Friday, 1 November 2024

పిల్ల రాక్షసులు

 ఇది నా స్వీయ ‌రచన


పిల్ల రాక్షసులు 


అది  ఒక డూప్లెక్స్ ఇల్లు.  సాయంత్రం  ఐదు కావస్తోంది. సెలవు దినం కావడం తో హాల్లో ఉన్న  యువ దంపతులు ఇంకా బద్ధకంగానే ఉన్నారు.


అది మేడ మీద హాల్. పెద్ద టి.విలో ప్రోగ్రాం లు చూడటానికి రెండు  జంటలు 

పైనున్నాయి.

అరుణ్, అమల యువ జంట. 

"పిల్లలిద్దరూ  ఏరి? అకస్మాత్తుగా అరుణ్ అమలని అడిగేడు. 

" ఎక్కడో దెబ్బలాడుకోవడం, కొట్టుకోవటం  చేస్తుంటారు, పిల్ల రాక్షసులు "అంది అమల.

" సరే కానీ అరటికాయ  బజ్జీలు  చేయొచ్చుగా" అరుణ్ అన్నాడు. 

"నాకు ఓపిక లేదు.  మీరు చెయ్యండి. నా కూ తినాలనుంది" అమల సమాధానమిచ్చింది.

"అమ్మా, నువ్వైనా  చేయవే" అన్నాడు  అరుణ్  వాళ్ళ అమ్మ తో".

"నాకు  అసలు  ఓపిక లేదురా. నువ్వు  మీ నాన్న కలిసి బజ్జీలు  వేసి తీసుకురండి" అంది వాళ్ల అమ్మ. 

"ఇదిగో నన్నందులోకి లాగకు. అంతగా తినాలనిపిస్తే ఆర్డర్  పెట్టుకుందాం" అన్నాడు  అరుణ్  వాళ్ళ నాన్న  టి.వి చూస్తూనే. 

ఇంతలో పిల్ల  రాక్షసులు  ఇద్దరూ టిఫిన్  ప్లేట్లు, అరటికాయ  బజ్జీలు పట్టుకొని  హాల్లోకొచ్చేరు.

"నేను ,చెల్లి  యూ ట్యూబ్  చూసి నేర్చుకొని బజ్జీలు  వేసేం. మాకయితే బాగా  వచ్చేయి. మీకు  ఎవరికి నచ్చక పోయినా  వాళ్ళవి మేం తినేస్తాం" అని

వార్నింగ్ ఇచ్చాడు  అన్న రాక్షసుడు. 


మిగతా నలుగురూ ఇథోపియా కరువు బాధితుల్లా బజ్జీలమీద కలియబడ్డారు.

No comments:

Post a Comment