తేది:15.5.25
శీర్షిక: నీ నవ్వు ఏ రాగమో
నీ నవ్వు ఏ రాగమో
మనసుని మురిపించే
మోహన రాగమో
తొలిపొద్దు తొలిసంధ్యలలో
పూల తెమ్మెరగా వీచే
భూపాలమో
అర్ధనారీశ్వర తత్వాన్ని
తలపింపచేసే
శంకరాభరణమా
మన కళ్యాణం ఎప్పుడెప్పుడా
అని ఎదురు చూస్తూ
నవ్వలొలకబోసే
కల్యాణి రాగమో
నన్ను మురిపించే రాగం
మైమరిపించే రాగం
వసంత రాగమో
నవవసంత రాగమో
ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని
No comments:
Post a Comment