తేది: 21.5.25
శీర్షిక: దుఃఖ లిపి
ఎన్ని కోట్ల జీవితాలది
దుఃఖలిపి
ఎన్ని వేల ఆడజన్మలది
దుఃఖలిపి
ఎన్ని లక్షల జీవితాలు
దోపిడీకి గురైతే
అది వేదనాభరిత చరిత.
ఎందరు చిన్నారులు
అనాధలైతే అది
దుఃఖ లవకుశ గానం
ఎందరు వృద్ధులు
ఇలలోనే నరకయాతన
అనుభవిస్తే
అది మనసువేదన
దుఃఖలిపిని చెరిపేస్తే
నాగరికత పరోగమనం
ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని
No comments:
Post a Comment