ఇది నా స్వీయ రచన
కొత్త జీవితం
జాహ్నవి తండ్రికి డబ్బుకి కొదవలేదు. ఆ అమ్మాయి డిగ్రీ పూర్తవగానే ఆస్తిపాస్తులున్న గొప్పింటికి కోడల్ని చేసేడు.
జాహ్నవి స్నేహితురాలు సుజాత అన్న సాగర్.సైన్యంలో పనిచేసి ఆరోగ్య కారణాలవల్ల వెనక్కి వచ్చేసి బ్యాంక్ ఉద్యోగంలో చేరేడు.
జాహ్నవికి ఓ కూతురు.కారు ప్రమాదంలో జాహ్నవి భర్త మరణిస్తే కూతురుని, మనవరాలిని తన ఇంటికి తీసుకొని వచ్చేసాడు జాహ్నవి తండ్రి.
జాహ్నవి కూతురుకి లెక్కలు, సైన్స్ నేర్పమని సుజాతని కోరుతుంది. "నాకంటే మా అన్నయ్య బాగా నేర్పగలడు" అని జాహ్నవికి సుజాత చెప్తుంది.
అలా జాహ్నవి కూతురు ప్రియ సాగర్ కి చేరికవుతుంది.
సుజాతకి జాహ్నవి తండ్రి దగ్గర బాగా చనువు ఉంటుంది. అతనితో ఒకసారి "జాహ్నవికి మా అన్నయ్య సాగర్ తో పెళ్ళి చేస్తే జాహ్నవి, ప్రియ సంతోషం గా ఉంటారు.మా అన్నయ్యకి కూడా జాహ్నవి అంటే ఇష్టం"అని చెప్తుంది.
కూతురి జీవితం బాగుండాలని జాహ్నవి తండ్రి వెంటనే వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు.
అలా వారిద్దరి కొత్త జీవితం మొదలవుతుంది.
No comments:
Post a Comment