Sunday, 18 March 2012

sambaraalu ambaramamte

మూడు తరాలు ముప్పేటగా
కలిసాయి సంగమంగా
శుభకార్య సాక్షీభూతంగా

అత్తలు మామలు
అయ్యలు అమ్మలు

అమ్మమ్మ నానమ్మ తాతలు
అన్నాచెల్లెలు వదిన బావలు
స్నేహితులు సన్నిహితులు

తరలివచ్చేరు అత్తమామలు
తనయునితో బంధుమిత్రులతో
సంబరాలు అంబరమంటే
శుభాకాంక్షలు శుభాక్షితలయ్యే

అవధులులేవు
అమ్మాయి ఆనందానికి
కావాలి అదే తన బంగరు భవితకి
రాచబాట

18.3.2012
  

No comments:

Post a Comment