ఆసేతు హిమాచలమూ. ...
ఆసేతు హిమాచలమూ
జరుపుకునే
పండుగలు
సంబరాలు ఎన్నెన్నో
సంక్రాంతి
ఉగాది
వినాయక చవితి
రాఖీ
దసరా
బతుకమ్మ
దీపావళి
రంజాన్
క్రిస్టమస్
బుద్ధ జయంతి
మహావీర జయంతి
పరస్పరం శుభాకాంక్షలు
తెలుపుకునే
అవకాశాలెన్నో
కారుచీకట్లు కమ్మే
బతుకులలో
దీపావళి రావాలని
జనులంతా కలిసి
నవోదయాలని స్వాగతించాలని
ఆకాంక్షలు ఎన్నెన్నో. ....
No comments:
Post a Comment