అంశం: పుట్టుక--చావు
తేది: 29.11.24
పేరు: డాక్టర్ గుమ్మా భవాని
శీర్షిక: మనం ఎరుగని స్వర్గం
ఎంతో కష్టపడి
బిడ్డను కని
తను కూడా పునర్జన్మ
పొందుతుంది మాతృమూర్తి
ఎవరితోనీ ప్రమేయం
లేకుండా నిశ్శబ్దంగా
తనువు చాలిస్తాడు జీవుడు
జగన్నాటకంలో పాత్రధారులం
మనం పోషించిన పాత్ర
మన పుట్టుకను అర్ధవంతంగా
గొప్ప పాత్రను పోషిస్తే
చావుని చెరిపేసి అమరులుగ
మారుస్తుంది
మనది మరణయాతన
ఆత్మీయులకి మనోవేదన
చావు బంధ విముక్తుణ్ణి చేస్తుంది
మనం ఎరుగని స్వర్గమే అది
No comments:
Post a Comment