నువ్వు నేను
పూవు తావి
నువ్వు నేను
ఒకరికి ఒకరం
నువ్వు నేను
తోడు నీడ
నువ్వు నేను
పాలు తేనె
నువ్వు నేను
వివాహ బంధం
మనిద్దరిదీ కలిసి
జీవన గమనం
మన బంధం
ప్రేమకి నిర్వచనం
నువ్వు నేను
పూవు తావి
నువ్వు నేను
ఒకరికి ఒకరం
నువ్వు నేను
తోడు నీడ
నువ్వు నేను
పాలు తేనె
నువ్వు నేను
వివాహ బంధం
మనిద్దరిదీ కలిసి
జీవన గమనం
మన బంధం
ప్రేమకి నిర్వచనం
ప్రేమించే ప్రతివ్యక్తి
తన ప్రియురాలికై
జపం చేస్తూనే ఉంటాడు
ఆమె తన ప్రేమను
అంగీకరించాలని
తనతో జీవితం
పంచుకోవాలని
తనను కూడా
అంతగానూ ప్రేమించాలని
ఆమెను ఎప్పుడెప్పుడు
కలుస్తానని తహతహలాడుతూ
తన మనసులోని మాటలన్నీ
ఆమెకి చెప్పుకోవాలని
నిరంతర ధ్యాస
నిరంతర జపం
భరతమాత
ఎందరో జాతి రత్నాలను కన్న
బంగరుతల్లి
ఎన్ని భాషలు
ఎన్ని మతాలు
ఎన్ని సంస్కృతులు
శాంతియుత సహజీవనం
అందాల హిమాలయాలు
హిందూ మహాసముద్రం
అరేబియా సముద్రం
బంగాళాఖాతం
నోబుల్ గ్రహీతలు
అలీన విధానం
రైతన్నల భారతం
ఆసేతు హిమాచల
భారతం
ప్రతీ మనిషిదీ
ఓ గమ్యం
వైద్యుడు కావాలని
శాస్త్రవేత్త కావాలని
ప్రజాసేవ చేయాలని
గమ్యం ఏదైనా
ఎన్నుకున్న మార్గం
మంచిదై ఉండాలి
గమ్యం చేరడం కోసం
ఎన్ని ఒడుదుడుకులు
అయినా ఎదుర్కోవాలి
దృఢనిశ్చయం
ఏకాగ్రత తప్పనిసరి
లవ్ యూనే
అబ్బాయిలు అమ్మాయిలకు
చెప్పే మాట
లవ్ యూ రా
అమ్మాయిలు చనువుగా
అబ్బాయిలకి చెప్పే మాట
ఆ తర్వాత మొదలౌతుంది
అసలు కథ
ఇద్దరూ పరస్పరం
ఇష్టపడాలి
ఇద్దరి ఇంట్లో
పెద్దవాళ్ళు ఇష్టపడాలి
పెద్దలు విలన్లుగా
మారకూడదు
రక్తపాతాలు జరగకూడదు
అన్యోన్య దంపతులుగ
మారినప్పుడే
ప్రేమలకి అర్ధం
మన కలయిక నిజమే
అనుకోకుండా కలసిన కలయిక
నువ్వు ఎప్పుడూ పుస్తకాలు
నేను ఎప్పుడూ ఆటలు
నా చుట్టూ స్నేహితులు
నీ చిరునామా గ్రంధాలయం
నీ కోసమే నేను
గ్రంధాలయానికి
వచ్చేదాన్ని
నీతో మాటామాటా
కలిపేదాన్ని
చూపులు కలిసాయి
నువ్వే నన్ను ఎక్కువ
ఇష్టపడ్డావు
మన కలయిక
కల కాకుండా
చెట్టాపట్టాలేసుకు
నడిచినంత నిజమయింది
శిల్పి బొమ్మలు చేస్తాడు
రంగులతో మెరిపిస్తాడు
అందాలు చిందిస్తాడు
మనం అచ్చెరువొందుతాం
మెరిసే బొమ్మలు కొన్ని
కలకాలం
కళకళలాడే బొమ్మలు
ప్రాణం పోసుకున్న బొమ్మలు
మెరిసే బొమ్మలకి
ప్రాణం పోసే శిల్పి
సాక్షాత్తూ బ్రహ్మ
మెరిసే బొమ్మలు
పిల్లలకి ప్రియం
పెద్దలకి సంబరం
అంశం: సూర్యుడి పగ/ఈ ఎండు పాపం ఎవ్వరిది
తేది: 9.6.25
శీర్షిక :వనాలని సంరక్షించుకుందాం
చెట్లు కొట్టేస్తున్న మానవుడు
చల్లదనం
వర్షాలు
లేకుండా చేస్తున్నాడు
నీటి చక్రం గూర్చి
పాఠ్య పుస్తకాలలోనే
పచ్చదనం ఉంటేనే
చల్లదనం
నీటి మబ్బులు
కారుమబ్బులు లేకుంటే
సూర్యుడి ప్రతాపమే
ప్రకృతిని నాశనం చేస్తున్న
ఆధునిక మానవుడి మీదే
సూర్యుడి కసి
మనం వనాలని
సంరక్షించుకుంటే
సూర్యుడు చల్లబడతాడు
ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని
శీర్షిక: ఆశావాదం
మన దారులన్నీ
మూసుకుపోయినా
ఏదో ఒకదారి తెరిచేవుంటుంది
ఆ దారి ఏదో మనం
అన్వేషించాలి
ధనం లేని రోజు
కష్టే ఫలే
చదువురాని రోజు
విద్యాదాతలుంటారు
ఆరోగ్యం పాడయితే
మిత్రులు సాయం చేయకున్నా
సాయం చేసే ఆత్మబంధువులు
దొరుకుతారు
ఆశావాదం ఏదో ఒక
దారి చూపుతుంది
నిరాశావాదం అన్నిదారులు
మూసుకుపోయాయన్న
భావన కలిగిస్తుంది
ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని
ఇది నా స్వీయ రచన
చదువు
సుశీల పది ఇళ్ళలో పని చేస్తూ కూతురు ఉమని పెంచుతుంటుంది. ఒకరోజు ఒక అబ్బాయి తన ఇంటి దగ్గర కూర్చుని ఉండటం చూసింది.
"ఏమ్మా, అలా కూర్చున్నావు" అని అడిగింది సుశీల.
"నా పేరు శీను. రోజూ ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదిస్తుంటాను. ఇవాళ పనీ లేదు. ఏదీ తినడానికీ లేదు " అన్నాడు.
సుశీల శీనుని లోపలకి రమ్మని తను వండిందే కొంత పెట్టింది. ఆ రోజు నుండి శీనుని తమతోనే ఉండమంది.
శీను సుశీలని అమ్మ అని పిలిచేవాడు. ఉమని బాగా చదివించాలని ఎప్పుడూ సుశీలతో అనేవాడు. శీను కోరుకున్నట్టే ఉమ బాగా చదువుకుంది.
"శీనుతో నువ్వు కూడా నా దగ్గర చదువు నేర్చుకోకపోతే నువ్వు చాలా మంది దగ్గర మోసపోతావు. నీకు కూడా ఇంకా మంచి పనులు దొరుకుతాయి. నేను కూడా ఇంక ఉద్యోగం చేస్తాను. మనిద్దరం అమ్మని సుఖపెట్టాలి.
ఉమ లెక్చరర్ అయింది. సుశీల ఇప్పుడు ఓ లెక్చరర్ తల్లి.
ఇరుకు సందులు
ఇరుకు వీధులు
ఇరుకు హృదయాలు
జనాభా పెరిగిపోయి
ఇరుకు బస్సులు
వాహనాలు కదలలేని
పరిస్థితి
విద్యాలయాల్లో
సీట్లులేని
ఇబ్బంది
చిన్న చిన్న ఇళ్ళు
గుడిసెలు
ఐనా ఆకాశం
విశాలమే
భూమాతా
విశాలమే
మన మనసులు
ఆలోచనలు
విశాలమైతే
అంతేచాలు
జీవిత ప్రయాణం
అమ్మతో మొదలైంది
నాన్నతో నడక
తోబుట్టువులతో
ఆటపాటలు
పలకాబలపం చదువు
గురువుల నీడన
విద్యార్జన
స్నేహబంధాలు
ప్రేమలు
పెళ్ళిళ్ళు
ఉద్యోగ యాతనలు
సంసార సాగరం
జీవిత ప్రయాణంలో
సహ ప్రయాణీకులెందరెందరో
మనకే తెలియకుండా
మన ప్రయాణం
ఆగిపోతుంది
మనవారి పై
నమ్మకం
మంచి జరుగుతుందన్న
నమ్మకం
వివాహ బంధం మీద
నమ్మకం
ఆ దేవుడు
మనని చల్లగా
చూస్తాడని నమ్మకం
ప్రజాస్వామ్యం మీద
నమ్మకం
పాలకుల మీద నమ్మకం
మన మీద మనకి నమ్మకం
అత్యవసరం
కార్తీక పున్నమి
దినోత్సవం
కోటి దీపోత్సవం
నదిలో దీపాలు వదిలే
దీపోత్సవం
మగువలు సౌభాగ్యానికి
చేసే పూజ
కోవిళ్ళలో జరిగే
కోటి దీపోత్సవం
ఆధ్యాత్మిక చింతన
వెల్లువెత్తే వేళ
కేవలం మనమే ఉందామా
సాగర తీరంలో
పచ్చని పొలాలలో
పచ్చిక మైదానాలలో
మన పొదరింటిలో
ఇసుక తిన్నెల మీద
ఆరుబయట
వెన్నెల రాత్రులలో
సఖీ నీ తోడుంటే
కేవలం మనమే చాలు
నా స్వేచ్ఛ దూరమైతే అయిష్టం
ఆడవారిని తక్కువ చేస్తే
నాకు నచ్చదు
పిల్లలకి చదువే సర్వవేళలా
ఆటలేదంటే అయిష్టం
జీతమిస్తున్నాము కదా
గడియారం చూడకుండా
పనిచేయమంటే
ఉద్యోగికి ఎంత కష్టం
తల్లి తండ్రుల మాటకి
విలువలేని చోట
కాలం గడపడం వారికి
ఎంతో అయిష్టం
అయిష్టాలు దూరమైన నాడే
ఇష్టంగా జీవించగలం
పిల్లలే దేవుళ్ళు
ఆ నవ్వులో స్వచ్ఛత
మాటలో నిర్మలత్వం
వారి ప్రేమలో
ఆప్యాయత
అభిమానం
బాలవాక్కు
బ్రహ్మ వాక్కంటారు
పెద్దలు
మన దుఃఖాన్ని
చిరునవ్వుగా
మార్చేది వారే
మన మదిలో దిగులు
పోగొట్టేది వారే
దేవుడు మన కోసం
కానుకగా పంపుతాడు
పిల్లలని
ఓ చిట్టి పాపాయి
నీవెవరివే
నిద్రలో నేనమ్మ విరిజాజినే
నిద్రలో నేనమ్మ సిరిమల్లెనే
గులాబీ రేకుపై మురిసే
మంచు ముత్యాన్నే
నిద్రలో నేనమ్మ
బంగారు బొమ్మనే
అందాల కొమ్మనే
జీవితమే
ఓ ప్రయాణం
భూమి తిరుగుతూ
మనమూ
భూమితో పాటు
తిరుగుతూ
అమ్మ నాన్న
చేయి పట్టుకుని
కొన్నాళ్ళు
నడుస్తాం
చదువులమ్మ
చేయి పట్టుకుని
మరి కొన్నాళ్ళు
తోటి ఉద్యోగులతో
ఎన్నో ఏళ్ళు
ఆలుమగలుగా
జీవితాంతం
కన్నబిడ్డలతో
ప్రయాణం
వారికి రెక్కలొచ్చేదాకా
జీవితం రైలుబండి
మనకి తెలియకుండా
దిగిపోతాం
కొండ ఎక్కడం
మొదలుపెట్టా
అమ్మ పొత్తిళ్ళలో
మరి కొంచెం ఎక్కా
నాన్న చేయిపట్టుకొని
ఇంకొంచెం ఆచార్యుల
సాయంతో
వివాహ బంధంతో
మరి కొంచెం
శ్వాస ఆగి
ఎవరెస్ట్ శిఖరం
నుంచి లోయల్లోకి
శిలకి ప్రాణమొస్తే
శిల్పమౌతుంది
అందాల సుందరి
అవుతుంది
ప్రపంచ వింతవుతుంది
హంపీ
అజంతా శిల్పాలవుతాయి
కోణార్క
రధ చక్రమౌతుంది
విదేశీ యాత్రికులు
సైతం
అచ్చెరు వొందుతారు
శిల్పాలని
తరచి చూడాలంటే
ఎంతైనా సమయం
కేటాయించాలి
కనిపించని
శిల్పులకు
అభినందనలు
కృతజ్ఞతలు
పెళ్ళయిన మూడో రోజే
అత్యవసరమని
దేశ సరిహద్దుల వరకు
వెళ్ళిపోయావు
అప్పుడు మొదలయ్యాయి
నాఎదురుచూపులు
ఉత్తరమయినా
వస్తుందని
నేను ఎదురు చూస్తుండగానే
చిరునవ్వుతో
నువ్వు ఇంటికి వస్తావని
నీ పాపాయి
నా కడుపులో
ఉందన్న విషయం
నీకెంత ఆనందమో
మీ అమ్మ నాన్న కూడా
నీకోసం ఎదురు చూపులు
ఆ మూడు రోజులలోనే
నువ్వు నాకు చాలా
మానసిక ధైర్యం ఇచ్చేవు
ఒక వీరుడు చిరునవ్వుతో
తన వారిని చేరుకుంటాడు
లేకుంటే దేశసేవలో
అమరుడౌతాడు
అమరుడెప్పుడూ
మన గుండెల్లో
తేది: 16.5.25
శీర్షిక: ప్రేమ పారిజాతాలు
తలపుల వాకిలిలో
ఎన్నెన్ని వసంతాలో
భీభత్స తుఫానులో
ప్రేమ పారిజాతాలు
కన్నవారితో అనుబంధాల మాలిక
కన్నబిడ్డల పట్ల ప్రేమానురాగాల
పాశం
నా తలపుల వాకిలిలో
కవితల సందడి
కథల్లో పాత్రల హడావుడి
స్నేహబంధాల మధురిమలు
రక్త బంధాల అన్యోన్నతలు
నా తలపులవాకిలిలో
మధుర స్మృతులు
బంగరు భవిత గూర్చి
తియతియ్యని కలలు
స్వప్నం సాకారమయ్యే
తలపులు
ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని
వేసవిలో అమృత
చినుకులు
ఎడారిలో
అమృత చినుకులు
బీడు నేలకి
అమృత చినుకులు
రైతన్న
పంట పొలానికి
అమృత చినుకులు
చిటపట చినుకులు
అమృత చినుకులే
జలకళని తీసుకువచ్చేది
అమృత చినుకులే
చిన్నారులు కేరింతలు
కొట్టేది అమృత చినుకులకే