ఆయన సైన్యం లో
పనిచేస్తున్నారు
పెద్ద ఉద్యోగమే
నేను
మా పాప
అత్తమామలు
మా ఊళ్ళో
ఆయన దగ్గర నుండి
ఉత్తరాలు
అప్పుడప్పుడు వచ్చేవి
ఆరోజు ఇంట్లో పండగే
ఉత్తరం రాసా
పోస్ట్ చేసా
అని ఫోన్ లో చెప్పారు
ఎప్పటి లాగే
ఆ ఉత్తరం నన్ను
చేరనేలేదు
అడుగుదామంటే
ఆయనే
మమ్మల్ని చేరలేదు
కన్నీళ్ళతో ఎదురు చూస్తున్నా
ఉత్తరం కోసం
ఆయన కోసం
10.9.25
No comments:
Post a Comment