Sunday, 15 January 2012

chitikedu

ఇలలో స్వర్గం ఇల్లు
మేడైనా గూడైనా
వెచ్చదనం అక్కడే

సినిమా అయినా షికారయినా
పుట్టిల్లయినా అత్తవారిల్లయినా
ఇంటికి చేరి ఊపిరి పీల్చుకుంటాం
హాయిగా స్వేచ్చగా

ఎసిఅయినా ఎయిర్ వేస్ అయినా
హిల్ స్టేషన్ అయినా పిలిగ్రిమేజ్  అయినా
ఇంటికి చేరాకే స్వర్గ సౌఖ్యాలు

రోజంతా శ్రమించి
ఇల్లు చేరినా
సాఫ్ట్ వేర్ కి సెలవు పెట్టి
అమ్మ ఒడి చేరినా
గువ్వ  పిట్టకి కూసింత విశ్రాంతి ఇంటనే

చిటికెడు స్వర్గ సౌఖ్యాల నడుమ
అవిశ్రాంత పోరాటమే జీవితం 

16.1.2012

1 comment: