Sunday, 9 December 2012

nee kosam eduru choostu

లాంగ్ టర్మ్ కోచింగ్ లో
చేరతానన్నావు
కెరీర్ కోసం

జైలు జీవితంలా
భావించావు చేరిన క్షణం నుండి
నరకాన్ని అనుభవించే ఉంటావు
నిద్రకళ్ళతో పరీక్షలు రాయాలంటే

నీ దగ్గిరకి వచ్చి తిరిగి వచ్చినపుడు
నీ ఆక్రందన రోదన మరిచిపోం

భీమవరం నుండి
పరిగెత్తు కొచ్చే దానివి
ఇంటికి వచ్చినప్పుడల్లా ఎంత ఆనందం

ఈరోజు నీమార్గం
నువ్వే నిర్దేశించుకున్నావు 
నీ స్వర్గం నీ జీవిత సహచరునితోనే
ఆ జన్మాంత స్నేహితునితోనే

అమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంటుంది
నేను ఇక్కడే
నీకోసం ఎదురు చూస్తూ
నా తల్లి దుఃఖం నాకు తెలియదు
నాజీవిత సహచరునితో నేను వచ్చేసినపుడు
అమ్మ దుఃఖం ఇంతేనేమో 

అమ్మ
10.12.2012

   

No comments:

Post a Comment