Saturday, 14 June 2025

ఎదురుచూపు

 

పెళ్ళయిన మూడో రోజే
అత్యవసరమని
దేశ సరిహద్దుల వరకు
వెళ్ళిపోయావు

అప్పుడు  మొదలయ్యాయి
నాఎదురుచూపులు
ఉత్తరమయినా
వస్తుందని
నేను ఎదురు చూస్తుండగానే
చిరునవ్వుతో
నువ్వు ఇంటికి వస్తావని

నీ పాపాయి
నా కడుపులో
ఉందన్న విషయం
నీకెంత ఆనందమో

మీ అమ్మ నాన్న  కూడా
నీకోసం ఎదురు చూపులు

ఆ మూడు రోజులలోనే
నువ్వు  నాకు  చాలా
మానసిక ధైర్యం ఇచ్చేవు

ఒక వీరుడు చిరునవ్వుతో
తన వారిని చేరుకుంటాడు
లేకుంటే దేశసేవలో
అమరుడౌతాడు

అమరుడెప్పుడూ
మన గుండెల్లో


No comments:

Post a Comment