Saturday, 10 December 2011

vimukti

అసంఖ్యాకం
అపరిమితం
 తరగనిగని

పొద్దున్నలేవగానే మొదలౌతాయి
బద్ధకానికి తావులేదు
క్రమశిక్షణగల  ఉద్యోగినికి

ఇంటికి వచ్చేసరికి చుట్టుముడతాయి
కళ్ళుమూసుకున్నా కళ్ళముందుంటాయి

పట్టాల్సిన నీళ్ళు
ఉతకాల్సిన బట్టలు
సర్దుకోవాల్సిన గిన్నెలు
తోమాల్సిన అంట్లు
తరగాల్సిన కూర
చేయాల్సిన వంట
అన్నే క్యూ కడతాయి
తోసుకుంటూ మునుముందుకు
వస్తుంటాయి

ఒకొక్కప్పుడు ఒళ్ళు మండుతుంది
నే చేయను   ఫో
ఛీ కొడతా వాటిని
అయినా వదలవేం
కదలక పోతావా
నీపని పడతాం అప్పుడు

భుక్తి కోసం దైనందిన పోరాటం
విముక్తి కోసం విమోచనం కోసం
నిత్యం ఎదురుచూపు

10 .12 .2011   

No comments:

Post a Comment