Friday, 1 November 2024

ప్రమాణాలు

 ప్రమాణాలు 

ఇద్దరూ ప్రమాణాలు చేసుకున్నారు. పెళ్లి  చేసుకోవాలనుకున్నారు. కానీ ఒకరు ఆస్ట్రేలియా కి,  ఒకరు అమెరికా కి వెళ్ళిపోయారు. ఎవరి ప్రాధాన్యతలు వారివి. ఎవరి మార్గం వారిది.


విడిపోయిన ఆ జంట వినయ్, విద్య.

ప్రమాణాలే నిలుపుకోలేదు కాబట్టి మనసులూ విడిపోయాయి. తనకే నేనవసరం లేకపోతే నేనెందుకు తనని కావాలనుకోవాలి అనే ధోరణిలో ఉన్నారు ఇద్దరూ. 


ఉద్యోగంలో ఇద్దరూ అనుకున్నది సాధించారు కానీ  ఏదో  వెలితి. మరొక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని ఇద్దరూ అనుకోలేదు .

తల్లితండ్రులు చెప్పినా వాళ్ల మాట వినలేదు. 

ఇద్దరూ తమ స్నేహితురాలి పెళ్ళిలో ఇండియా లో కలిసేరు. అప్పుడు ఒక స్నేహితుడు "నేను ఒక స్టార్ట్ అప్ కంపెనీ మొదలెట్టేను. బాగానే  నడుస్తోంది. మీ ఇద్దరూ మన దేశం 

వచ్చేసి నా కంపెనీ లో  చేరండి " అని 

అడిగేడు. 

ఇద్దరూ ఆ ప్రతిపాదన కి ఒప్పుకున్నారు. ఇండియా కి తిరిగివచ్చి ఆ కంపెనీలో చేరేరు.


కొన్నాళ్ళకి ఇద్దరికీ తమ‌ తప్పు తెలిసొచ్చింది. ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమ అర్ధమయి పెళ్లి  చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.


ఇద్దరి తల్లితండ్రులూ చాలా ఆనందించేరు, ఇకపైన  వాళ్లు  ఇండియాలోనే ఉంటారని, ఇప్పటికైనా పెళ్లికి అంగీకరించారని.


No comments:

Post a Comment