Wednesday, 17 September 2025

నదీమతల్లి

 

తేది: 14.9.25
శీర్షిక:  నదీమతల్లి

మీకు తాగే నీరిస్తా
చల్లని గాలిస్తా
మీ పొలాలకి నీరందిస్తా
నా నీటిలో స్నానాలు చేసి
అందరికీ  రోగాలు తేకండి
అన్నిచోటలా కైలాసభూములు
ఉన్నాయి
మృతదేహాలు గంగమ్మ తల్లిలోనే
పడేయకండి
నా పుష్కరాలకి
తొక్కిసలాటలతో
జనం ప్రాణాలు తీయకండి
నేను ప్రవహించిన ప్రాంతాలు
నాగరికత  కేంద్రాలుగా
అభివృద్ధి  చెందాయి
తిరోగమనానికి తావీయక
మునుముందుకు సాగిపొండి

ఇది నా స్వీయ కవిత


చిన్ని  చిన్ని సరదాలు

 

తేది:2.8.25
శీర్షిక: చిన్ని చిన్ని సరదాలు

స్నేహితులతో ముచ్చట్లు
అట్లతద్ది  ఆటలు
అన్నదమ్ములతో దెబ్బలాటలు
రేడియోలో పాటలు
స్నేహితులతో
చూసిన చలనచిత్రాలు
కెరటాలతో ఆడిన
ఆటలు
అమ్మానాన్నలతో
ప్రయాణాలు
పెళ్లి నాటి ముచ్చటలు
తలచి తలచి నవ్వుకోవడం
కన్నబిడ్డల పెంపకం
మనవల కబుర్లు
పుస్తకాలు  చదవడం
అంశం కనపడగానే
కవిత రాయడం
అన్నీ చిన్ని చిన్ని
సరదాలే

ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని


విజయకేతనం

 

నగరం నడిబొడ్డున
అంతా  హడావుడి
అంతా చైతన్యం
కారులు
బైకులు
షాపులు
మాల్స్
కిక్కిరిసిన జనం
జనం కోసం హోటళ్ళు
ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్
నగరం నడిబొడ్డు
అంటే
నగరానికే
విజయకేతనం

17.9.25

విలయతాండవం

 

సముద్రపు గుండెలపై
ఎన్నెన్నో  ఓడలు
ఎన్నెన్నో   జలచరాలు
నూతన ప్రాంతాలని
సంపదలని  వెతుకుతూ
ఎందరో ఓడలమీద
ప్రయాణాలు
అపాయాలతో
మృతదేహాలుగ
మారిన వేలవేల
ప్రయాణికులు
సమూద్రం పోటెత్తింది
అంటే ఆ గుండెల
విలయతాండవమే

16.9.25

ఊహాలోకం

 అదే లోకం లో

ఆనందాల హరివిల్లు 

సంతోషాల విరిజల్లు

చిన్నారుల కేరింతలు

యువతీ యువకుల

ఆటపాటలు

విద్యని తపస్సుగా

పరిగణించే

సరస్వతీ పుత్రులు

అసమానతలు లేని

లోకం

అనాధలు లేని

లోకం

కళకళలాడే మొహాలతో

వృద్ధులు 

అదేలోకం

ఇదేలోకం అయితే 

ఎంత హాయి

14.9.25

Friday, 12 September 2025

చిరస్థాయి

 

ఆది మానవుడి నుండి
ఆధునిక  మానవుడి  వరకు
ఎన్నెన్నో  కట్టడాలు
సింధు నాగరికత  కట్టడాలు
హంపీ కట్టడాలు
షాజహాన్ కట్టడాలు
బ్రిటిష్ దొరల కట్టడాలు
ధనవంతుల కట్టడాలు
ప్రభుత్వాల కట్టడాలు
గ్రంధాలయాలు
విజ్ఞానకేంద్రాలు
కట్టడాలు  ఎంత
దృఢంగా ఉంటే
అంత చిరస్థాయిగా
చిరకాలం నిలుస్థాయి


Thursday, 11 September 2025

ద్వీపం లో తానే రాజు

 

ఒకానొక ద్వీపం
ఒకే ఒక మనిషి
పడవ ఒడ్డుకు
చేరిస్తే చేరేడు అక్కడికి
దొరికిన ఆహారం తిన్నాడు
కర్రలతో తనే ఇల్లు
కట్టుకున్నాడు
ద్వీపమంతా తిరిగాడు
అందాలు చూసి ఆనందించేడు
ద్వీపంలో  నలువైపులా
ఎర్రజెండాలు ఎగురవేసాడు
ఏ పడవైనా  రాకపోతుందా అని
ఒక రోజు అనుకోకుండా
పెద్ద పడవ అటువైపు వచ్చింది
అతనిని సంరక్షితంగా
తన వాళ్ళ దగ్గరకి  చేర్చింది


మారణహోమం

 

కొన్ని పానీయాలు
విషం విషం
మరికొన్ని  తాపీగా
ప్రాణం హరిస్తాయి
ప్రభుత్వం  ఆ పానీయాలు
నిషేధించాలి
పానీయ  సంస్థలతో
కుమ్మక్కై ప్రజల ప్రాణాలు
హరించకూడదు
కొన్ని వేల
కుటుంబాల క్షోభకి
కారణం కాకూడదు

11.9.25

ఎదురుచూపు

 

ఆయన సైన్యం లో
పనిచేస్తున్నారు
పెద్ద ఉద్యోగమే
నేను
మా పాప
అత్తమామలు
మా ఊళ్ళో
ఆయన దగ్గర నుండి
ఉత్తరాలు
అప్పుడప్పుడు  వచ్చేవి
ఆరోజు  ఇంట్లో  పండగే
ఉత్తరం రాసా
పోస్ట్ చేసా
అని ఫోన్ లో చెప్పారు
ఎప్పటి లాగే
ఆ ఉత్తరం  నన్ను
చేరనేలేదు
అడుగుదామంటే
ఆయనే
మమ్మల్ని చేరలేదు
కన్నీళ్ళతో ఎదురు చూస్తున్నా
ఉత్తరం కోసం
ఆయన కోసం

10.9.25

ఎడబాటు

 

ఎడబాటు
వృద్ధ దంపతుల మధ్య
ఒకరేమో అమెరికా
ఒకరేమో ఆస్ట్రేలియా
కొడుకులిద్దరూ
పంచుకున్నారు
మనవరాలు  జాలితో
వీడియో కాల్ లో
కలుపుతుంది
కన్నీళ్ళతో
పలకరించుకుంటారు
అనారోగ్యాల గురించి
తెలుసుకుంటారు
వారి చూపుల నిండా  ప్రేమే
మనవరాలికి ధన్యవాదాలు
చెప్తారు
వారు కలిసే రోజు
ఎప్పటికైనా వస్తుందా
అని ఎదురు చూస్తుంటారు

9.9.25

Sunday, 7 September 2025

కలువభామలు

 

నీటిలో కలువలు
నీటికే అందం
మన కనులకి విందు
చంద్రకాంతిలో వికసిస్తూ
చంద్రుడి రాకకై ఎదురు చూస్తూ
పూజకి పుష్పాలౌతూ
కలువభామల సొగసు
సున్నితత్వం వర్ణనాతీతం


సూర్యులు

 

ఆకాశంలో వేనవేల సూర్యులు
ఒకటి వెలుగుతుంది పగలు
మిగతావి రాత్రి

7.9.25

రెండు గుండెలు

 

అది ప్రేమ దీపం
జీవితమంతా వెలగాలని
వారిద్దరూ
తీవ్ర ప్రయత్నం చేసారు
దీపం ఆరిపోకుండా
తమ ‌చేతులు
అడ్డుపెట్టారు
ఇన్ని ప్రయత్నాలు చేసినా
రెప్పపాటులో
ప్రేమ దీపం ఆరిపోయింది
రెండు గుండెలు
ఆగిపోయేయి

7.9.25

Saturday, 6 September 2025

నీటి నీడల సొగసులు

 

నీరంటే ఆహ్లాదం
నీటి దగ్గర  జంటలు
నీటిలో నీడలు
సముద్రం ఒడ్డున
ఆటలు
కేరింతలు
మరిచిపోని అనుభవాలు
కెరటాలతో
ప్రమాదం లేని ఆటలు
సముద్రం దగ్గర
సూర్యాస్తమయ
అందాల కోసం
ఎదురుచూపులు
నదులన్నా
సముద్రమన్నా
ఆటవిడుపు కేంద్రాలు
సెలయేటి అందాలలో
నీటిలో నీడలు
తీరప్రాంతాలలో
చిన్న పిల్లల
ఇసుక గూళ్ళు
ప్రేమ పక్షుల
చెట్టాపట్టాలు
అన్నీ కలిసి
నీటికే అందం
నీటిలో
తమ నీడలు
చూసి మురిసే
జంటలెన్నో

6.9.25

మరుక్షణం

 

ఒక క్షణం నుండి
మరో క్షణం  లోకి
ఆ శుభ క్షణంలో
అడుగు పెట్టగానే
నూతన దంపతులు
కావొచ్చు
బిడ్డకి జన్మనిచ్చి
మాతృమూర్తి  కావొచ్చు
ప్రేమించిన అమ్మాయి
తన ప్రేమను అంగీకరించవచ్చు
అనుకోకుండా ప్రమాదం
సంభవించొచ్చు
ఎవరైనా  తన
జీవిత భాగస్వామిని
కోల్పోవచ్చు
మరు క్షణం
ఏం జరుగుతుందో
ఎవరికెరుక

5.9.25

పదిలం పదిలం

 

ఆకుల పల్లకిలో
అక్షరాల బొమ్మలు
అందంగా
పల్లకి మోసేది మనమే
బొమ్మలు  తయారుచేసేది
మనమే
ఆ బొమ్మలు
కవితలు
కథలు
కావ్యాలు
ఆకుల పల్లకి
పదిలం
అక్షరాల బొమ్మలు
పదిలం
అవి శాశ్వతంగా
నిలవాలి
మనకోసం

4.9.25

మంచి రోజుల కోసం

 

జీవితం లో
ఎన్నో అందుకోలేం
అందుకోలేక నిరాశానిస్పృహలు
చిన్న చిన్న కోర్కెలు కూడా
తీరవు
తమ బిడ్డలని
మంచి  చదువులు
చదివించుకోలేక
మనసుకి నచ్చిన
మనువు చేసుకోలేక
సరైన ఉద్యోగం దొరకక
ఆశించినవి అందుకోలేక
నిస్సహాయంగా
మంచిరోజులు రాకపోతాయా
అని ఎదురుచూస్తూ
బతుకులు
గడిపేస్తుంటాం

3.9.25

Tuesday, 2 September 2025

బాపు

 సాక్షివై సాక్షీభూతమై

తెలుగు తేజమైన బాపుఫ్ర

గీతలతో గీతాంజలి 

ఘటించావు తెలుగు తల్లికి

రాతలతో కంప్యూటర్  చేరాతని

శాసించావు నువ్వు 

స్నేహానికి అందమైన

నిర్వచనం  నువ్వు 

పొందికైన అతివ అందాలు

సెల్యులాయిడ్కెక్కించిన బాపు

మౌన ఋషివి నీవు

ముళ్ళపూడి  నీమాట

ముచ్చటైన జంటై

అద్భుతాలు సృష్టించారు  మీరు

ముత్యాల  ముగ్గుని

తీర్చిదిద్దేవు తెలుగు  వాకిట

సుస్థిరం నీ స్థానం

తెలుగువారి 

ఎదలో  మదిలో 

సినీ వినీలాకాశంలో

తళుకులీనే తారవు నీవు 


2.9.2014

ఆశకి ప్రాణం

 

మనిషి   ఆశాజీవి
తనకి
తనవాళ్ళకి
మంచి జరగాలని
తను అనుకున్నది
సాధించాలని
ఆశ పడుతూనే ఉంటాడు
ఆశించని జరగని
ప్రతిసారీ
నిరాశల అలసట
తప్పదు
చేసేదేం లేక
ఆశకి మళ్ళీ
ప్రాణం
పోస్తూ
బతికేస్తూ ఉంటాడు

2.9.25

తెర వెనుక భాగోతం

 

పెళ్ళంటేనే
అమ్మాయికి
కొత్త తెర
బిడియం
తెలియని ఇంట్లో 
మసలడం
నోములు
పూజలు
అత్తమామలకి
భర్తకి
ఎదురు  చెప్పలేక పోవడం
సంసారం  గుట్టుగా
చేసుకోవడం
అంతా
తెర వెనుక భాగోతం

1.9.25

పురాతన కళలే మన వారసత్వ సంపద

 

వీణ
వేణువు
చిత్రలేఖనం
శిల్పం
నాట్యం
సాహిత్యం
నాటకం
ఇవన్నీ  పురాతన
కళలే
గుహలలో చిత్రాలు
అజంతా
ఎల్లోరా  చిత్ర సంపద
అన్నీ
పురాతన కళలే
మన
పురాతన కళలను
చూసి
మనం గర్విద్దాం

31.8.25

అవగాహనకి అతిముఖ్యం

 

చిన్న  పిల్లలు
బాగా పరిశీలిస్తారు
అందుకే అన్నీ త్వరగా
నేర్చుకుంటారు.
యువత టెక్నిలజీ
పరిశీలించి ప్రగతికి
దోహదం చేస్తారు
విప్లవకారులు రాజకీయ
సామాజిక పరిస్థితితులను
పరిశీలిస్తుంటారు
పరిశీలన అవగాహనకి
అతిముఖ్యం

30.8.25

నడినెత్తి సూరీడు

 నడి నెత్తిన సూరీడు

కొడుకింటికి

చేరాలంటే

ఎంత దూరం ప్రయాణం 

ఆ వృద్ధ  దంపతులకు

నడి నెత్తిన  సూరీడు 

ఐనా తప్పవు

పొలం పనులు

ఇంటావిడ

బువ్వ తెచ్చేదాకా

నడి నెత్తిన  సూరీడు 

రక్తమోడుతూ

మొగుడి బారినుండి 

తప్పించుకొని

పుట్టింటికి చేయాలి

గృహహింస  బాధితురాలు

29.8.25

అందమైన మజిలీ

 

యవ్వనపు మజిలీ
కొన్నాళ్ళే
ఆశయాలు సాధించే
తరుణం అది
తనని తాను తీర్చి
దిద్దుకునే కాలం అది
తన వ్యక్తిత్వానికి
మెరుగులు పెట్టుకునే
యుక్తవయసు
అది అందమైన మజిలీ
కానీ
యవ్వన ప్రాయం
కరిగిపోతుంది  త్వరగా
యవ్వనం కేవలం
ఓ మజిలీ
మధ్యవయసుకి
సాగిపోకతప్పదు
కాలం తెచ్చే మార్పులతో
మనకి తెలియకుండానే
వృద్ధాప్యం వరకు
చేరుకుంటాం


28.8.25

నేలమీది చుక్కలు

 ఆనందంగా  విహార యాత్రకి బయలు దేరా  కుటుంబం.అకస్మాత్తుగా  ఘోర ప్రమాదం.అనుకోకుండా ఓ నవయువకుడు కారులో ఆ పక్కగా వెళ్తున్నాడు.వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసేడు.సకాలంలో ఆసుపత్రికి  తీసుకెళ్ళి వైద్యం చేయించడంతో కుటుంబం అంతా కళకళలాడి ఆ యువకుడిని తమ కుటుంబ సభ్యుడిగా భావించడం మొదలెట్టారు.చుక్కలు విరిగినా అప్పుడప్పుడు అతుక్కుంటాయి.

27.8.25

మహా కావ్యం

 

ఆ సముద్రం
నాకో మహాకావ్యం
ఎగిసి పడే కెరటాలు
అలల గలగలలు
ప్రాణాలకు తెగించే
బెస్తల జీవితాలు
తుఫాన్లకు
అల్లకల్లోలమయ్యే
తీరప్రాంతాలు
ప్రశాంత సమయంలో
కేరింతలతో
పులకించే
పర్యాటకులు
బతుకు మీద
విరక్తి పుట్టి
ఆ సముద్రంలోకే
నడుచుకొని వెళ్లి
ప్రాణాలు తీసుకునే
అభాగ్యులు
సముద్రం
రారమ్మని
కవ్విస్తుంటుంది
తానే ఓ మహాకావ్యం

26.8.25