Friday, 22 June 2012

asrutarpanam

అనుకున్నా నందన నామ వత్సరం
ఉక్కునగరాన్ని నందనవనంగా మారుస్తుందని
ఆనందం డెందాన సుర గంగై
 పరవళ్ళు తొక్కుతుందని

మాకేం తెలుసు అది చావు దెబ్బ తీస్తుందని
మృతుల సంఖ్య పంతొనిమిదని చావుకబురు
చల్లగా చెబుతుందని
ప్రాణవాయువే ప్రాణాలు హరించింది
ఒత్తిడి పెంచేరని ఆగ్రహించి

చిన్న పొరపాటుకి అంతదండనా
సగర్వంగా సమున్నతంగా నిలిచే విశాఖ ఉక్కు
ఖిన్నమై దీనమై చిద్రమై
కన్నీర మున్నేరయింది

తండ్రి దూరమయిన చిన్నారిని
కొడుకు దూరమయిన తండ్రిని తల్లిని
మరిచేదెలా

సగర్వంగా తల ఎత్తే వేళ
అగ్నికీలలకాహుతయ్యారు
సమిధలయ్యారు తాముసహితం
పారిశ్రామిక యజ్ఞంలో
శ్రమయజ్ఞంలో

మరువము మీ త్యాగాలను
ఎన్నటికీ
అశ్రుతర్పణం ఇదే
మీ ఆత్మ శాంతికి

భవానీరామ్
23..6.2012

No comments:

Post a Comment