
కృతజ్ఞతలతో
భవాని
11.10.2007
Thursday, 5 July 2012
chittitalliki shubhaakaamkshalato
కన్నీటి బిందువు
కవితౌతుంది అప్పుడప్పుడూ
అల్లుడు కోసం కూడా రాసేస్తావు
నాకోసం రాయాలనిపించదేం
కూతురి సాధింపు
గణితంలో తొంభై దాటి తెచ్చుకున్నా
విజ్ఞాన శాస్త్రా లానే నమ్ము కున్నావు
ఇంజినీరింగ్ ఉద్యోగావకాశాలు
పుష్కలంగా ఇస్తుందని తెలిసినా
సైన్సు బాట తొక్కావు
వచ్చిన ర్యాంక్ తో రాజీపడక
జైలు జీవితానికి సంసిద్ధమయి మరీ
విజయవాడ కదిలావు విజయం
కైవసం చేసుకోవడానికి
డాక్టర్ వనిపించుకున్నావు
పట్టుదలగా
కానీ అమ్మానాన్నా చిట్టి చెల్లెలికి
దూరంగా ఎంత ఆక్రోశించావో
ఆరోగ్యాన్ని ఎంతగా పణం పెట్టావో
జాలువారే నా కన్నీటికి తెలుసు
చిట్టితల్లీ ఈనాటి నీకష్టం
నీ భవితకి బంగరు బాట వేస్తుంది
దేశం విడిచి వెళ్ళడానికి సైతం
సంసిద్ధమవడం
మాకే అర్ధమయ్యే నీత్యాగం
ఇక్కడ నీ నడకకి మీ డాడీ
చిటికిన వేలు కొండంత అండ
ఆదేశంలోసాయం చేసుకోవాలి నీకు నువ్వే
అయినా నమ్మకం విశ్వాసం
నువ్వు మెట్టినింటికి పుట్టినింటికి
వన్నె తెస్తావని
నాయనమ్మ శిక్షణ
ఆ వృద్ధ దంపతులకి
నువ్వందించేసంరక్షణ
ఈవయసులో మీ తరానికి
సాధ్యం కావు ఎవరికీ
అభినందనలు
శుభాకాంక్షలు నీకు
మా అందరివీ
అమ్మ
4.7.2012
కవితౌతుంది అప్పుడప్పుడూ
అల్లుడు కోసం కూడా రాసేస్తావు
నాకోసం రాయాలనిపించదేం
కూతురి సాధింపు
గణితంలో తొంభై దాటి తెచ్చుకున్నా
విజ్ఞాన శాస్త్రా లానే నమ్ము కున్నావు
ఇంజినీరింగ్ ఉద్యోగావకాశాలు
పుష్కలంగా ఇస్తుందని తెలిసినా
సైన్సు బాట తొక్కావు
వచ్చిన ర్యాంక్ తో రాజీపడక
జైలు జీవితానికి సంసిద్ధమయి మరీ
విజయవాడ కదిలావు విజయం
కైవసం చేసుకోవడానికి
డాక్టర్ వనిపించుకున్నావు
పట్టుదలగా
కానీ అమ్మానాన్నా చిట్టి చెల్లెలికి
దూరంగా ఎంత ఆక్రోశించావో
ఆరోగ్యాన్ని ఎంతగా పణం పెట్టావో
జాలువారే నా కన్నీటికి తెలుసు
చిట్టితల్లీ ఈనాటి నీకష్టం
నీ భవితకి బంగరు బాట వేస్తుంది
దేశం విడిచి వెళ్ళడానికి సైతం
సంసిద్ధమవడం
మాకే అర్ధమయ్యే నీత్యాగం
ఇక్కడ నీ నడకకి మీ డాడీ
చిటికిన వేలు కొండంత అండ
ఆదేశంలోసాయం చేసుకోవాలి నీకు నువ్వే
అయినా నమ్మకం విశ్వాసం
నువ్వు మెట్టినింటికి పుట్టినింటికి
వన్నె తెస్తావని
నాయనమ్మ శిక్షణ
ఆ వృద్ధ దంపతులకి
నువ్వందించేసంరక్షణ
ఈవయసులో మీ తరానికి
సాధ్యం కావు ఎవరికీ
అభినందనలు
శుభాకాంక్షలు నీకు
మా అందరివీ
అమ్మ
4.7.2012
Sunday, 1 July 2012
somayaajula
యజ్ఞం చేసినవాడు సోమయాజి
సోమయాజుల వెంకట శంకర సిద్ధార్థ
హరిహరులను నీలో నిలుపుకొని
యజ్ఞం మొదలెట్టేవు
అమ్మా నాన్నలు నీకు పేరు పెట్టగానే
యజ్ఞం కొనసాగించేవు
ఇంజనీరింగ్ విద్యార్థిగా
అమ్మకి దూరంగా
పశ్చిమాన వెలుగుతున్న తూరుపు సూరీడుగా
యజ్ఞం కొనసాగిస్తున్నావు సృజనాత్మకంగా
సృజనాత్మవై
జగతి గర్వించే వైద్యురాలిని సృజియింప
యజ్ఞం కొనసాగిస్తావు
అమ్మా నాన్నల తరగని ప్రేమతో
చిరాయువువై
యజ్ఞం కొనసాగించు
అమ్మకడుపు చల్లగా
అత్తా కడుపు చల్లగా
చేపట్టిన సిరి సిరులు కురుప శ్రీహరివై
సిద్దార్థ వై
విష్ణు సహస్ర నామ వైభవం
నీ పేరులో వెలుగొంద
యజ్ఞం కొనసాగించు
సోమయాజుల వెంకట శంకర సిద్ధార్థా
నీ జీవితం యజ్ఞమంత ఉన్నతముఉజ్జ్వలము
అతి పవిత్ర కార్యమై వెలుగొంద
శుభా కాంక్షలతో
భవానీ సుబ్రహ్మణ్యం
8.5.2012
సోమయాజుల వెంకట శంకర సిద్ధార్థ
హరిహరులను నీలో నిలుపుకొని
యజ్ఞం మొదలెట్టేవు
అమ్మా నాన్నలు నీకు పేరు పెట్టగానే
యజ్ఞం కొనసాగించేవు
ఇంజనీరింగ్ విద్యార్థిగా
అమ్మకి దూరంగా
పశ్చిమాన వెలుగుతున్న తూరుపు సూరీడుగా
యజ్ఞం కొనసాగిస్తున్నావు సృజనాత్మకంగా
సృజనాత్మవై
జగతి గర్వించే వైద్యురాలిని సృజియింప
యజ్ఞం కొనసాగిస్తావు
అమ్మా నాన్నల తరగని ప్రేమతో
చిరాయువువై
యజ్ఞం కొనసాగించు
అమ్మకడుపు చల్లగా
అత్తా కడుపు చల్లగా
చేపట్టిన సిరి సిరులు కురుప శ్రీహరివై
సిద్దార్థ వై
విష్ణు సహస్ర నామ వైభవం
నీ పేరులో వెలుగొంద
యజ్ఞం కొనసాగించు
సోమయాజుల వెంకట శంకర సిద్ధార్థా
నీ జీవితం యజ్ఞమంత ఉన్నతముఉజ్జ్వలము
అతి పవిత్ర కార్యమై వెలుగొంద
శుభా కాంక్షలతో
భవానీ సుబ్రహ్మణ్యం
8.5.2012
Sunday, 24 June 2012
padunu
అత్తగారు పదును
ఆవకాయ పదును
కత్తిపీట పదును
ఎత్తిపొడుపు పదును
ప్రేమ పదును
పెళ్లి పదును
స్నేహం పదును
ద్వేషం పదును
వృత్తి పదును
ఊపిరి పదును
పదును పెడదాం
మన ఆలోచనలకి
అక్షరాలకి
ఆయుధానికి
25.6.2012
ఆవకాయ పదును
కత్తిపీట పదును
ఎత్తిపొడుపు పదును
ప్రేమ పదును
పెళ్లి పదును
స్నేహం పదును
ద్వేషం పదును
వృత్తి పదును
ఊపిరి పదును
పదును పెడదాం
మన ఆలోచనలకి
అక్షరాలకి
ఆయుధానికి
25.6.2012
Friday, 22 June 2012
asrutarpanam
అనుకున్నా నందన నామ వత్సరం
ఉక్కునగరాన్ని నందనవనంగా మారుస్తుందని
ఆనందం డెందాన సుర గంగై
పరవళ్ళు తొక్కుతుందని
మాకేం తెలుసు అది చావు దెబ్బ తీస్తుందని
మృతుల సంఖ్య పంతొనిమిదని చావుకబురు
చల్లగా చెబుతుందని
ప్రాణవాయువే ప్రాణాలు హరించింది
ఒత్తిడి పెంచేరని ఆగ్రహించి
చిన్న పొరపాటుకి అంతదండనా
సగర్వంగా సమున్నతంగా నిలిచే విశాఖ ఉక్కు
ఖిన్నమై దీనమై చిద్రమై
కన్నీర మున్నేరయింది
తండ్రి దూరమయిన చిన్నారిని
కొడుకు దూరమయిన తండ్రిని తల్లిని
మరిచేదెలా
సగర్వంగా తల ఎత్తే వేళ
అగ్నికీలలకాహుతయ్యారు
సమిధలయ్యారు తాముసహితం
పారిశ్రామిక యజ్ఞంలో
శ్రమయజ్ఞంలో
మరువము మీ త్యాగాలను
ఎన్నటికీ
అశ్రుతర్పణం ఇదే
మీ ఆత్మ శాంతికి
భవానీరామ్
23..6.2012
ఉక్కునగరాన్ని నందనవనంగా మారుస్తుందని
ఆనందం డెందాన సుర గంగై
పరవళ్ళు తొక్కుతుందని
మాకేం తెలుసు అది చావు దెబ్బ తీస్తుందని
మృతుల సంఖ్య పంతొనిమిదని చావుకబురు
చల్లగా చెబుతుందని
ప్రాణవాయువే ప్రాణాలు హరించింది
ఒత్తిడి పెంచేరని ఆగ్రహించి
చిన్న పొరపాటుకి అంతదండనా
సగర్వంగా సమున్నతంగా నిలిచే విశాఖ ఉక్కు
ఖిన్నమై దీనమై చిద్రమై
కన్నీర మున్నేరయింది
తండ్రి దూరమయిన చిన్నారిని
కొడుకు దూరమయిన తండ్రిని తల్లిని
మరిచేదెలా
సగర్వంగా తల ఎత్తే వేళ
అగ్నికీలలకాహుతయ్యారు
సమిధలయ్యారు తాముసహితం
పారిశ్రామిక యజ్ఞంలో
శ్రమయజ్ఞంలో
మరువము మీ త్యాగాలను
ఎన్నటికీ
అశ్రుతర్పణం ఇదే
మీ ఆత్మ శాంతికి
భవానీరామ్
23..6.2012
Monday, 18 June 2012
rajatotsava sambaram
నువ్వు ప్రేమతో పెంచుకునే మొక్కలంత
పచ్చదనం మీ సంసారం
నీ గలగల నవ్వుల గోదారంత
తీయదనం మీ సంసారం
ముద్దుల మేనకోడలిని
ముద్దాడక ముందు కలిసి
మేనకోడలితో ఎదిగి
రజతోత్సవ సంబరాల సంసారం
నిరంతరం సాగనీ కొనసాగనీ
వసంతమై సుమధుర యుగళ గీతమై
నిత్య నూతనంగా
నిఖిల ప్రపంచమే మీ ప్రపంచం
మీ వాత్సల్యమే తానై
వత్స తానయ్యాడు శ్రీవత్స
వైవాహిక జీవిత రజతోత్సవ సంబరాలు
ఎద ఉప్పొంగి అంబరమంట
అందుకోండి మా అందరి శుభాకాంక్షలు
పెద్దల శుభాశీస్సులు
*అన్నా వదినలకు ప్రేమతో
2.6.2012
పచ్చదనం మీ సంసారం
నీ గలగల నవ్వుల గోదారంత
తీయదనం మీ సంసారం
ముద్దుల మేనకోడలిని
ముద్దాడక ముందు కలిసి
మేనకోడలితో ఎదిగి
రజతోత్సవ సంబరాల సంసారం
నిరంతరం సాగనీ కొనసాగనీ
వసంతమై సుమధుర యుగళ గీతమై
నిత్య నూతనంగా
నిఖిల ప్రపంచమే మీ ప్రపంచం
మీ వాత్సల్యమే తానై
వత్స తానయ్యాడు శ్రీవత్స
వైవాహిక జీవిత రజతోత్సవ సంబరాలు
ఎద ఉప్పొంగి అంబరమంట
అందుకోండి మా అందరి శుభాకాంక్షలు
పెద్దల శుభాశీస్సులు
*అన్నా వదినలకు ప్రేమతో
2.6.2012
Thursday, 3 May 2012
nela baaludu
అమ్మా నాన్న ని అడిగి మరీ
ముచ్చట పడి బుద్దుడిని
మా ఇంటికి తెచ్చు కున్నప్పుడు
తెలియనేలేదు
సిద్దార్ధుడే మా ఇంటి తలుపు తడతాడని
డాక్టరమ్మ జీవితంలోకి వస్తాడని
ఏ నోము ఫలమో ఏ పూజ వరమో
సీతమ్మ నట్టింట పారాడే చిన్ని కృష్ణుడు
అయినాడు తాను
రామయ్య చిటికిన వేలు పట్టి నడిచాడు తాను
మా అందరి శుభాశీస్సులు
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ నెలబాలునికి మన సిద్దార్దకి
3.5.2012
keep it up
అలసట మోములో
కనపడనీక పోవడం
చిరునవ్వు చెధరనీక పోవడం
అందరికీ అది అబ్బురం
అలసిపోతూనే recharge అవడం
ఆశ్చర్యార్ధకం నాకు
ఆజన్మాంతం కొనసాగనీ
అదే ప్రవృత్తి
3.5.2012
vesavi
వేసవి కాలం
సెలవులు మల్లెలు
ఇష్టమైనవే రెండూ
computer ముందు కూర్చుంటే
విశ్రాంతి నోటికీ కాళ్ళకి
కానీ అలసట కంటికి
నొప్పులు చేతికి
ఎడమ చేయి సపర్యలు చేయాలి కుడి చేతికి
స్వేచ్చ మనసును తాకి
హాయినిస్తుంది మలయమారుతంలా
మటు మాయమౌతుంది
నీటిబుడగలా
4.5.2012
Thursday, 26 April 2012
vagdevi-nee varaalajallu
1983-M.A.(POLITICAL SCIENCE)
1985-M.Ed
1990-2000-M.A-ENGLISH,ECONOMICS,HISTORY,TELUGU
2000-2010-M.Phil.,Ph.D.
1985-M.Ed
1990-2000-M.A-ENGLISH,ECONOMICS,HISTORY,TELUGU
2000-2010-M.Phil.,Ph.D.
dolaayamaanam
కలల అలలు
సంతోష తీరం తాకిన వేళ
జీవనదికి పుష్కర సంబరం
రెపరెపలాడిన విజయ కేతనం
అనందోద్వేగాల నడుమ ఎద డోలాయమానం
convocation కి వెళ్తూ
on board godavari
19.4.2012
Saturday, 7 April 2012
teerchididduko
రాసుకో నీ తలరాత నీకు నువ్వే
తీర్చిదిద్దుకో నీ బంగారు భవిత
మార్చుకో నీ గీత
చేసుకో ఆశావాదం నే బతుకు బాట
7.5.2012
8.20p.m.
తీర్చిదిద్దుకో నీ బంగారు భవిత
మార్చుకో నీ గీత
చేసుకో ఆశావాదం నే బతుకు బాట
7.5.2012
8.20p.m.
Thursday, 5 April 2012
asamkhyakam
విశాఖ వైజ్ఞానిక ప్రదర్శన లో తొలిపాదం
ఆరంగేట్రం తో మలిపాదం
సిఎ ఇంటర్ తో మూడో పాదం
వామనుడు మూడు పాదాలే కోరేడు
కానీ నీకు లభిస్తాయి అసంఖ్యాక
పాదాలూ అవకాశాలూ
వాడుకో అన్నిటినీ
సద్వినియోగం చేసుకో
తనకు తానుసహాయంచేసుకునేవాడు
రాణిస్తాడు ఎప్పుడూ
నేను గర్వించే మా అన్నదమ్ముల్లా
మీ మామాజీలా
కిట్టీ తెలుసు నాకు
అదే నీబాట అని
శుభాకాంక్షలు
ఎల్లప్పుడూ నీకు మా అందరివీ
6.4.2012
ఆరంగేట్రం తో మలిపాదం
సిఎ ఇంటర్ తో మూడో పాదం
వామనుడు మూడు పాదాలే కోరేడు
కానీ నీకు లభిస్తాయి అసంఖ్యాక
పాదాలూ అవకాశాలూ
వాడుకో అన్నిటినీ
సద్వినియోగం చేసుకో
తనకు తానుసహాయంచేసుకునేవాడు
రాణిస్తాడు ఎప్పుడూ
నేను గర్వించే మా అన్నదమ్ముల్లా
మీ మామాజీలా
కిట్టీ తెలుసు నాకు
అదే నీబాట అని
శుభాకాంక్షలు
ఎల్లప్పుడూ నీకు మా అందరివీ
6.4.2012
keerthi ghana keerti
నాన్న దగ్గిర నెల జీతం తీసుకొని
నాన్నకే కానుకనందించిన చిట్టి మేనకోడలా
తొలిజీతంతో తొలకరి కానుకల జల్లు కురిపావా
అమ్మపై అమ్మమ్మపై నానమ్మపై
తాతపై చిట్టి చెల్లి పై
రహస్యంగా వ్యూహం పన్ని
రాజసంగా అమలుపరచడం
నీదగ్గిరే నేర్వాలి మరి ఎవరైనా
త్రిశూల్ లోలా బోర్డ్ లు కూల్చకున్నా
ఎదగాలి అమితాబ్ లా
ఎదగాలి తండ్రిని మించిన తనయగా
అత్త సంసిద్ధం ఎప్పుడూ కీర్తి
ఘనకీర్తి ప్రస్తుతించ
5.4.2012
నాన్నకే కానుకనందించిన చిట్టి మేనకోడలా
తొలిజీతంతో తొలకరి కానుకల జల్లు కురిపావా
అమ్మపై అమ్మమ్మపై నానమ్మపై
తాతపై చిట్టి చెల్లి పై
రహస్యంగా వ్యూహం పన్ని
రాజసంగా అమలుపరచడం
నీదగ్గిరే నేర్వాలి మరి ఎవరైనా
త్రిశూల్ లోలా బోర్డ్ లు కూల్చకున్నా
ఎదగాలి అమితాబ్ లా
ఎదగాలి తండ్రిని మించిన తనయగా
అత్త సంసిద్ధం ఎప్పుడూ కీర్తి
ఘనకీర్తి ప్రస్తుతించ
5.4.2012
Wednesday, 28 March 2012
premato
చిట్టి నేస్తం
మీకోసం చిన్ని కవిత రాయనా
గానకోకిల మీరు
స్వచ్చమైనది మీ హృదయం
పాపాయి మనసు మీది
తెలుసు నాకు మీ హృదయ సౌంధర్యం
మీ మాతృత్వం అందుకుంది
సోనూ దీపూలను వరాలుగా
ఆ వెన్నెలమ్మ మీరు
ఆప్యాయతల జల్లు మీరు
సుస్వరాల కోయిలమ్మ మీరు
మాటల జలపాతం మీరు
మన స్నేహంలో పదాలు నేర్చుకున్నా
స్వరాలూ నేర్చుకున్నా
బాల్యమంటే మీరు
మీరంటే నా బాల్యం
స్నేహమంటే మీరు
నేస్తమంటే మీరు
మీ స్నేహం ఆకాశగంగ
ఎదలో తొలకరి ఎల్లప్పుడూ
ప్రేమతో
మీనేస్తం
15.5.2010
మీకోసం చిన్ని కవిత రాయనా
గానకోకిల మీరు
స్వచ్చమైనది మీ హృదయం
పాపాయి మనసు మీది
తెలుసు నాకు మీ హృదయ సౌంధర్యం
మీ మాతృత్వం అందుకుంది
సోనూ దీపూలను వరాలుగా
ఆ వెన్నెలమ్మ మీరు
ఆప్యాయతల జల్లు మీరు
సుస్వరాల కోయిలమ్మ మీరు
మాటల జలపాతం మీరు
మన స్నేహంలో పదాలు నేర్చుకున్నా
స్వరాలూ నేర్చుకున్నా
బాల్యమంటే మీరు
మీరంటే నా బాల్యం
స్నేహమంటే మీరు
నేస్తమంటే మీరు
మీ స్నేహం ఆకాశగంగ
ఎదలో తొలకరి ఎల్లప్పుడూ
ప్రేమతో
మీనేస్తం
15.5.2010
Sunday, 18 March 2012
sambaraalu ambaramamte
మూడు తరాలు ముప్పేటగా
కలిసాయి సంగమంగా
శుభకార్య సాక్షీభూతంగా
అత్తలు మామలు
అయ్యలు అమ్మలు
అమ్మమ్మ నానమ్మ తాతలు
అన్నాచెల్లెలు వదిన బావలు
స్నేహితులు సన్నిహితులు
తరలివచ్చేరు అత్తమామలు
తనయునితో బంధుమిత్రులతో
సంబరాలు అంబరమంటే
శుభాకాంక్షలు శుభాక్షితలయ్యే
అవధులులేవు
అమ్మాయి ఆనందానికి
కావాలి అదే తన బంగరు భవితకి
రాచబాట
18.3.2012
కలిసాయి సంగమంగా
శుభకార్య సాక్షీభూతంగా
అత్తలు మామలు
అయ్యలు అమ్మలు
అమ్మమ్మ నానమ్మ తాతలు
అన్నాచెల్లెలు వదిన బావలు
స్నేహితులు సన్నిహితులు
తరలివచ్చేరు అత్తమామలు
తనయునితో బంధుమిత్రులతో
సంబరాలు అంబరమంటే
శుభాకాంక్షలు శుభాక్షితలయ్యే
అవధులులేవు
అమ్మాయి ఆనందానికి
కావాలి అదే తన బంగరు భవితకి
రాచబాట
18.3.2012
samsiddhamavudaam
అనుకోకుండా మీద పడతాయి
ప్రమాదాలు ఆకస్మిక మరణాలు
మనం మానసికంగా సంసిద్ధంగా లేకున్నా
స్వీకరించాలి తప్పనిసరిగా
శుభ కార్యాలకై
బంధుమిత్రుల సమాగమానికై
ఎదురు చూస్తాం ఎన్నాళ్ళో
సందళ్ళ నడుమ
వినిపించీ వినిపించని కనిపించీ కనిపించని
సన్నని అపశ్రుతులు
అనుకోకుండా ఆకస్మాత్తుగానే
పైన పడతాయి యివికూడా
స్వీకరించక తప్పదు హృదయ పూర్వకంగా
సంసిద్ధమవుదాం దేనికైనా
అపశ్రుతులకైనా
18.3.2012
ప్రమాదాలు ఆకస్మిక మరణాలు
మనం మానసికంగా సంసిద్ధంగా లేకున్నా
స్వీకరించాలి తప్పనిసరిగా
శుభ కార్యాలకై
బంధుమిత్రుల సమాగమానికై
ఎదురు చూస్తాం ఎన్నాళ్ళో
సందళ్ళ నడుమ
వినిపించీ వినిపించని కనిపించీ కనిపించని
సన్నని అపశ్రుతులు
అనుకోకుండా ఆకస్మాత్తుగానే
పైన పడతాయి యివికూడా
స్వీకరించక తప్పదు హృదయ పూర్వకంగా
సంసిద్ధమవుదాం దేనికైనా
అపశ్రుతులకైనా
18.3.2012
Monday, 27 February 2012
aluperugani prayaanam
మూడో దశకంలో
అలుపెరుగని ప్రయాణం
నిత్య నూతనమై
నూతనోత్తేజమై
ఓ సుమధుర యుగళమై
చలువ పందిరి నీడన
అలుపెరుగని ప్రయాణం
నీతో నా ప్రయాణం
వెన్నెలే గాని
తెలియవు గ్రీష్మ తాపాలు
తెలియవు దైన్యం నైరాశ్యం
వైవాహిక జీవన సౌందర్యం
అందాల కానుక
అద్భుతవరం
ప్రయాణం యిద్దరుగా మొదలై
నలుగురిగా కొనసాగితే
అది అమృత ఫలం
28.2.2012
అలుపెరుగని ప్రయాణం
నిత్య నూతనమై
నూతనోత్తేజమై
ఓ సుమధుర యుగళమై
చలువ పందిరి నీడన
అలుపెరుగని ప్రయాణం
నీతో నా ప్రయాణం
వెన్నెలే గాని
తెలియవు గ్రీష్మ తాపాలు
తెలియవు దైన్యం నైరాశ్యం
వైవాహిక జీవన సౌందర్యం
అందాల కానుక
అద్భుతవరం
ప్రయాణం యిద్దరుగా మొదలై
నలుగురిగా కొనసాగితే
అది అమృత ఫలం
28.2.2012
Friday, 17 February 2012
twinkle twinkle
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్
పెరిగి పెద్దయ్యాక కూడా తారలే మీరు
తల్లి తండ్రులకు
ఉపాధ్యాయులకు
ఉపాధ్యాయుల యెదలో
వేల వేల తారలు
తళుకులీనే తారలు
తమ విద్యార్ధినీ విద్యార్ధులు
ఎక్కడున్నా ఎప్పటికయినా
17.2.2012
పెరిగి పెద్దయ్యాక కూడా తారలే మీరు
తల్లి తండ్రులకు
ఉపాధ్యాయులకు
ఉపాధ్యాయుల యెదలో
వేల వేల తారలు
తళుకులీనే తారలు
తమ విద్యార్ధినీ విద్యార్ధులు
ఎక్కడున్నా ఎప్పటికయినా
17.2.2012
Tuesday, 7 February 2012
jeevita edarilo
జీవిత ఎడారిలో
ఒంటరి బాటసారులం
కలుసుకుంటాం
మిత్రులమై
హితులమై సన్నిహితులమై
రక్త సంబంధమై
తీయని అనుబంధమై
రాలిపోతాం తోకచుక్కలమై
నిశ్శబ్దమై
మిగిలిపోతాం తారలమై ద్రువతారలమై
పదిలమై
మనవారి ఎదలలో
8.2.2.12
మనవారి ఎదలలో
8.2.2.12
Friday, 20 January 2012
rahukaalam
శనివారం
సాయంత్రం నాలుగుకి
మొదలైన నిద్ర
సోమవారం పొద్దున్న ఆరుకి ముగిస్తే
ముప్ఫైఎనిమిది గంటల సెలవు నిద్ర
ఎంతానందం
మరీ అత్యాశ
శనివారం రాత్రి తొమ్మిది
సోమవారం పొద్దున్న ఆరు
ముప్పై మూడు గంటల నిద్ర
కోరిక బాగుంది
శనివారం రాత్రి తొమ్మిది
ఆదివారం పగలు పది
పదమూడు గంటల నిద్ర
ఈ కల కూడా అందంగా వుంది
శనివారం రాత్రి తొమ్మిది
ఆదివారం పగలు ఎనిమిది
ఒకటి తక్కువ పన్నెండు
ఇదీ బాగానే వుంది పదకొండు
శనివారం రాత్రి తొమ్మిది
ఆదివారం పగలు ఆరు
తొమ్మిది గంటల నిద్ర
నాకు ఓకే అమ్మకి ఓకే
శనివారం రాత్రి పదకొండు
ఆదివారం పగలు ఆరు
ఏడుగంటలు ఇదయినా చాలు
శుక్రవారం రాత్రి పదకొండు
పన్నెండు దాటి రెండు
not at all o.k.
అయినా తప్పదు
దుర్ముహుర్తంలోతెలివి వచ్చేస్తే
దుర్ముహుర్తంలోతెలివి వచ్చేస్తే
రాహుకాలంలో మేలుకుంటే
మెదడు పదునెక్కితే
కలం చకచకసాగితే
సుముహర్తమే
అమృత ఘడియలే అవి
21.1.2012
Sunday, 15 January 2012
chitikedu
ఇలలో స్వర్గం ఇల్లు
మేడైనా గూడైనా
వెచ్చదనం అక్కడే
సినిమా అయినా షికారయినా
పుట్టిల్లయినా అత్తవారిల్లయినా
ఇంటికి చేరి ఊపిరి పీల్చుకుంటాం
హాయిగా స్వేచ్చగా
ఎసిఅయినా ఎయిర్ వేస్ అయినా
హిల్ స్టేషన్ అయినా పిలిగ్రిమేజ్ అయినా
ఇంటికి చేరాకే స్వర్గ సౌఖ్యాలు
రోజంతా శ్రమించి
ఇల్లు చేరినా
సాఫ్ట్ వేర్ కి సెలవు పెట్టి
అమ్మ ఒడి చేరినా
గువ్వ పిట్టకి కూసింత విశ్రాంతి ఇంటనే
చిటికెడు స్వర్గ సౌఖ్యాల నడుమ
అవిశ్రాంత పోరాటమే జీవితం
16.1.2012
మేడైనా గూడైనా
వెచ్చదనం అక్కడే
సినిమా అయినా షికారయినా
పుట్టిల్లయినా అత్తవారిల్లయినా
ఇంటికి చేరి ఊపిరి పీల్చుకుంటాం
హాయిగా స్వేచ్చగా
ఎసిఅయినా ఎయిర్ వేస్ అయినా
హిల్ స్టేషన్ అయినా పిలిగ్రిమేజ్ అయినా
ఇంటికి చేరాకే స్వర్గ సౌఖ్యాలు
రోజంతా శ్రమించి
ఇల్లు చేరినా
సాఫ్ట్ వేర్ కి సెలవు పెట్టి
అమ్మ ఒడి చేరినా
గువ్వ పిట్టకి కూసింత విశ్రాంతి ఇంటనే
చిటికెడు స్వర్గ సౌఖ్యాల నడుమ
అవిశ్రాంత పోరాటమే జీవితం
16.1.2012
Thursday, 12 January 2012
calender
క్యాలెండరు లో అన్నీ
రామనవమి
రంజాన్
క్రిస్మస్
సంక్రాంతి
బుద్ధ పూర్ణిమ
నాగుల చవితి
మహావీర జయంతి
కృష్ణాష్టమి
దుర్ముహూర్తం
అమృత ఘడియలు
రాహుకాలం
వర్జ్యం
తిది
సెలవులు
పండుగలు
పుట్టినరోజు
పెళ్లిరోజు
ప్రతి సంవత్సరం
అన్నీ సర్వ సాధారణం
కానీ ప్రతి రోజూ
ప్రత్యేకమే
కొత్త వత్సరంలో
అందుకే మోజు
కొత్త క్యాలెండరంటే
రామనవమి
రంజాన్
క్రిస్మస్
సంక్రాంతి
బుద్ధ పూర్ణిమ
నాగుల చవితి
మహావీర జయంతి
కృష్ణాష్టమి
దుర్ముహూర్తం
అమృత ఘడియలు
రాహుకాలం
వర్జ్యం
తిది
సెలవులు
పండుగలు
పుట్టినరోజు
పెళ్లిరోజు
ప్రతి సంవత్సరం
అన్నీ సర్వ సాధారణం
కానీ ప్రతి రోజూ
ప్రత్యేకమే
కొత్త వత్సరంలో
అందుకే మోజు
కొత్త క్యాలెండరంటే
Subscribe to:
Comments (Atom)