Saturday, 10 December 2011

mahaa prayaanam

మహా ప్రయాణం
కైలాస భూమికి

ఇల్లు సర్దుతుంటే
మహాప్రయాణానికి
సంసిద్ధమౌతున్నట్టుంటుంది

అర్ధ శతం పూర్తయ్యాక
శతం పూర్తి చేయకనే
పడిపోయే వికెట్లు కోకొల్లలు

నా వస్తువులు
వస్త్రాలు పుస్తకాలు
తీపి జ్ఞాపకాలు
అన్నిటినీ పదిలపరుచుకోవాలనుంటుంది

అయినా నావల్ల నావారికి కలిగే
అసౌకర్యం తగ్గించాలనే వుంటుంది

భూమ్మీద పడగానే కెవ్వుమంటాం
కలకలం సృష్టిస్తాం
బతికినన్నాళ్ళూ కలకలమే

నిశ్సబ్దంగా నిశ్చేతనమౌతాం
ఆ నిశ్శబ్దం మహా ప్రశాంతత
ఇక అలారం ధ్వనికి
ఉలిక్కిపడి లేవనక్కరలేదు

సకాలంలో సంతకానికి
పరుగు పర్వం లేనేలేదు
కోపతాపాలూ రాగద్వేషాలూ
సంతాపాలూ అసలే లేవు

అధినేతయినా జాతిరత్నాలయినా
ప్రపంచ సుందరయినా నేనయినా
నిష్క్రమిస్తాం  నిశ్శబ్దంగా
ప్రపంచ రంగస్థలంనుండి

10.12.2011

No comments:

Post a Comment