ఎడబాటు
వృద్ధ దంపతుల మధ్య
ఒకరేమో అమెరికా
ఒకరేమో ఆస్ట్రేలియా
కొడుకులిద్దరూ
పంచుకున్నారు
మనవరాలు జాలితో
వీడియో కాల్ లో
కలుపుతుంది
కన్నీళ్ళతో
పలకరించుకుంటారు
అనారోగ్యాల గురించి
తెలుసుకుంటారు
వారి చూపుల నిండా ప్రేమే
మనవరాలికి ధన్యవాదాలు
చెప్తారు
వారు కలిసే రోజు
ఎప్పటికైనా వస్తుందా
అని ఎదురు చూస్తుంటారు
9.9.25
No comments:
Post a Comment