ఇది నా స్వీయ రచన
బుజ్జమ్మ
"బుజ్జమ్మ పడుక్కుందా" వంశీ అడిగాడు.
"అవునండీ,ఇంకా లేవలేదు" వంశీ భార్య సత్య చెప్పింది.
"పడుక్కోనీలే, ఒకరోజు కాలేజీ మానేస్తే ఏం నష్టం లేదు. నేనిక వెళ్తా" అని గబగబా వెళ్ళిపోయాడు వంశీ.
ప్రేరణకి అకస్మాత్తుగా తెలివొచ్చింది.
"అమ్మో, నేను క్లాస్ మిస్సవుతా"
అనుకుని హడావుడిగా తెమిలిపోయి వదిన రడీగా ఉంచిన టిఫిన్ బాక్స్ పట్టుకుని కాలేజీకి పరిగెత్తింది ప్రేరణ.
* * * * *
"నువ్వు మీ అన్నయ్య క్లాస్ ఖచ్చితంగా మిస్సవవని నాకు తెలుసు" నవ్వుతూ అంది రేఖ.
"మా అన్నయ్య కోటిమందిలో ఒక్కడు. అలాటి అన్నయ్య నాకే ఉన్నాడని మీకు కుళ్ళు" అంది
ప్రేరణ.
క్లాస్ లో ప్రేరణ కనబడగానే వంశీ కళ్ళు మెరిసాయి. ఇంగ్లీషు పిరియడ్ లో విద్యార్ధులంతా వేరే లోకానికి వెళ్ళిపోతారు. వంశీ చెల్లెలని కాలేజీలో ఆమెని అంతా
ప్రత్యేకం గా చూస్తారు.
సాయంత్రం ప్రేరణ అభిషేక్ ని కలిసింది. రేఖ వాళ్ళింటికి అభిషేక్ వచ్చేడు. వాళ్ళింట్లో ఆ సమయం లో స్నేహితురాళ్ళు ఇద్దరే ఉన్నారు.
ప్రేరణ అభిషేక్ తో "మా వదిన కజిన్ వని నీ ప్రపోజల్ కి ఒప్పుకున్నా. నా చదువు పూర్తి కావాలి. మా అన్నయ్య పెళ్లికి ఒప్పుకోవాలి. ఈసారి నుండి మా ఇంట్లోనే కలువు" అని చెప్పేసి వెళ్ళిపోయింది.
ప్రేరణ ఒప్పుకున్నందుకు ఎగిరి గంతేశాడు అభిషేక్. ప్రేరణ వదిన
సత్యతో తన మనసులో మాట చెప్పేడు అభిషేక్. సత్య వంశీతో
ప్రేరణ పెళ్లి చేద్దామంటూ మొదలెట్టి అభిషేక్ ప్రస్థావన తీసుకొచ్చింది.
ప్రేరణ పరీక్షలయ్యాక వంశీ తన చెల్లెలు ని "అభిషేక్ అంటే నీకు ఇష్టమేనా " అని అడిగాడు.
ప్రేరణ"నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్యా" అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ప్రేరణ, అభిషేక్ సంవత్సరమై గాఢ ప్రేమ లో ఉన్నారని సత్యకి తెలుసు. రాత్రుళ్ళు తీరిగ్గా కబుర్లు చెప్పుకుని ప్రేరణ తాపీగా నిద్ర లేస్తుందని కూడా సత్యకి తెలుసు. వాళ్ల ప్రేమ కి సాయం చేసిందంతే.
No comments:
Post a Comment