Monday, 5 January 2026

నిరంతర అద్భుతం

 

ఆలోచనలు
జనప నారలా

ఆలోచనలు
అల్లుకుపోతూ

ఆలోచనలు
గొలుసు కట్టుగా

ప్రయోజనకర ఆలోచనలు
భవితకి బంగరు బాట వేసే
ఆలోచనలు
పరులకు సాయపడే
అలోచనలు
ఆలోచనల నార
అద్భుతంగా కొనసాగాలి
నిరంతరాయంగా


చూడ ముచ్చట

 

అబ్బాయి   అమ్మాయి
చూపులు  చిక్కుకుంటాయి

విడదీసే ప్రయత్నం కూడా
చేయరు వారు

చూపుల  చిక్కులో
ఎంతందం

చూపులు  చిక్కుకుంటే
చూడ ముచ్చట

వివాహ బంధంగా మారితే
వారికది
జీవన సాఫల్యం

6.1.26

నలుపు తెలుపు

 నల్ల మనసు అంచు

భీకరం

భీభత్సం 

అంద విహీనం


మనసు నలుపయితే

అంచు కూడా  నలుపే


మనసే‌ తన రంగును

అంచును మార్చుకోవాలి


నిర్మలమైన మనసుకి

తెలుపే అందం

అంచు కూడా  మారుతుంది

తెలుపు రంగుకే


16.9.26

వెన్నెల సొగసు

 వెన్నెల రుచి

ఎంత కమ్మదనం


వెన్నెల

ఏమందం  


వెన్నెల సొగసులు 

అద్భుతం 

ఆకర్షణీయం

అనిర్వచనీయం



పున్నమి చంద్రుని

అమూల్య కానుక 

అడవికి సైతం

నిరుపేదకి సైతం


3.1.26

స్వచ్ఛమైన హృదయం

 హృదయం 

ఓ తెల్ల కాగితం 

ఏదైనా  రాయవచ్చు 


ఆ తెల్ల కాగితాన్ని 

మలినం చేయొద్దు


తెల్ల కాగితం మీద

అందమైన  చిత్రం 

తీసుకోవచ్చు 


అందమైన   రాతలు

రాసుకోవచ్చు 


తెల్ల కాగితం 

ఎంత స్వచ్ఛంగా ఉంటే 

హృదయం అంత నిర్మలం


స్వచ్ఛమైన  హృదయాన్ని 

ప్రేమిస్తారు అందరూ


15. 12.25

మృదువైన తుఫాన్లు

 తుఫాను 

భయం భయం 


తుఫాను  హెచ్చరికలకి

అంతా అప్రమత్తం


కానీ కొన్ని  తుఫానులు

అతి మృదువు

ఇలా వచ్చి 

అలా మాయమౌతాయి


జీవితాన కొన్ని 

సంఘటనలు 

తుఫానులా అనిపిస్తాయి  కానీ

చివరకి  మనకి

ఎంతో ప్రేమని

పంచి పెడతాయి


తుఫాను వల్ల  నష్టం 

సంభవించొచ్చు కానీ

మృదువైన తుఫాను 

అప్పుడప్పుడు మనదాకా

చేరకుండానే వెళ్లిపోతుంది

30.12.25

నిత్య దీపావళి

 బంధమే 

ఓ దీపం

అది ఎన్నటికీ 

ఆరిపోని దీపం


ప్రకాశవంతమైన  దీపం 

జీవితాన వెలుగునిచ్చే  దీపం


బంధాల దీపాలు  

ఎన్నెన్నో 


ప్రేయసీ ప్రియుల బంధం

భార్యాభర్తల బంధం 


మిత్రబంధం 

కన్నబిడ్డల  బంధం

తోబుట్టువుల బంధం


ఉన్న ఊరితో బంధం

రైతన్నకి పంటచేలతో బంధం  

ఆత్మీయతా బంధాలు


బంధాల దీపాలు 

మరిన్ని వెలిగిద్దాం 

జీవితాన్ని 

నిత్య దీపావళిగా

మార్చుకుందాం


30.1.25

రహస్య అడుగు

 పొలంలో

రహస్య అడుగు 


ఇంటి తోటలో

రహస్య అడుగు 


ఇంటితోటలో

రహస్య అడుగు గురించి 

ఎంతయినా ఆలోచిస్తాం

పరిశీలిస్తాం

పరిశోధిస్తాం


పొలంలో

రహస్య  అడుగుల గురించి 

రైతన్న  జాగ్రత్త పడకతప్పదు


రహస్య అడుగు 

రహస్య  ప్రేమికుడిది కావొచ్చు 

ఆ అడుగు  చూసుకుంటూ 

ప్రియురాలు 

మురిసిపోతుంది



28.12.26

శ్వాసకి ఉచ్చు

 శ్వాసకే ఉచ్చు

పడితే

ఒకొక్కప్పుడు ఊపిరి

ఆగినంత పని అవుతుంది 


మనం ప్రేమించిన వారికి

ఏమయినా మన గుండె 

ఆగిపోతుంది కూడా 


వాయు కాలుష్యంతో

నీటి కాలుష్యంతో 

మన శ్వాసకే ఉచ్చు 


ప్రమాదాలను

కాలుష్యాన్ని అరికడదాం

శ్వాస  ఉచ్చును తొలగిద్దాం

28.12.26

చేదు జ్ఞాపకాలు

 మధుర జ్ఞాపకాలు 

చీలిపోతాయి

అవి చేదు జ్ఞాపకాలుగా

మారిపోతే


ప్రేమ ఎంత  మధురం 

అపార్ధాలు

అహం

అనుమానం 

అన్నీ ఆ జ్ఞాపకాలను

చీల్చేస్తాయి


జ్ఞాపకాలు 

ఎప్పటికీ సుమధురంగా

మిగిలిపోవాలి

మన హృదయంలో


26.12.26

కన్నీటి బతుకులు

 ఉద్యోగాల పేరుతో 

దూర ప్రాంతాలకు

తరలిపోయే కన్నబిడ్డల 

కోసం తల్లితండ్రుల 

కన్నీటి రేఖ


అపురూపంగా పెంచుకున్న 

కన్న కూతురిని

అత్తవారింటికి పంపిస్తూ 

అప్పగింతలు పెడుతుంటే 

పుట్టింటివారి కన్నీటి రేఖ 


నమ్ముకున్న గ్రామంలో 

ఉపాధిలేక

పట్టణాలకి తరలిపోయే

పల్లె బతుకుల కన్నీటి రేఖ


ఎందరి జీవితాలలోనో

కన్నీటి రేఖలు


ఐనా చిరునవ్వుని

పులుముకుని 

కష్టం పరులకి తెలియకుండా 

రోజులు  గడుపుతారు ఎందరో 


26.12.26