ఇది నా స్వీయ రచన
చదువు
సుశీల పది ఇళ్ళలో పని చేస్తూ కూతురు ఉమని పెంచుతుంటుంది. ఒకరోజు ఒక అబ్బాయి తన ఇంటి దగ్గర కూర్చుని ఉండటం చూసింది.
"ఏమ్మా, అలా కూర్చున్నావు" అని అడిగింది సుశీల.
"నా పేరు శీను. రోజూ ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదిస్తుంటాను. ఇవాళ పనీ లేదు. ఏదీ తినడానికీ లేదు " అన్నాడు.
సుశీల శీనుని లోపలకి రమ్మని తను వండిందే కొంత పెట్టింది. ఆ రోజు నుండి శీనుని తమతోనే ఉండమంది.
శీను సుశీలని అమ్మ అని పిలిచేవాడు. ఉమని బాగా చదివించాలని ఎప్పుడూ సుశీలతో అనేవాడు. శీను కోరుకున్నట్టే ఉమ బాగా చదువుకుంది.
"శీనుతో నువ్వు కూడా నా దగ్గర చదువు నేర్చుకోకపోతే నువ్వు చాలా మంది దగ్గర మోసపోతావు. నీకు కూడా ఇంకా మంచి పనులు దొరుకుతాయి. నేను కూడా ఇంక ఉద్యోగం చేస్తాను. మనిద్దరం అమ్మని సుఖపెట్టాలి.
ఉమ లెక్చరర్ అయింది. సుశీల ఇప్పుడు ఓ లెక్చరర్ తల్లి.
No comments:
Post a Comment