మన కలయిక నిజమే
అనుకోకుండా కలసిన కలయిక
నువ్వు ఎప్పుడూ పుస్తకాలు
నేను ఎప్పుడూ ఆటలు
నా చుట్టూ స్నేహితులు
నీ చిరునామా గ్రంధాలయం
నీ కోసమే నేను
గ్రంధాలయానికి
వచ్చేదాన్ని
నీతో మాటామాటా
కలిపేదాన్ని
చూపులు కలిసాయి
నువ్వే నన్ను ఎక్కువ
ఇష్టపడ్డావు
మన కలయిక
కల కాకుండా
చెట్టాపట్టాలేసుకు
నడిచినంత నిజమయింది
No comments:
Post a Comment