తెరవబడిన
తలుపు వెనక
గుప్తనిధి ఉండొచ్చు
ప్రేమించిన అమ్మాయి
గాజుల సవ్వడి
నీకు స్వాగతం పలకొచ్చు
నువ్వు తలుపు తెరిస్తే
అదృష్టం నీ జీవితంలో
ప్రవేశించొచ్చు
ఊహించని విధంగా
ప్రియమితృడే
తలుపు తీయొచ్చు
తీయబడ్డ తలుపు
వెనక
నిందా వాక్యాలు
పరుషవాక్యాలు కూడా
వినిపించవచ్చు
2.11.25
No comments:
Post a Comment