Saturday, 31 December 2011

happy newyear-2012

నిన్నటి వరకు
మనకి ప్రియమైనది
మన వెన్నంటి నిలిచినది
నేడు గతమైనది
గతసంవత్సర మైనది

ఏడాదిపాటు తోడుగా నిలిచిన
పాత వత్సరం నిశ్సబ్దంగా నిష్క్రమించింది

అర్ధరాత్రి పన్నెండుకి
అందుకున్న చేయి
అర్ధరాత్రే విడిచిపెట్టింది నిర్లిప్తంగా

కాదుకాదు మనమే
పది తొమ్మిది ఎనిమిది
లెక్కించి మరీ వదిలేసి
హత్తుకున్నాం నూతనవత్సరాన్ని  ఆప్యాయంగా

నూతన సంవత్సర శుభాకాంక్షలు
అందరికీ ప్రతిఒక్కరికీ
 మానవాళికి

1.1.2012

Tuesday, 27 December 2011

prakrutimaata muddula tanaya

భరతమాత నడుం ఒంపుల్లో
సొగసైన పుట్టుమచ్చ విశాఖ

తెలుగుతల్లి ముత్యాల ముప్పేటలో
ముచ్చటైన శోభ విశాఖ

ఉత్తరాంధ్ర ఒయ్యారి భామ
సాగరతీర సోయగాలలేమ విశాఖ

గాలి ఓడల విమానాశ్రయం
సాగర జలాల్లో నిశిరాతిరి
జలకన్యల్లా మెరిసే ఓడల ఓడరేవు
నియాన్ వెలుగుల్లో నిత్య దీపావళి విశాఖ

ప్రకృతి మాత ముద్దుల తనయ విశాఖ
సుందరగిరుల అందాల లోయ విశాఖ
శివపార్వతుల వన విహారం కైలాసగిరి
అద్భుత త్రీడీ దృశ్యం సింహాద్రి
డాల్ఫిన్స్ నోస్-మెరుపు బాణాలు
వాడిగా విసిరే లైట్ హౌస్

పామ్ బీచ్ -రామకృష్ణ బీచ్ -ఉడా పార్క్
బంగారు జలతారు
జలజల జాలు వారే అలల ఇసుక
నిత్య నూతనంగా శోభాయమానంగా
ఇసుకపట్నం విశాఖపట్నం

మర్రిపాలెం వెంకోజీపాలెం
మువ్వలవానిపాలెం తాటిచెట్లపాలెం
మద్దిలపాలెం కంచరపాలెం
పాలెంల పట్నం విశాఖపట్నం

హెచ్ పిసి ఎల్ -బి హెచ్ పి వి -జింక్
కోరమండల్ ఫెర్టిలైజర్స్
షిప్ యార్డ్ స్టీల్ ప్లాంట్
కార్మిక విశాఖ పారిశ్రామిక విశాఖ

అంధ్ర విశ్వ కళాపరిషత్
అంధ్రా మెడికల్ కాలేజ్
శ్రీ శ్రీ -రాచకొండ
విద్యల విశాఖ విద్వత్ విశాఖ

సాగరపవనాల మితశీతోష్ణ స్థితి
లౌకిక సమస్థితి
కలతలు ఎరుగని పరిస్థితి
 అందరు మెచ్చే విశాఖ

సింహాద్రప్పన్న కనక మహాలక్ష్మి
లౌకిక భావాలకు దర్పణం మూడు కొండలపై
పోర్ట్ లో వెలిసిన జీసెస్ బాలాజీ అల్లా
అందరికీ నచ్చే విశాఖ
అద్భుత దృశ్య కావ్యం విశాఖ

visteel mahilaa samiti souvenir,2008              

Wednesday, 21 December 2011

vanam vallakaadayite...

వనం వల్లకాడయితే
నగరిబాట పట్టింది  చిరుత

రహదార్లు మృత్యు కవాటాలు
లారీ భూతాలు మృత్యు వాహనాలు

రోడ్డు దాటడ మెరుగని చిరుత
వన్య మృగమా జాతీయ మృగమా
అయ్యో మృత్యువు వాత పడ్డావు

22 .12 .2011  

mahaneeyudu

జర్మనీ లో జన్మించి
లండన్ లో కాలూని
బడుగు ప్రజల పాలిటి
దివిటీవయ్యావు
మార్గాన్ని నిర్దేశించి
మాననీయుడవయ్యావు

రష్యన్ విప్లవం
చైనా విప్లవం
నక్సల్బరీ పోరాటం
శ్రీకాకుళం పోరాటం
విప్లవ వీరులకుత్తేజం నీ నినాదం

శ్రమ దోపిడీ
అక్రమ లాభార్జన ఉన్నంతవరకు
శ్రామికుల సంఘటిత పోరాటాలకు
ప్రేరణ నువ్వయినంతవరకు
మార్క్స్ మహానీయుడా
నిలిచివుంటావు నువ్వు

22 .12 .2011


prerana

ఒక భావం
ఒక పదం
ఒక సంఘటన
దుర్ఘటన
ప్రేరేపిస్తాయి కవిత రాయమని

మనసులో అస్పష్టంగా కదలాడితే
ఆకృతి దాలుస్తుంది కాగితంపై

రూపుదిద్దుకోకుండానే
బయట పడతానంటుంది

లోన ఉన్నంతవరకు
అనాధ శిశువు తాను

ఆకృతి దాల్చాకా
ఎందరు ప్రేమికులో
విమర్శకులో

22 .12 .2011

ksheera sagaram

మనసు క్షీర సాగరం
 అంతర్మధనం క్షీర సాగర మధనం
నిరంతరం

కామధేనువు
కల్పవృక్షం
లచ్చిందేవి
హాలాహలం
అమృతం

మనసే కామధేనువు
కల్పవృక్షం
వాడుకో పదునైన నీ మస్తిష్కం
పసిడి రాసులే గలగలమంటాయి

మనసే హాలాహలం
ఆలోచనలు వక్రిస్తే
వక్రమార్గం పడితే

సదాలోచన
సత్ప్రవర్తన
సద్బుద్ధి
సన్మార్గం
 ఇది కాదా అమృతం

 22 .12 .2011

Saturday, 17 December 2011

paishachikam

లాజరస్ విశాఖ
దారుణ హత్య స్విమ్మింగ్ పూల్ లో
ఆక్రోశిస్తున్న తల్లితండ్రులు
వేలెత్తి చూపేది ర్యాగింగ్ భూతాన్ని

ఈ పైశాచిక ప్రవృత్తి
ఏ విష సంస్కృతి
పురోగమిస్తుంటే ప్రపంచం భౌతికంగా
తిరోగామిస్తున్నాయి సంస్కృతి సభ్యత
అసభ్యంగా నీచంగా ప్రవర్తించే  సీనియర్లు
ఏడాది క్రితం వృత్తి కళాశాలల్లో
భయంభయంగా అడుగుపెట్టే జూనియర్లే

యాజమాన్యం నిర్లక్ష్యం ఖరీదు
విద్యార్ధి ప్రాణం
చెడు సావాసాలు సాంగత్యాలే తప్ప
తల్లితండ్రుల మార్గదర్శనం
ప్రభావం కరువౌతున్నాయి నేడు
నేరప్రవృత్తి పైశాచికత్వం
కొనసాగుతున్నాయి యువతలో
నిరాటంకంగా

18.12.2011     

naalo nenu

సమయం ఎనిమిది ఉదయం
కనీసం మరో పద్నాలుగు గంటల స్వేచ్చ నాది

స్వేచ్చ
ఏపనైనా చేయడానికి
చేయకపోడానికి
విశ్రాంతి తీసుకోడానికి
ఏకాంతం నిశ్శబ్దం మౌనం

ఆరు రోజుల అవిశ్రాంత పనిదినాల
తరువాత దొరికే విశ్రాంతి
మరో ఇదు పనిదినాలకి కావలసిన
శక్తి నింపుకోవడం కోసం

తొంభై మూడు దాటిన తాతగారు ఆనాడు
నిన్న తొంభైకి చేరుకున్న ఆయన ఆప్తమిత్రుడు
తాత తొంభైకి చేరితే
 మనుమలిదే అదృష్టం ఆనందం

 ఏవయసు మనదైతే
ఆవయసు ఆతరం ప్రపంచం  మనది
అక్కలు వదినలు స్నేహితురాళ్ళు
అన్నలు తమ్ముళ్ళు
ముందు తరంతో సంబంధం
 అమ్మానాన్న అత్తమామ

తెలుసుకోవాలి ఈ తరాన్ని
ఆర్ధం  కావాలి వారి అంతరంగం
ఈతరం ప్రతినిధులు నాతనయలు నా విద్యార్ధులు
అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తా
వారిద్వారా నేటి తరాన్ని

ఒక ఐదేళ్ళ పాప పలకరిస్తుంది పొద్దున్నే
తన ముక్కుమొహం నాకు తెలియకపోయినా
ఆరేళ్ళ బుడతడు శుభోదయం చెప్తాడు
బడిలో అడుగుపెట్టగానే
ఉపాధ్యాయినిని నేనని
ఒకటో తరగతి నుండి పదోతరగతి
ఆతరాన్నికూడా అర్ధం చేసుకోవడానికి
ప్రయత్నిస్తా
అది నావృత్తి ధర్మం
నాకున్న అవకాశం

  

Sunday, 11 December 2011

visakha

భరతమాత నడుం వంపులో
బహు మచ్చటైన పుట్టుమచ్చ విశాఖ

సాగర తీరంలో  గిరుల సోయగాలతో
అలల చిలిపిదనం తన పాదాలు తడప
అరుణోదయ కాంతులలో మెరిసే విశాఖ

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
ఎలుగెత్తి చాటిన తెన్నేటి
అంధ్ర  విశ్వవిద్యాలయ కులపతి నుండి
రాష్ట్రపతిగాఎదిగిన రాధాకృష్ణుడు

మర్రిపాలెం తాటిచెట్లపాలెం
మద్దెలపాలెం వెంకోజీపాలెం
మువ్వలవానిపాలెం నాతయ్యపాలెం
పాలెంలపట్నం విశాఖపట్నం

వైశాఖేశ్వరుని పేర వెలిసిన విశాఖ
ప్రకృతిసొగసులు తనలో నిలుపుకున్న
సహజ సుందర నగరం విశాఖ
బాలభానుని తన నొసట దిద్దుకున్న
తూర్పుతీర సోయగం విశాఖ

11 .12 .2011    

Saturday, 10 December 2011

mahaa prayaanam

మహా ప్రయాణం
కైలాస భూమికి

ఇల్లు సర్దుతుంటే
మహాప్రయాణానికి
సంసిద్ధమౌతున్నట్టుంటుంది

అర్ధ శతం పూర్తయ్యాక
శతం పూర్తి చేయకనే
పడిపోయే వికెట్లు కోకొల్లలు

నా వస్తువులు
వస్త్రాలు పుస్తకాలు
తీపి జ్ఞాపకాలు
అన్నిటినీ పదిలపరుచుకోవాలనుంటుంది

అయినా నావల్ల నావారికి కలిగే
అసౌకర్యం తగ్గించాలనే వుంటుంది

భూమ్మీద పడగానే కెవ్వుమంటాం
కలకలం సృష్టిస్తాం
బతికినన్నాళ్ళూ కలకలమే

నిశ్సబ్దంగా నిశ్చేతనమౌతాం
ఆ నిశ్శబ్దం మహా ప్రశాంతత
ఇక అలారం ధ్వనికి
ఉలిక్కిపడి లేవనక్కరలేదు

సకాలంలో సంతకానికి
పరుగు పర్వం లేనేలేదు
కోపతాపాలూ రాగద్వేషాలూ
సంతాపాలూ అసలే లేవు

అధినేతయినా జాతిరత్నాలయినా
ప్రపంచ సుందరయినా నేనయినా
నిష్క్రమిస్తాం  నిశ్శబ్దంగా
ప్రపంచ రంగస్థలంనుండి

10.12.2011

vimukti

అసంఖ్యాకం
అపరిమితం
 తరగనిగని

పొద్దున్నలేవగానే మొదలౌతాయి
బద్ధకానికి తావులేదు
క్రమశిక్షణగల  ఉద్యోగినికి

ఇంటికి వచ్చేసరికి చుట్టుముడతాయి
కళ్ళుమూసుకున్నా కళ్ళముందుంటాయి

పట్టాల్సిన నీళ్ళు
ఉతకాల్సిన బట్టలు
సర్దుకోవాల్సిన గిన్నెలు
తోమాల్సిన అంట్లు
తరగాల్సిన కూర
చేయాల్సిన వంట
అన్నే క్యూ కడతాయి
తోసుకుంటూ మునుముందుకు
వస్తుంటాయి

ఒకొక్కప్పుడు ఒళ్ళు మండుతుంది
నే చేయను   ఫో
ఛీ కొడతా వాటిని
అయినా వదలవేం
కదలక పోతావా
నీపని పడతాం అప్పుడు

భుక్తి కోసం దైనందిన పోరాటం
విముక్తి కోసం విమోచనం కోసం
నిత్యం ఎదురుచూపు

10 .12 .2011   

veeru@219

వీరూ వీరుడే
వన్ డే లైనా టెస్ట్ మ్యాచ్ లైనా
వీరుడే అత్యధిక పరుగుల సాధించి

నాయకుడై ద్విశతం సాధించాడు
నలభై నాలుగు ఓవర్లకే
గురువును దాటిన శిష్యుడు

కదనరంగం లో అడుగుపెడితే
వీరాభిమన్యుడే వీరూ
మెరుపువేగంతో పరుగులు పెంచుతూ
శతఘ్నులు పేలుస్తాడు శత్రువు యెదలో

రికార్డు ల యోధుడు సచిన్
అసహనానికి తాను మారు పేరైనా వీరూ
స్థిరంగా ఆడిఅధిగమించాడు
సచిన్ రికార్డు నే

నేడు ప్రతి భారతీయుడూ
సచిన్ తోపాటు జపించే
మరోనామం షేహ్వాగ్

10 .12 .2011

Friday, 9 December 2011

grahanam

గ్రహణం పట్టింది

సింధు నాగరికత
శిధిలమైన నాడు

బౌద్ధం  భారత్ ని వదిలి
పొరుగు దేశాలకి
తరలి వెళ్ళిన రోజు

రక్తసిక్తమై అన్నదమ్ములు
విడివడిన రోజు

బాబరీ మస్జిద్
కూలద్రోయ బడినరోజు
సోమనాధుని మందిరం
ధ్వంసమైన రోజు

సతిని సహగమనం
చేయమన్న రోజు
ముక్కుపచ్చలారని బిడ్డని
ముదుసలికి అమ్మినరోజు

అవినీతి రాజ్య మేలిన నాడు
చీకటి సామ్రాజ్యాలు
విస్తరించిననాడు

అమ్మతనాన్ని ఆడబిడ్డలని
భ్రూణహత్యలుగ హత్య కావించిన నాడే

వెన్నెలమ్మలకి వెలుగుల సూర్యులకి
గ్రహణం పట్టకుండా జాగ్రత్త పడదాం
జాతియావత్తూ

10 .12 .2011 
*సంపూర్ణ చంద్రగ్రహణం నేడే 

Saturday, 3 December 2011

aayudham

పదం ప్రేమ స్వరూపమౌతుంది
పసిబిడ్డ అమ్మాఅని పిలిచినపుడు

పదం బాధని వ్యక్తీకరిస్తుంది
బాధలో అమ్మని తలచినపుడు
 
పదం ప్రభంజనమౌతుంది
మహాకవి కావ్యమైనపుడు

పదం నినాదమౌతుంది
సామాన్యుడు పిడికిలి బిగించినపుడు

పదాన్ని ఆవిష్కరించిన మానవుడు
పదును పెడుతూనేవున్నాడు
శక్తివంతమైన ఆయుధంగా వాడడానికి    

Friday, 2 December 2011

vijaya bheri

 నాలుగు సార్లు నమోదు చేసుకుంది విజయాన్ని
 భారత క్రికెట్ జట్టు సాగర తీరంలో విశాఖలో
పరిమిత ఓవర్ల ఆటలో

అలనాడు ధోనీ మోగించాడు
విజయ భేరి
నేటి విరాట్ స్వరూపం
విరాట్ కోహ్లీది
నాడు ఆసిస్ కి  నేడు కరీబియన్లకి
చుక్కలు చూపించాడు

యువక్రీడాకారులకు
సచినే స్ఫూర్తి
ప్రతి భారతీయుడు తమని
తలవాలంటే జనం మెచ్చే ఆట
ఆడాల్సిందే

ఒకప్పటి సామ్రాజ్యవాద దేశపు ఆట
దిగుమతి అయింది వలసదేశాలకు
ఆస్ట్రేలియా భారత్ వెస్టిండీస్
పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక
కామన్ వెల్త్ దేశాలలో క్రికెట్ వెలుగులు
చిమ్ముతున్నభారత్
అభినందనలు విజేతకు

విజయకేతనాన్ని విజేతలకు
అందించిన విశాఖ
పెంచగలదు ఆత్మస్థైర్యాన్ని
మన ఆటగాళ్ళలో    


Thursday, 1 December 2011

avyavasteekrutam

ఆఫీసుకెళితే
ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు

సుస్తీ చేసినా శరీరాన్ని
జబర్దస్తీ గా డ్యూటీ ఎక్కించాల్సిందే
అత్యవసరంగా అడగాలన్నాసెలవు
సిగ్గుతో చచ్చిపోతూ
భయంభయంగా బిక్కమొగంవేసి
యాచించాల్సిందే

హద్దుల్లేవు ఆఫీసు పనిసమయానికి
అందుకునే జీతమెంతో -
బిడ్డలకి  జీవిత భాగస్వామికి
ఎంత సమయం కేటాయించగలవో-
ఎవరికెరుక

ఆరోగ్యం హరించుకు పోతున్నదెంతో
దోపిడీకి బలవుతున్నదెంతో
లెక్కలు తేల్చేదేవైద్యుడు
ఏ మార్క్స్ ఏంగెల్స్

అవ్యవస్థీ కృత రంగమా
నీ వికృతరూపం
భీభత్స ప్రధాన దృశ్యకావ్యం